అన్వేషించండి

Tips For Laptop: ల్యాప్ టాప్ వాడుతున్నారా? అయితే ఈ తప్పులు చేస్తున్నారా చూసుకోండి

ల్యాప్ టాప్ వాడకం ఎక్కువైంది. కానీ వాటిని వాడేటప్పుడు చేసే తప్పుల గురించి.. ఆలోచించం. మనకు తెలియకుండానే.. చిన్నచిన్న తప్పులు చేస్తుంటాం.

 

కరోనా కారణంగా ల్యాప్ టాప్ వాడకం ఎక్కువగా పెరిగిపోయింది. ఆన్ లైన్ క్లాసులు, వర్క్ ఫ్రమ్ హోమ్.. ఇలా చాలా మంది ఉపయోగిస్తున్నారు. అయితే వీటిని కొనేముందు అనేక రకాలుగా విచారించి కావాల్సిన ఫీచర్స్‌తో మనకు అనుకూలమై ధరలో నచ్చిన మోడల్‌ను ఎంచుకుంటాం. కానీ వాటిని సరిగా ఉపయోగిస్తున్నామా లేదా అనేదే అసలు పాయింట్. కొన్నిసార్లు నిర్లక్ష్యంతోనో.. లేకుంటే అవగాహన లేకుండా... వాటిని ఉపయోగించేప్పుడు తప్పులు చేస్తుంటాం. అదే ల్యాప్ టాప్ పనితీరుపై ప్రభావం చూపుతాయి. ఇలా అయితే కొన్ని రోజులకే ల్యాప్ టాప్ పై ఎఫెక్ట్ ఉంటుంది. మరి ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే ల్యాప్ టాప్ కి మంచిది,

మనకు అవసరం ఉన్నా... లేకున్నా.. ఓ తెగ ఛార్జింగ్ పెడుతుంటాం. 24 గంటలు ఛార్జింగ్ ఎక్కాల్సిందే అన్నట్టు చేస్తుంటాం.  ఇలా చేయడం మంచిది కాదు. 24 గంటలు  ల్యాప్‌టాప్ ఛార్జింగ్ పెట్టి ఉంచడం వల్ల ల్యాప్‌టాప్‌లోని కొన్ని లోపలి కాంపోనెంట్స్‌ కాలిపోయే ఛాన్స్ ఉంది. అందుకే గేమింగ్, వీడియో ఎడిటింగ్‌ చేసేప్పుడు మినహాయించి మిగిలిన సందర్భాల్లో ల్యాప్‌టాప్‌ ఆన్‌ చేసి ఉపయోగించకున్నా, స్లీప్‌ మోడ్‌లో ఉంచినా ఛార్జర్‌ తొలగించడం బెటర్.  ల్యాప్‌టాప్ బ్యాటరీ ఎక్కువ కాలం ఎలాంటి సమస్య లేకుండా పనిచేస్తుంది.

మనం ఏదో బిజీలో ఉంటాం.. వర్క్‌ టేబుల్‌పై ఉండే ల్యాప్‌టాప్‌, ఇతరత్రా వైర్ల గురించి పెద్దగా పట్టించుకోం. వాటిని సరిచేసుకునేందుకు ఇంట్రస్ట్ చూపించం. పనిలో పడి అటు ఇటు నడుసున్నప్పుడు మన కాళ్లకు తగలడం లేదా కుర్చీ కింద పడి వైర్లు పాడవుతుంటాయి. అలాంటి సందర్భాల్లో వైర్లు తెగిపోతుంటాయి. అందుకే ల్యాప్‌టాప్ ఛార్జింగ్‌ వైర్‌ లేదా ఇతరత్రా వైర్లను వీలైనంత వరకు మీకు అడ్డంలేకుండా చూసుకోండి.

ల్యాప్ టాప్ తీసుకున్నామో లేదో.. ఎలా పడితే అలా ఓపెన్ చేస్తాం... అయితే ల్యాప్ టాప్ ఓపెన్ చేసే పద్ధతిలోనూ తేడా ఉంటుంది. ల్యాప్‌టాప్‌ను సరైన పద్ధతిలో ఓపెన్ చేస్తున్నామా..లేదా అనేది ఆలోచించం. చాలామంది ల్యాప్‌టాప్‌ను సైడ్‌ కార్నర్ వైపు నుంచి ఓపెన్ చేస్తుంటారు. దాని వల్ల ల్యాప్‌టాప్‌ స్క్రీన్‌ ఒకవైపు మాత్రమే ఒత్తిడి ఏర్పడి డిస్‌ప్లే పాడయ్యే అవకాశం ఉంది. అందుకే ల్యాప్‌టాప్ తెరిచేముందు కీప్యాడ్ భాగం మీద ఒక చేతిని ఉంచి మరో చేత్తో స్క్రీన్‌ మధ్య భాగంలో పట్టుకుని తెరవడం మంచిది. దానివల్ల ల్యాప్‌టాప్ స్క్రీన్‌పై ఎలాంటి ఒత్తిడి ఉండదు.

