By: ABP Desam | Updated at : 04 Jun 2023 04:20 PM (IST)
యాపిల్ త్వరలో మూడు కొత్త స్టోర్లు ప్రారంభించనుంది. ( Image Source : Twitter )
Apple Stores: ఏప్రిల్ నెలలో భారతదేశంలో యాపిల్ రెండు స్టోర్లను ప్రారంభించింది. వీటిలో ఒకటి ముంబైలో ఉన్న బీకేసీలోని జియో వరల్డ్ డ్రైవ్ మాల్‌లో, మరొకటి ఢిల్లీలోని సాకేత్‌లోని సెలెక్ట్ సిటీ వాక్ మాల్‌లో ఉంది. నెల రోజుల్లోనే రెండు స్టోర్లు రికార్డు స్థాయిలో వసూళ్లు సాధించాయి. ఈ విక్రయాలను చూసి కంపెనీ కూడా ఆశ్చర్యపోయింది.
మీడియాలో వినిపిస్తున్న కథనాల ప్రకారం యాపిల్ రెండు స్టోర్‌లు ఒక నెలలో రూ. 45 నుంచి రూ. 50 కోట్ల అమ్మకాలను చేశాయి. ఇది దీపావళి వంటి పండుగ సీజన్‌లో కూడా మొత్తం అమ్మకాల కంటే ఎక్కువ. 2027 నాటికి 53 కొత్త స్టోర్లను ప్రారంభించే ఆలోచనలో ఉన్నట్టు వార్తలు వస్తున్నాయి.
బ్లూమ్‌బెర్గ్ నివేదిక ప్రకారం ఆసియా పసిఫిక్ ప్రాంతం, యూరప్, మిడిల్ ఈస్ట్, అమెరికా, కెనడాలో 53 కొత్త స్టోర్లను ప్రారంభించాలని కంపెనీ పరిశీలిస్తోంది. కంపెనీ 24 తాజా స్టోర్లను ప్రారంభించగా, ఇప్పటికే ఉన్న కొన్ని స్టోర్లను పూర్తిగా రీడిజైన్ చేయనున్నారు. అంటే వాటి లుక్ పూర్తిగా మారిపోవడంతో పాటు కొత్తగా కూడా తయారవుతాయి. వాస్తవానికి యాపిల్ ఉత్పత్తులు అందరికీ చేరువయ్యేలా కంపెనీ తన ఆఫ్‌లైన్ స్టోర్‌లను పెంచాలని ఆలోచిస్తోంది.
భారతదేశంలో మరో మూడు కొత్త స్టోర్లు
నివేదికల ప్రకారం యాపిల్ భారతదేశంలో మూడు కొత్త స్టోర్లను ప్రారంభించాలని యోచిస్తోంది, వాటిలో రెండు ముంబైలో, ఒకటి ఢిల్లీలో ఉంటాయి. అంటే ఇప్పటికే యాపిల్ స్టోర్లు ఉన్న రెండు చోట్లా కంపెనీ స్టోర్ల సంఖ్యను పెంచబోతోంది. రానున్న కాలంలో యాపిల్ ముంబైలోని బోరివాలి, వర్లీలో రెండు కొత్త స్టోర్లను ప్రారంభించవచ్చు.
అదే విధంగా ఢిల్లీలోని DLF ప్రొమెనేడ్ షాపింగ్ మాల్‌లో కొత్త స్టోర్‌ను కూడా ప్రారంభించనుంది. నివేదికల ప్రకారం ముంబై బీకేసీ తర్వాత ఇది అతిపెద్ద స్టోర్ అవుతుంది. ఈ స్టోర్ 2026 నాటికి ఓపెన్ అవుతుంది. ప్రస్తుతం యాపిల్ భారతదేశంలోని ఇతర నగరాల్లో కూడా స్టోర్‌లను ప్లాన్ చేస్తుందో లేదో తెలియదు.
