By: ABP Desam | Updated at : 28 Feb 2022 02:17 PM (IST)
Edited By: Eleti Saketh Reddy
అసుస్ 8జెడ్ స్మార్ట్ ఫోన్ మనదేశంలో లాంచ్ అయింది. (Image: Asus)
Asus 8Z India Launch: అసుస్ 8జెడ్ స్మార్ట్ ఫోన్ మనదేశంలో లాంచ్ అయింది. గతేడాది యూరోప్, తైవాన్‌ల్లో లాంచ్ అయిన అసుస్ జెన్‌ఫోన్ 8కు (Asus Zenfone 8) రీబ్రాండెడ్ వెర్షన్‌గా ఈ ఫోన్ మనదేశంలో ఎంట్రీ ఇచ్చింది. వినియోగదారులకు కాంపాప్ట్ ఫ్లాగ్‌షిప్ ఫోన్ అందించాలనే ఉద్దేశంతో కంపెనీ ఈ ఫోన్‌ను లాంచ్ చేసింది. ఇందులో 5.9 అంగుళాల డిస్‌ప్లేను అందించారు. క్వాల్‌కాం స్నాప్‌డ్రాగన్ 888 ప్రాసెసర్‌పై ఈ ఫోన్ పనిచేయనుంది.షియోమీ 11టీ ప్రో, శాంసంగ్ గెలాక్సీ ఎస్20 ఎఫ్ఈ 5జీ, వన్‌ప్లస్ 9ఆర్‌టీలతో ఈ ఫోన్ పోటీ పడనుంది.
అసుస్ 8జెడ్ ధర (Asus 8Z Price)
ఇందులో కేవలం ఒక్క వేరియంట్ మాత్రమే లాంచ్ అయింది. 8 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్‌తో వచ్చిన ఈ స్మార్ట్ ఫోన్ ధరను రూ.42,999గా నిర్ణయించారు. హారిజన్ సిల్వర్, ఆబ్సీడియన్ బ్లాక్ రంగుల్లో ఈ ఫోన్ కొనుగోలు చేయవచ్చు. మార్చి 7వ తేదీ నుంచి ఫ్లిప్‌కార్ట్‌లో దీని సేల్ ప్రారంభం కానుంది.
నిజానికి ఈ ఫోన్ గతేడాదే మనదేశంలో లాంచ్ కావాల్సి ఉంది. అయితే కరోనావైరస్ సెకండ్ వేవ్ కారణంగా సప్లై చైన్ సమస్యలు తలెత్తడంతో లాంచ్ ఆలస్యం అయింది.
అసుస్ 8జెడ్ స్పెసిఫికేషన్లు (Asus 8Z Specifications)
ఆండ్రాయిడ్ 11 ఆధారిత జెన్‌యూఐ 8 ఆపరేటింగ్ సిస్టంపై ఈ ఫోన్ పనిచేయనుంది. ఇందులో 5.9 అంగుళాల ఫుల్ హెచ్‌డీ+ శాంసంగ్ ఈ4 అమోఎల్ఈడీ డిస్‌ప్లేను అందించారు. దీని యాస్పెక్ట్ రేషియో 20:9గానూ, స్క్రీన్ రిఫ్రెష్ రేట్ 120 హెర్ట్జ్‌గానూ ఉంది. కార్నింగ్ గొరిల్లా గ్లాస్ విక్టస్ ప్రొటెక్షన్ కూడా ఇందులో ఉంది.
8 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్‌ను ఇందులో అందించారు. ఎన్‌టీఎఫ్ఎస్ ఫార్మాట్‌లో హెచ్‌డీడీ ద్వారా స్టోరేజ్‌ను పెంచుకునే అవకాశం ఉంది. మైక్రో ఎస్‌డీ కార్డు స్లాట్‌ను ఇందులో అందించలేదు. క్వాల్‌కాం స్నాప్‌డ్రాగన్ 888 ప్రాసెసర్‌పై ఈ ఫోన్ పనిచేయనుంది.
