By: ABP Desam | Updated at : 05 Nov 2022 09:48 PM (IST)
Edited By: Eleti Saketh Reddy
బీఎస్ఎన్ఎల్ రెండు కొత్త ప్లాన్లు లాంచ్ చేసింది.
బీఎస్ఎన్ఎల్ రెండు కొత్త ప్రీపెయిడ్ ప్లాన్లను మనదేశంలో లాంచ్ చేసింది. ఈ కొత్త ప్లాన్లు అందరికీ అందుబాటులో ఉన్నాయి. వీటిలో అన్నిటికంటే ఖరీదైన ప్లాన్ ధర రూ.1,198 కాగా, చవకైన రెండో ప్లాన్ ధర రూ.439గా ఉంది. ఈ రెండు ప్లాన్ల లాభాలు ఏ విధంగా ఉన్నాయో చూద్దాం.
బీఎస్ఎన్ఎల్ రూ.1,198 ప్రీపెయిడ్ ప్లాన్
ఈ ప్లాన్ వ్యాలిడిటీ 365 రోజులుగా ఉంది. లాంగ్ టర్మ్ ప్లాన్లు కావాలనుకునేవారికి ఇది మంచి ఆప్షన్. నెలకు 3 జీబీ డేటా, 300 నిమిషాల కాలింగ్, 30 ఎస్ఎంఎస్‌లు ఈ ప్లాన్ ద్వారా లభించనున్నాయి. ప్రతి నెల ప్రారంభంలో ఇవి మళ్లీ రెన్యూ అవుతాయి. ముందు నెల డేటా, కాలింగ్, ఎస్ఎంఎస్ లాభాలు మిగిలితే అవి వచ్చే నెలకు క్యారీ అవ్వవని కంపెనీ తెలిపింది.
బీఎస్ఎన్ఎల్ రూ.439 ప్రీపెయిడ్ ప్లాన్
ఇది బీఎస్ఎన్ఎల్ లాంచ్ చేసిన కొత్త ప్లాన్. దీని వ్యాలిడిటీ 90 రోజులుగా ఉంది. అన్‌లిమిడెట్ వాయిస్ కాలింగ్, 300 ఎస్ఎంఎస్‌లను ఈ ప్లాన్ ద్వారా అందించనున్నారు. అయితే ఈ ప్లాన్ ద్వారా డేటా మాత్రం కంపెనీ అందించడం లేదు.
బీఎస్ఎన్ఎల్ దగ్గర మిగతా నెట్‌వర్క్‌ల లేని ప్లాన్లు కూడా ఉన్నాయి. అదే రూ.398 ప్లాన్. బీఎస్ఎన్ఎల్ రూ.398 ప్లాన్ ద్వారా అన్‌లిమిటెడ్ డేటాను అందించనుంది. దీంతోపాటు అన్‌లిమిటెడ్ వాయిస్ కాలింగ్, రోజుకు 100 ఎస్ఎంఎస్ కూడా లభించనున్నాయి. ఈ ప్లాన్ వ్యాలిడిటీ 30 రోజులుగా ఉంది. వొడాఫోన్ ఐడియా పోస్ట్ పెయిడ్‌లో రూ.699 ప్లాన్ ద్వారా ఇటువంటి లాభాలను అందించనుంది. కానీ బీఎస్ఎన్ఎల్ ప్లాన్ చాలా ధర తక్కువగా ఉంది.
బీఎస్ఎన్ఎల్ ఇటీవలే కొత్త ప్రీపెయిడ్ ప్లాన్‌ను కూడా అందుబాటులోకి తీసుకువచ్చింది. అదే రూ.2,022 ప్లాన్. ఈ ప్లాన్ ద్వారా అన్‌లిమిటెడ్ వాయిస్ కాలింగ్‌ను అందించనున్నారు. ఈ ప్లాన్ వ్యాలిడిటీ 300 రోజులుగా ఉంది. దీని ద్వారా 75 జీబీ డేటాను అందించనున్నారు. దీంతోపాటు రోజుకు 100 ఎస్ఎంఎస్, అన్‌లిమిటెడ్ కాలింగ్ లాభాలు కూడా లభించనున్నాయి.
WhatsApp New Feature: వాట్సాప్ కొత్త ఫీచర్ త్వరలో - ఇక ఐఫోన్ టు ఐఫోన్ కూడా!
Elon Musk: ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ పెయిడ్ ట్రాఫిక్ ఎక్కువట - సాక్ష్యాలతో పోస్ట్ చేసిన ఎలాన్ మస్క్!
Best Browser: మైక్రోసాఫ్ట్ ఎడ్జ్ వర్సెస్ గూగుల్ క్రోమ్ - ఈ మూడు విషయాల్లో ‘ఎడ్జ్’నే బెస్ట్!
Smartphone Hacking Signs: మీ ఫోన్ ఇలా ప్రవర్తిస్తుందా? - అయితే హ్యాక్ అయినట్లే - రీసెట్ చేయాల్సిందే!
Smartphone Charging Tips: ఫోన్ ఛార్జింగ్ పెట్టేటప్పుడు ఈ తప్పులు చేస్తున్నారా? - పేలిపోయే అవకాశం ఉంది జాగ్రత్త!
Telangana CM Revanth Reddy: సీఎం అయ్యాక రేవంత్ రెడ్డి తొలి ట్వీట్ చూశారా! వారందరికీ ప్రత్యేక ధన్యవాదాలు
Revanth Reddy: తెలంగాణను ఏలుతున్న ఫ్యామిలీని ముంచేసిన సునామీ రేవంత్ రెడ్డి!
Revanth Reddy Political Career: టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి రాజకీయ ప్రస్థానమిది- వివాదాలు, కేసులతోనూ సంచలనమే!
Sandeep Reddy Vanga: వర్మ ‘యానిమల్’ రివ్యూపై స్పందించిన సందీప్ - కొన్ని విషయాలు పక్కన పెట్టాల్సిందే!
/body>