యాపిల్ దక్షిణ భారతదేశంలో తన వ్యాపారాన్ని వేగంగా విస్తరిస్తోంది. యాపిల్ ఉత్పత్తులను అసెంబుల్ చేసి సరఫరా చేసే ఫాక్స్‌కాన్, తెలంగాణలో 500 మిలియన్ డాలర్ల పెట్టుబడులు పెట్టనుంది. ఆ పెట్టుబడితో రంగారెడ్డి జిల్లా కొంకర్ కలాన్ వద్ద ఒక ప్లాంటును ఏర్పాటు చేయనుంది. తెలంగాణ పట్టణాభివృద్ధి శాఖ మంత్రి KTR ఈ విషయాన్ని ట్వీట్ చేశారు. ప్రాజెక్టులో మొదటి దశలో ప్రత్యక్షంగా 25 వేల మందికి ఉద్యోగ అవకాశాలు వస్తాయని ఆ ట్వీట్‌లో పేర్కొన్నారు.
కొత్త ప్లాంట్ నుంచి ప్రపంచ స్థాయి ఉత్పత్తులను బయటకు తీసుకొస్తామని తెలంగాణ ప్రభుత్వం-ఫాక్స్‌కాన్ సంయుక్త ప్రకటన ద్వారా ఆపిల్ హామీ ఇచ్చింది. వ్యాపారానికి అనుకూలమైన వాతావరణాన్ని కల్పించినందుకు తెలంగాణ రాష్ట్రానికి కృతజ్ఞతలు తెలిపింది. కొవిడ్ మహమ్మారి, బీజింగ్‌లో కఠినమైన లాక్‌డౌన్ల కారణంగా చైనాలోని ఫాక్స్‌కాన్ కంపెనీ కార్యకలాపాలపై ప్రభావం పడింది. దీంతో, ఆపిల్ ఉత్పత్తులు ఆగిపోయాయి. ఇది కాకుండా, అమెరికా - చైనా మధ్య ఉద్రిక్తతల కారణంగా, తన కంపెనీ ఉత్పత్తి ఫ్లాంట్లను చైనా నుంచి బయటకు తీసుకురావాలని ఆపిల్ ప్రయత్నిస్తోంది.
Samsung Galaxy S23 FE: శాంసంగ్ మోస్ట్ అవైటెడ్ ఫోన్ లాంచ్‌కు రెడీ - వచ్చే వారంలోనే!
Whatsapp: వాట్సాప్ యూజర్లకు గుడ్ న్యూస్ - ఇక నుంచి ఏకంగా రెండు వారాల పాటు!
Upcoming Mobiles: స్మార్ట్ ఫోన్ల సీజన్ వచ్చేసింది - అక్టోబర్‌లో ఏయే ఫోన్లు రానున్నాయంటే?
Disney Password Sharing: ఐ వానా ఫాలో ఫాలో ఫాలో యూ - నెట్‌ఫ్లిక్స్‌ను అనుసరిస్తున్న డిస్నీ!
Amazon Vs Flipkart: అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ సేల్స్‌లో ఏ కార్డులపై ఆఫర్లు ఉన్నాయి? - వీటి ద్వారా మరింత తగ్గనున్న ధరలు!
TDP Protest: న్యాయం కోసం ఎంతవరకైనా వెళ్తాం, త్వరలోనే టీడీపీ జైలు భరో చేస్తుంది: చినరాజప్ప
Bigg Boss Season 7 Telugu: శివాజీ అనర్హుడు అని ప్రకటించిన కంటెస్టెంట్స్ - దీంతో నాగార్జున అలాంటి నిర్ణయం!
HCA Election Notification: హెచ్‌సీఏ ఎన్నికల నోటిఫికేషన్ వచ్చేసింది, ముఖ్యమైన తేదీలివే
Hari Teja: నటి హరితేజకు విడాకులు- కూల్ గా ఆన్సర్ ఇచ్చిన బిగ్ బాస్ బ్యూటీ
/body>