By: ABP Desam | Updated at : 04 Oct 2023 07:32 PM (IST)
యాపిల్ ఐప్యాడ్ ఆఫర్లు ( Image Source : Apple )
Apple iPad Offer: దేశంలోని ప్రముఖ ఈ-కామర్స్ సైట్‌లో పండుగ సీజన్ సేల్ ప్రారంభం కానుంది. ఇందులో గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్‌ను అమెజాన్, బిగ్ బిలియన్ సేల్‌ను ఫ్లిప్‌కార్ట్ ఇప్పటికే ప్రకటించాయి. ఈ సేల్‌లో అనేక ఉత్పత్తులపై భారీ ఆఫర్లు లభించనున్నాయి. ఈ సేల్‌లో ఈ-కామర్స్ సైట్‌లపై డైరెక్ట్ డిస్కౌంట్‌లతో పాటు, బ్యాంక్ డిస్కౌంట్‌లు, ఎక్స్‌ఛేంజ్ ఆఫర్‌లు, కూపన్‌లతో సహా అనేక ఇతర ఆఫర్‌లను కూడా పొందుతారు. ఈ సేల్‌లో యాపిల్ ఐప్యాడ్‌పై కూడా భారీ ఆఫర్ లభించనుంది.
యాపిల్ ఐప్యాడ్ (9th Gen)
యాపిల్ ఐప్యాడ్ (9th Gen) ధర ప్రస్తుతం ఈ-కామర్స్ సైట్‌లో దాదాపు రూ. 30,990 నుంచి రూ. 33,990 వరకు ఉంది. ఫ్లిప్‌కార్ట్‌లో బిగ్ బిలియన్ డేస్ సేల్, అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ ఆఫర్లలో ఈ యాపిల్ ఐప్యాడ్‌ను రూ. 20,000 లోపు ధరకే కొనుగోలు చేసే అవకాశం ఉంటుంది.
యాపిల్ ఐప్యాడ్ (9th Gen) స్పెసిఫికేషన్లు, ఫీచర్లు
ఇందులో ఏ13 బయోనిక్ ప్రాసెసర్‌ను అందించారు. ఇది 64 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్‌తో రానుంది. దీని బెజెల్స్ కాస్త మందంగా ఉంటాయి. ఇది 3.5 ఎంఎం హెడ్‌ఫోన్ జాక్, ప్రీమియం మెటల్ బాడీని కలిగి ఉంది.
డిస్‌ప్లే - 10.2 అంగుళాల రెటీనా డిస్‌ప్లే, 2160x1620 పిక్సెల్స్ రిజల్యూషన్, పీక్ బ్రైట్‌నెస్ 500 నిట్స్
స్టోరేజ్ - 64 జీబీ / 256 జీబీ
ఆపరేటింగ్ సిస్టమ్ - ఐప్యాడ్ఓఎస్ 14
ప్రాసెసర్ - A13 బయోనిక్
వెనుక కెమెరా - 8 మెగాపిక్సెల్
ఫ్రంట్ కెమెరా - 12 మెగాపిక్సెల్
బ్యాటరీ- గరిష్టంగా 10 గంటల వీడియో స్ట్రీమింగ్
నెట్‌వర్క్- వైఫై, వైఫై + సెల్యులార్ (e-SIM), డ్యూయల్ బ్యాండ్ Wi-Fi (2.4 గిగాహెర్ట్జ్, 5 గిగాహెర్ట్జ్)
యాపిల్ ఐప్యాడ్ (9th Gen) డిజైన్
ఐప్యాడ్ 9 డిజైన్ దాదాపుగా ఐప్యాడ్ 8ని పోలి ఉంటుంది. ఐప్యాడ్ బాడీ కూడా మెటల్ (అల్యూమినియం)తో తయారు అయింది. ఐప్యాడ్ మొత్తం బరువు 498 గ్రాములుగా ఉంది. డిస్‌ప్లేలో హార్డ్ గ్లాస్ ప్రొటెక్షన్ ఉంది. అయితే యాపిల్ గ్లాస్ గురించి అధికారిక సమాచారం ఇవ్వలేదు. ఐప్యాడ్ ఎత్తు, వెడల్పులో ఎటువంటి మార్పు లేదు. దీని పరిమాణం మునుపటి మోడల్‌లానే ఉంటుంది.