ల్యాప్‌టాప్‌లకు కూడా విడిగా కూలింగ్ పాడ్ ఉపయోగిస్తుంటారు. మరి ల్యాప్‌టాప్‌లకు కూలింగ్ పాడ్ ఉపయోగించాలా..వద్దా అంటే ఉపయోగించడమే బెటర్. ల్యాప్‌టాప్‌ని టేబుల్ మీద ఉంచి ఉపయోగిస్తున్నప్పుడు కిందివైపున ఉండే వెంటిలేటర్స్ ద్వారా ఎయిర్‌ఫ్లో ఆగిపోయే అవకాశం ఉంది. దానివల్ల ల్యాప్‌టాప్‌లోని కొన్ని సున్నితమైన భాగాలు కాలిపోవచ్చు. అందుకే ల్యాప్‌టాప్‌లో ఎయిర్‌ఫ్లో నిరంతరాయంగా జరగాలంటే కూలింగ్ పాడ్‌ లేదా ల్యాప్‌టాప్‌ కింది భాగం గాలి తగిలేలా చిన్నపాటి స్టాండ్ ఏర్పాటు చేసుకోవాలి.
ఇంట్లో లేదా ఆఫీస్‌లో చాలా మంది తమ పని అయిపోయాక ల్యాప్‌టాప్ ను షట్‌డౌన్‌ చేయకుండా స్లీప్‌ మోడ్‌ లేదా హైబర్‌నేట్‌ మోడ్‌లో పెట్టెస్తుంటారు. చాలా సేపు ఇలా చేయడం వల్ల మీ ల్యాప్‌టాప్‌ పనితీరు పాడవుతుంది. మీరు షట్‌డౌన్‌ చేయాలనుకున్నప్పుడు ప్రాసెస్‌ ఆలస్యమవుతుంది. అందుకే మీ పని అయిపోయిన వెంటనే పీసీని షట్‌డౌన్ చేయాలి. 

ల్యాప్‌టాప్ కొన్నప్పుడు చాలా మంది తెలియక హార్డ్‌డిస్క్‌ను వేర్వేరు భాగాలు చేయకుండా ఉపయోగిస్తుంటారు. దానివల్ల ఓఎస్‌, ప్రోగ్రాం ఫైల్స్‌తోపాటు మీకు సంబంధిచిన ఇతరత్రా ఫైల్స్‌ కూడా ఒకే చోట స్టోర్‌ అయ్యే ఛాన్స్ ఉంది. మీకు అవసరమైన ఫైల్స్‌ను ప్రతిసారీ వెతికి తీసుకోవాల్సి వస్తుంది. దీని బదులు మీ హార్డ్‌డిస్క్‌ను ఒకటి కన్నా ఎక్కువ భాగాలుగా విభజిస్తే ఓఎస్‌, ప్రోగ్రాం ఫైల్స్ ఒకదాన్లో, మీకు ప్రొఫేషనల్, వ్యక్తిగత సమాచారం మిగిలిన వాటిలో సేవ్ చేసుకోవచ్చు. ఓఎస్‌ కోసం 60జీబీ నుంచి 70 జీబీ వరకు మెమొరీ కేటాయిస్తే సరిపోతుం

ఇంకా చదవండి
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Indiramma Indlu in Urban Area: తెలంగాణ పట్టణాల్లో గూడులేని పేదలకు గుడ్‌న్యూస్- జి ప్లస్1 తరహాలో ఇల్లు కట్టుకునేందుకు అవకాశం
తెలంగాణ పట్టణాల్లో గూడులేని పేదలకు గుడ్‌న్యూస్- జి ప్లస్1 తరహాలో ఇల్లు కట్టుకునేందుకు అవకాశం
Tuni Rapist Issue: తుని కీచక వృద్ధుడిపై పోక్సో కేసు - తమ పార్టీ కాదన్న టీడీపీ - చంద్రబాబు,లోకేష్ స్పందన
తుని కీచక వృద్ధుడిపై పోక్సో కేసు - తమ పార్టీ కాదన్న టీడీపీ - చంద్రబాబు,లోకేష్ స్పందన
Nakkapalli Bulk Drug Park: నక్కపల్లి బల్క్‌డ్రగ్‌ పార్క్‌ చుట్టూ రాజకీయం ! ప్రజల బలహీనతతో ఆడుకుంటున్న పార్టీలు! 
నక్కపల్లి బల్క్‌డ్రగ్‌ పార్క్‌ చుట్టూ రాజకీయం ! ప్రజల బలహీనతతో ఆడుకుంటున్న పార్టీలు! 
Telangana:  తెలంగాణ ప్రభుత్వ సంచలన నిర్ణయం - ట్రాన్స్‌పోర్ట్ చెక్‌పోస్టుల మూసివేత - అవినీతి ఆరోపణలే కారణం
తెలంగాణ ప్రభుత్వ సంచలన నిర్ణయం - ట్రాన్స్‌పోర్ట్ చెక్‌పోస్టుల మూసివేత - అవినీతి ఆరోపణలే కారణం
Advertisement

