BSNL Special Plan: సింగిల్ రీఛార్జ్‌తో 425 రోజుల వ్యాలిడిటీ, 850 జీబీ డేటా - జనవరి 16 వరకే బీఎస్ఎన్ఎల్ ఆఫర్!
BSNL Annual Plan: బీఎన్ఎన్ఎల్ తన వార్షిక ప్లాన్ ద్వారా అదనపు వ్యాలిడిటీని అందిస్తుంది. దీంతో ఈ ప్లాన్ వ్యాలిడిటీ 425 రోజులకు పెరగనుంది.
BSNL Recharge Plan: ప్రభుత్వ టెలికాం సంస్థ భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (BSNL) తన వినియోగదారులకు నూతన సంవత్సరం సందర్భంగా గొప్ప బహుమతిని అందించింది. కంపెనీ తన ప్లాన్‌లలో ఒకదాని వాలిడిటీని నెల రోజులు పెంచింది. దీనికి ఎటువంటి అదనపు ఛార్జీ వసూలు చేయడం లేదు. ఇప్పుడు బీఎస్ఎన్ఎల్ 395 రోజుల వ్యాలిడిటీ ప్లాన్ 425 రోజుల వ్యాలిడిటీని పొందుతుంది. అంటే ఒకసారి రీఛార్జ్ చేసుకున్న తర్వాత కస్టమర్లు 14 నెలల వరకు వ్యాలిడిటీ గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్న మాట.
ఏ ప్లాన్‌పై ఈ లాభం?
రూ.2,399కే కస్టమర్లు ఈ ప్రయోజనాలను పొందుతారని బీఎస్ఎన్ఎల్ తెలిపింది. ఇంతకుముందు ఈ ప్లాన్‌కు 395 రోజుల వ్యాలిడిటీ లభిస్తుంది. ప్రతి రోజూ 2 జీబీ డేటా లభిస్తుంది. ఇప్పుడు కొత్త సంవత్సరం సందర్భంగా కంపెనీ ఈ ప్రయోజనాలను మరో నెల పొడిగించింది. అంటే ఇప్పుడు రూ.2,399కి మీకు 425 రోజుల వ్యాలిడిటీ, మొత్తంగా 850 జీబీ డేటా లభిస్తుంది. విశేషమేమిటంటే దీని కోసం వినియోగదారులు ఎటువంటి అదనపు చెల్లింపులు చేయాల్సిన అవసరం లేదు.
Also Read: విమానంలో ఫోన్ ఎందుకు ఫ్లైట్ మోడ్‌లో పెట్టాలి? - పెట్టకపోతే ఏం జరుగుతుంది?
లాంగ్ వాలిడిటీతో పాటు కంపెనీ ఈ ప్లాన్‌లో అపరిమిత ఉచిత కాలింగ్ సౌకర్యాన్ని కూడా అందిస్తోంది. అంటే కస్టమర్లు దేశంలోని ఏ నంబర్‌కైనా అపరిమిత వాయిస్ కాల్‌లు చేయగలరు. ఇది కాకుండా ప్రతిరోజూ 100 ఉచిత ఎస్ఎంఎస్‌ల ప్రయోజనం కూడా అందిస్తున్నారు. రోజువారీ ఖర్చు రూ. 5.5తో 14 నెలల పాటు కస్టమర్లు ఈ ప్రయోజనాలన్నింటినీ పొందుతారు. ఈ ప్రయోజనాలను పొందాలంటే జనవరి 16వ తేదీ వరకే వినియోగదారులకు అవకాశం ఉంటుంది. కంపెనీ ఈ ఆఫర్‌ను 2025 జనవరి 16వ తేదీ వరకు మాత్రమే అందిస్తోంది. ఒకవేళ ఆలస్యం అయితే మీరు ఈ ఆఫర్ ప్రయోజనాన్ని పొందలేరు.
రూ.277 ప్లాన్‌తో 120 జీబీ డేటా
న్యూ ఇయర్ సందర్భంగా బీఎస్ఎన్ఎల్ మరో ఆఫర్‌ను విడుదల చేసింది. ఇందులో వినియోగదారులు రూ. 277 రీఛార్జ్‌పై 120 జీబీ ఉచిత డేటా, అపరిమిత ఉచిత కాలింగ్‌ను పొందుతున్నారు. ఈ ఆఫర్ కూడా జనవరి 16వ తేదీ వరకు అందుబాటులో ఉండనుంది.
Also Read: గూగుల్ పేలో ట్రాన్సాక్షన్లు డిలీట్ చేయడం ఎలా? - సింపుల్ స్టెప్స్‌తో పని అయిపోతుంది!
Get 2GB/Day Data & Unlimited Calls for 425 Days – all for just ₹2399/-!
— BSNL India (@BSNLCorporate) January 2, 2025
Hurry, offer valid till 16th Jan 2025 – don’t let this deal slip away!
Stay ahead. Stay connected. Stay with BSNL!#BSNLIndia #UnlimitedCalls #2GBData #StayConnected pic.twitter.com/23lkFS3phH
We’ve hit a major milestone – 30,000 mobile user activations for #BiTV in Puducherry in just 8 days.
— BSNL India (@BSNLCorporate) January 1, 2025
The wonderful people of the coastal town made this journey unforgettable, and the best is yet to come!
Nandri, Puducherry!#BSNLIndia #BSNLBiTV #BSNL #Pondicherry pic.twitter.com/uXoQ7ujEaG