ఇటీవలే యాపిల్ వాచ్ అల్ట్రా 2ను కంపెనీ ఈవెంట్లో లాంచ్ చేసింది. 2022లో లాంచ్ అయిన యాపిల్ వాచ్ అల్ట్రాకు అప్‌గ్రేడెడ్ వెర్షన్‌గా ఈ కొత్త వాచ్ మార్కెట్లోకి వచ్చింది. ఒక్కసారి చార్జింగ్ పెడితే 36 గంటల బ్యాటరీ బ్యాకప్‌ను ఈ కొత్త యాపిల్ వాచ్ అల్ట్రా 2 అందించనుంది. లో ఛార్జింగ్ మోడ్‌లో ఏకంగా 72 గంటల వరకు దీన్ని ఉపయోగించుకోవచ్చు. యాపిల్ ఇప్పటివరకు లాంచ్ చేసిన వాచ్‌ల్లో ఎక్కువ బ్యాటరీ బ్యాకప్ ఇచ్చే వాచ్ ఇదే కావడం విశేషం. యాపిల్ వాచ్ అల్ట్రా 2 ధరను మనదేశంలో రూ.89,900గా నిర్ణయించారు. ఆల్ఫైన్ లూప్, ఓషన్, ట్రెయిల్ లూప్ వాచ్ బ్యాండ్లతో ఈ కొత్త వాచ్‌ను కొనుగోలు చేయవచ్చు.
Read Also: డైనమిక్ ఐల్యాండ్‌తో లాంచ్ అయిన ఐఫోన్ 15 సిరీస్ - ధర ఎంత పెట్టారు?
Read Also: అత్యధిక బ్యాటరీ బ్యాకప్ ఇచ్చే యాపిల్ వాచ్ ఇదే - యాపిల్ వాచ్ అల్ట్రా 2 వచ్చేసింది!
Read Also: వేళ్లు కదిపితే ఫోన్ ఎత్తేయచ్చు - మైండ్ బ్లోయింగ్ టెక్నాలజీతో యాపిల్ వాచ్ సిరీస్ 9 - ధర ఎంత?
ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial
Meizu 21: 200 మెగాపిక్సెల్ కెమెరా, లేటెస్ట్ ప్రాసెసర్‌తో గేమింగ్ ఫోన్ - ధర ఎంతంటే?
BGMI 2.9 Update Release Date: మోస్ట్ అవైటెడ్ బీజీఎంఐ 2.9 అప్డేట్ వచ్చింది - వావ్ అనిపిస్తున్న కొత్త గేమ్‌ప్లే!
Google Chrome: ఈ ఫోన్లు ఉపయోగిస్తున్నారా? - అయితే ఇక క్రోమ్ పని చేయదు!
Whatsapp New Feature: వాట్సాప్ ఛాట్లు హైడ్ చేసినా చూసేస్తున్నారా? - మీ కోసం వాట్సాప్ కొత్త ఫీచర్!
Poco M6 Pro 5G: 8 జీబీ ర్యామ్, 256 జీబీ స్టోరేజ్ ఉన్న 5జీ ఫోన్ రూ.15 వేలలోపే - సూపర్ ఫోన్ దించిన పోకో!
AP Telangana Water Issue: కృష్ణాజలాలపై ఢిల్లీలో నేడు కీలక మీటింగ్ - ఏపీ, తెలంగాణ హాజరవ్వాలని ఆదేశాలు
Pawan Kalyan Comments: 'జనసేనకు యువతే పెద్ద బలం' - వైసీపీ కులాల ఉచ్చులో చిక్కుకోవద్దని శ్రేణులకు పవన్ దిశా నిర్దేశం
Revanth Reddy: రేపు ఈసీ వద్దకు కాంగ్రెస్ నేతలు, కేసీఆర్‌పై ఫిర్యాదు - వాటిని మార్చేస్తున్నారని ఆరోపణలు
Telangana Elections 2023: 'తెలంగాణలో రీపోలింగ్ కు నో ఛాన్స్' - రాష్ట్రంలో 70.74 శాతం పోలింగ్, గతంతో పోలిస్తే తక్కువేనన్న సీఈవో వికాస్ రాజ్
Salaar Trailer: ‘సలార్’ ట్రైలర్ వచ్చేసింది - ‘కేజీఎఫ్’తో లింకేమిటీ? 3 నిమిషాల్లో కథ మొత్తం చెప్పేశారు - ప్రభాస్ ఎలివేషన్ అదుర్స్
/body>