ఇక కెమెరాల విషయానికి వస్తే... ఫోన్ వెనకవైపు రెండు కెమెరాలు ఉన్నాయి. వీటిలో ప్రధాన కెమెరాగా 64 మెగాపిక్సెల్ సోనీ ఐఎంఎక్స్686 సెన్సార్‌ను అందించగా... దీంతోపాటు 12 మెగాపిక్సెల్ సోనీ ఐఎంఎక్స్363 సెన్సార్ అందుబాటులో ఉంది. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ముందువైపు సోనీ ఐఎంఎక్స్663 కెమెరాను అందించారు.
దీని బ్యాటరీ సామర్థ్యం 4000 ఎంఏహెచ్‌గా ఉంది. 30W ఫాస్ట్ చార్జింగ్‌ను ఈ ఫోన్ సపోర్ట్ చేయనుంది. 5జీ, 4జీ ఎల్టీఈ, వైఫై 6, బ్లూటూత్ వీ5.2, జీపీఎస్/ఏ-జీపీఎస్/నావిక్, యూఎస్‌బీ టైప్-సీ పోర్టు, 3.5 ఎంఎం హెడ్‌ఫోన్ జాక్ కూడా ఇందులో అందించారు. యాక్సెలరో మీటర్, యాంబియంట్ లైట్ సెన్సార్, గైరో, మ్యాగ్నెటోమీటర్, ప్రాక్సిమిటీ సెన్సార్‌లను ఇందులో అందించారు. అండర్ డిస్‌ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఇందులో ఉంది. దీని మందం 0.89 సెంటీమీటర్లు కాగా... బరువు 169 గ్రాములుగా ఉంది.
Also Read: శాంసంగ్ గెలాక్సీ ఎస్22 సిరీస్ ప్రీ-ఆర్డర్లు ప్రారంభం, కేవలం రూ.1,999కే!
Also Read: రూ.13 వేలలోనే రియల్‌మీ కొత్త ఫోన్, 50 మెగాపిక్సెల్ కెమెరా వంటి ఫీచర్లు!
Instagram New Feature: ఇన్‌స్టాగ్రామ్‌లో కొత్త ప్రైవసీ ఫీచర్ - డేటా మరింత సేఫ్ అయ్యేలా!
Infinix Smart 8 HD: రూ.ఆరు వేలకే స్మార్ట్ ఫోన్ - భారీ బ్యాటరీ, పెద్ద డిస్‌ప్లే - ఇన్ఫీనిక్స్ కొత్త ఫోన్ వచ్చేసింది!
Nudify Apps: అలాంటి యాప్‌లకు పెరుగుతున్న పాపులారిటీ- సంచలనం సృష్టిస్తున్ననివేదిక, !
WhatsApp New Feature: త్వరలో వాట్సాప్ సూపర్ మ్యూజిక్ ఫీచర్ - ఇకపై వీడియో కాల్స్‌లో కూడా!
Fraud Loan Apps: ఈ 17 లోన్ యాప్స్ మీరు వాడుతున్నారా? - వెంటనే ఆపేసి అన్ఇన్స్టాల్ చేయండి!
Bhatti Vikramarka: లక్షల కోట్ల అప్పుల్లో తెలంగాణ, ఛాలెంజ్ గా ఆర్థికశాఖ తీసుకున్నాను: భట్టి విక్రమార్క
Look Back 2023: భారీ సక్సెస్ కొట్టిన చిన్న సినిమాలు - ఈ ఏడాది టాలీవుడ్లో క్రేజీ సిక్సర్!
2024 TVS Apache RTR 160 4V: సూపర్ డిజైన్, అదిరిపోయే లుక్‌తో వచ్చిన కొత్త అపాచీ - ధర ఎంతో తెలుసా?
Mahalaxmi Scheme: రాష్ట్రంలో ఉచిత బస్సు ప్రయాణం - ప్రభుత్వ నిర్ణయంపై మహిళల హర్షం
/body>