వీడియోలు

1987 Opera House Jewelry Heist | 40 సంవత్సరాలుగా దొరకని దొంగ
టెస్ట్‌ సిరీస్ కెప్టెన్‌గా పంత్.. వైస్ కెప్టెన్‌గా సాయి సుదర్శన్
ఒరే ఆజామూ..  1000 రోజులైందిరా!
బీసీసీఐ వార్నింగ్‌కి బెదరని నఖ్వి.. ట్రోఫీ నేనే ఇస్తానంటూ మొండి పట్టు
బంగ్లాదేశ్‌పై శ్రీలంక గెలుపుతో ఇండియాకి లైన్ క్లియర్!
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement
ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Indiramma Indlu in Urban Area: తెలంగాణ పట్టణాల్లో గూడులేని పేదలకు గుడ్‌న్యూస్- జి ప్లస్1 తరహాలో ఇల్లు కట్టుకునేందుకు అవకాశం
తెలంగాణ పట్టణాల్లో గూడులేని పేదలకు గుడ్‌న్యూస్- జి ప్లస్1 తరహాలో ఇల్లు కట్టుకునేందుకు అవకాశం
Tuni Rapist Issue: తుని కీచక వృద్ధుడిపై పోక్సో కేసు - తమ పార్టీ కాదన్న టీడీపీ - చంద్రబాబు,లోకేష్ స్పందన
తుని కీచక వృద్ధుడిపై పోక్సో కేసు - తమ పార్టీ కాదన్న టీడీపీ - చంద్రబాబు,లోకేష్ స్పందన
Nakkapalli Bulk Drug Park: నక్కపల్లి బల్క్‌డ్రగ్‌ పార్క్‌ చుట్టూ రాజకీయం ! ప్రజల బలహీనతతో ఆడుకుంటున్న పార్టీలు! 
నక్కపల్లి బల్క్‌డ్రగ్‌ పార్క్‌ చుట్టూ రాజకీయం ! ప్రజల బలహీనతతో ఆడుకుంటున్న పార్టీలు! 
Telangana:  తెలంగాణ ప్రభుత్వ సంచలన నిర్ణయం - ట్రాన్స్‌పోర్ట్ చెక్‌పోస్టుల మూసివేత - అవినీతి ఆరోపణలే కారణం
తెలంగాణ ప్రభుత్వ సంచలన నిర్ణయం - ట్రాన్స్‌పోర్ట్ చెక్‌పోస్టుల మూసివేత - అవినీతి ఆరోపణలే కారణం
Tuni Crime News: బాలికపై టీడీపీ నేత అత్యాచారయత్నం..! తోటలోకి తీసుకెళ్లి వెకిలి చేష్టలు.. పోక్సో కేసు
బాలికపై టీడీపీ నేత అత్యాచారయత్నం..! తోటలోకి తీసుకెళ్లి వెకిలి చేష్టలు.. పోక్సో కేసు
Amazon: ఐ ఫోన్‌ ఆర్డరిస్తే ఐక్యూ ఫోన్ డెలివరీ - అమెజాన్‌ను కోర్టుకు లాగిన కర్నూలు వాసి !
ఐ ఫోన్‌ ఆర్డరిస్తే ఐక్యూ ఫోన్ డెలివరీ - అమెజాన్‌ను కోర్టుకు లాగిన కర్నూలు వాసి !
Mass Jathara First Review: 'మాస్ జాతర' ఫస్ట్ రివ్యూ... ఆ గంటసేపూ ఊగిపోతాయ్ - రవితేజ అభిమానులకు కిక్ ఇచ్చేలా!
'మాస్ జాతర' ఫస్ట్ రివ్యూ... ఆ గంటసేపూ ఊగిపోతాయ్ - రవితేజ అభిమానులకు కిక్ ఇచ్చేలా!
Andhra Pradesh Rains: అల్పపడీనం ప్రభావంతో ఏపీలో భారీ వర్షాలు - పలు ప్రాంతాలకు ఫ్లాష్ ఫ్లడ్ అలర్ట్
అల్పపడీనం ప్రభావంతో ఏపీలో భారీ వర్షాలు - పలు ప్రాంతాలకు ఫ్లాష్ ఫ్లడ్ అలర్ట్
Embed widget