BSNL: బీఎస్ఎన్ఎల్ సూపర్ ప్లాన్ ఇదే - రూ.22కే 90 రోజుల పాటు!
ప్రభుత్వ రంగ టెలికాం సంస్థ బీఎస్ఎన్ఎల్ రూ.22కే సర్వీస్ వ్యాలిడిటీని అందిస్తుంది.
BSNL Small Recharge Plan: రీఛార్జ్ ప్లాన్‌లు గత కొన్ని సంవత్సరాలుగా ఖరీదైనవిగా మారాయి. అన్ని టెలికాం కంపెనీలు రీఛార్జ్ ప్లాన్‌ను ఖరీదైనవిగా మార్చాయి. ప్రతి నెలా రీఛార్జ్ చేయకపోయినా, సిమ్‌లో ఇన్‌కమింగ్, అవుట్‌గోయింగ్ సౌకర్యం ఆగిపోతుంది. ఇలాంటి పరిస్థితుల్లో రెండు సిమ్‌కార్డులు ఉన్నవారు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
మీరు కూడా ఈ సమస్యను ఎదుర్కొంటున్నట్లయితే, చవకైన రీఛార్జ్ ప్లాన్ కోసం చూస్తున్నట్లయితే మీ కోసం ఇక్కడ ఒక మంచి ప్లాన్ ఉంది. ఈ రీఛార్జ్ ప్లాన్ మరింత వ్యాలిడిటీతో పాటు తక్కువ ధరతో వస్తుంది. ఈ రీఛార్జ్ కింద మీరు కాల్ చేసే సౌకర్యాన్ని కూడా పొందవచ్చు.
22 రూపాయలకు 90 రోజుల వ్యాలిడిటీ
రూ. 22 రీఛార్జ్ ప్లాన్ 90 రోజులు అంటే మూడు నెలల సర్వీస్ వ్యాలిడిటీ వస్తుంది. దీంతో మీరు కాల్స్ చేసుకోవచ్చు. మీ సిమ్ మూడు నెలల పాటు యాక్టివ్‌గా ఉంటుంది. అయితే కాల్స్ ఫ్రీగా చేసుకోవటానికి ఉండదు. బ్యాలెన్స్ వేయించుకోవాల్సి ఉంటుంది. ఎస్టీడీ, లోకల్ కాలింగ్‌కు నిమిషానికి 30 పైసలు వసూలు చేస్తారు. అలాగే ఉచిత ఇంటర్నెట్, SMS సౌకర్యం అందుబాటులో ఉండదు. ఈ ప్లాన్ బీఎస్ఎన్‌ఎల్‌లో అందుబాటులో ఉంది.
Airtel, Vi అందించే చిన్న ప్లాన్లు
Airtel నుంచి అతి చిన్న ప్లాన్ రూ. 155. దీని కింద మీకు 1 GB డేటా, ఉచిత వాయిస్ కాలింగ్ సౌకర్యం అందిస్తారు. అదే సమయంలో, వొడాఫోన్ ఐడియా ద్వారా 24 రోజుల పాటు రూ. 155 రీఛార్జ్ ప్లాన్ కూడా లభిస్తుంది. దీనిలో ఉచిత కాలింగ్, డేటా ప్రయోజనం కూడా అందుబాటులో ఉంటుంది.
మూడు నెలలకు ఒకసారి రీఛార్జ్ చేస్తే చాలు
మీరు రెండు సిమ్‌లను ఉంచాలనుకుంటే BSNL యొక్క ఈ ప్లాన్‌ని ఎంచుకోవచ్చు. ఎందుకంటే రూ.22కే సర్వీస్ వ్యాలిడిటీ లభిస్తుందిగా.
బీఎస్ఎన్ఎల్ ఇటీవలే కొన్ని కొత్త ప్రీపెయిడ్ ప్లాన్లను మనదేశంలో లాంచ్ చేసింది. ఈ కొత్త ప్లాన్లు అన్ని రాష్ట్రాల్లోని వినియోగదారులు అందరికీ అందుబాటులో ఉన్నాయి. వీటిలో అన్నిటికంటే ఖరీదైన ప్లాన్ ధర రూ.1,198 కాగా, రెండో ప్లాన్ ధర రూ.439గా బీఎస్ఎన్ఎల్ నిర్ణయించింది.
బీఎస్ఎన్ఎల్ రూ.1,198 ప్రీపెయిడ్ ప్లాన్ వివరాలు, లాభాలు
ఈ ప్లాన్ వ్యాలిడిటీ 365 రోజులుగా ఉంది. లాంగ్ టర్మ్ ప్లాన్లు కావాలనుకునేవారికి ఇది మంచి ఆప్షన్. నెలకు 3 జీబీ డేటా, 300 నిమిషాల కాలింగ్, 30 ఎస్ఎంఎస్‌లు ఈ ప్లాన్ ద్వారా లభించనున్నాయి. ప్రతి నెల ప్రారంభంలో ఇవి మళ్లీ రెన్యూ అవుతాయి. ముందు నెల డేటా, కాలింగ్, ఎస్ఎంఎస్ లాభాలు మిగిలి పోతే అవి వచ్చే నెలకు క్యారీ అవ్వవని కంపెనీ తెలిపింది.
బీఎస్ఎన్ఎల్ రూ.439 ప్రీపెయిడ్ ప్లాన్ వివరాలు, లాభాలు
ఇది బీఎస్ఎన్ఎల్ లాంచ్ చేసిన కొత్త ప్లాన్. దీని వ్యాలిడిటీ 90 రోజులుగా ఉంది. అన్‌లిమిడెట్ వాయిస్ కాలింగ్, 300 ఎస్ఎంఎస్‌లను ఈ ప్లాన్ ద్వారా అందించనున్నారు. అయితే ఈ ప్లాన్ ద్వారా డేటా మాత్రం కంపెనీ అందించడం లేదు.
Read Also: వాట్సాప్ నుంచి సరికొత్త ఫీచర్, ఇకపై మీ స్క్రీన్ ఇతరులకు షేర్ చెయ్యొచ్చు!