News
News
X

iPhone 13 Launch: 14న ఐఫోన్ 13 సిరీస్‌ లాంచ్.. 'కాలిఫోర్నియా స్ట్రీమింగ్' పేరుతో యాపిల్ ఈవెంట్..

ఐఫోన్ 13 సిరీస్‌ మరికొద్ది రోజుల్లో మార్కెట్లోకి ఎంట్రీ ఇవ్వనుంది. ఈ నెల 14న ఒక ఈవెంట్ నిర్వహించనున్నట్లు యాపిల్ ప్రకటించింది. దీంతో ఇదే రోజున ఐఫోన్ 13 సిరీస్‌ ఫోన్లు లాంచ్ కానున్నాయని తెలుస్తోంది.

FOLLOW US: 

దిగ్గజ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ యాపిల్ ఈ నెల 14న ఒక ముఖ్యమైన ఈవెంట్ నిర్వహించనుంది. "కాలిఫోర్నియా స్ట్రీమింగ్ (California Streaming)" పేరుతో ఈ కార్యక్రమం నిర్వహించనున్నట్లు యాపిల్ ప్రకటించింది. దీనికి సంబంధించి మీడియాకు ఆహ్వానాలు పంపినట్లు తెలుస్తోంది. అయితే ఈ కార్యక్రమంలో ఏమేం ఉత్పత్తులను రిలీజ్ చేస్తామనే విషయాలను మాత్రం కంపెనీ వెల్లడించలేదు. యాపిల్.. ప్రతి ఏటా సెప్టెంబర్ నెలలో తన కొత్త ఐఫోన్ సిరీస్ ఫోన్లను విడుదల చేస్తుంది. దీంతో 14న జరగబోయే కార్యక్రమంలో యాపిల్ తన కొత్త ఐఫోన్ 13 సిరీస్ ఫోన్లను లాంచ్ చేయనుందనే వార్తలు వస్తున్నాయి. భారత కాలమానం ప్రకారం ఈ ఈవెంట్ 14న రాత్రి 10.30కి జరగనుంది. ఈ కార్యక్రమంలో ఐఫోన్ 13 సిరీస్ ఫోన్లతో పాటు యాపిల్ వాచ్ సిరీస్ 7, ఎయిర్ పాడ్స్ 3 కూడా విడుదల కానున్నట్లు తెలుస్తోంది. 

నెట్‌వర్క్‌ లేకపోయినా కాల్స్‌, మెసేజ్‌లు.. 
యాపిల్ నుంచి ఏ ప్రొడక్ట్ మార్కెట్‌లోకి వచ్చినా హాట్ కేకుల్లా అమ్ముడవుతుంది. ఎప్పటిలానే ఈ సారి కూడా ఐఫోన్ 13 సిరీస్‌లో ఐఫోన్ 13, ఐఫోన్ 13 మినీ, ఐఫోన్ 13 ప్రో, ఐఫోన్ 13 ప్రో మ్యాక్స్‌ అనే 4 స్మార్ట్‌ ఫోన్స్‌ను యాపిల్‌ తీసుకురానుంది. ఈ మోడల్స్ లో కొత్తగా ‘లో ఎర్త్‌ ఆర్బిట్‌ (ఎల్‌ఈవో)’ అనే ఫీచర్ తీసుకురానున్నట్లు తెలుస్తోంది. శాటిలైట్ కమ్యూనికేషన్‌ కనెక్టవిటీ ఫీచరుతో ఐఫోన్ 13 సిరీస్‌ రానున్నట్లు లీకులు చెబుతున్నాయి. ఈ ఫీచర్ ద్వారా నెట్‌వర్క్‌ లేకపోయినా కూడా కాల్స్‌, మెసేజ్‌లు వంటివి చేసుకోవచ్చని టెక్ నిపుణులు పేర్కొన్నారు. 

News Reels

భారీ కెపాసిటీ బ్యాటరీలు..
ఐఫోన్ 13 సిరీస్‌ ఫోన్లలో భారీ కెపాసిటీ ఉన్న బ్యాటరీలు అందించనున్నట్లు లీకుల ద్వారా తెలుస్తోంది. ఎక్స్‌పాండెడ్  ఎంఎంవేవ్ 5జీ సపోర్టుతో ఇవి రానున్నాయని సమాచారం. ఐఫోన్ 13 సిరీస్ ఫోన్లకు సంబంధించిన ప్రీ ఆర్డర్లు ఈ నెల 17 నుంచి ప్రారంభం అవుతాయని చైనాకు చెందిన టిప్ స్టర్ వెల్లడించింది. వీటి సేల్ ఈ నెల 24 నుంచి మొదలవుతుందని తెలిపింది. ఈ ఫోన్ ఫీచర్లకు సంబంధించిన స్క్రీన్ షాట్ షేర్ చేసింది. ఐఫోన్ కొత్త సిరీస్ ఫోన్లు.. సన్ సెట్ గోల్డ్ కలర్ ఆప్షన్లో లభించనుందని తెలిపింది. ఇవి ఎంఎం వేవ్ 5జీ (mmWave 5G) సపోర్ట్‌తో రానున్నాయని సమాచారం. 

Also Read: Realme 8i, 8s: అదిరిపోయే ఫీచర్లతో రానున్న రియల్‌మీ 8ఐ, 8ఎస్.. వీటితో పాటు పాకెట్ స్పీకర్లు కూడా లాంచ్ అవుతున్నాయి..

Also Read: Redmi 10 Prime Sale: రూ.12 వేల ధరలో 6000 ఎంఏహెచ్ బ్యాటరీ.. రెడ్‌మీ 10 ప్రైమ్ ఫోన్ సేల్ స్టార్ట్ అయింది..

Published at : 08 Sep 2021 01:44 PM (IST) Tags: iPhone 13 Launch iPhone 13 series iPhone 13 series Price iPhone 13 series Phones iPhone 13 Sale California Streaming September 14 Apple Event

సంబంధిత కథనాలు

Jio True 5G: 100 శాతం 5జీ కవరేజీ - మొదటి రాష్ట్రం గుజరాతే!

Jio True 5G: 100 శాతం 5జీ కవరేజీ - మొదటి రాష్ట్రం గుజరాతే!

WhatsApp Data Breach: వాట్సాప్ యూజర్లకు బిగ్ షాక్ - 50 కోట్ల మంది డేటా లీక్!

WhatsApp Data Breach: వాట్సాప్ యూజర్లకు బిగ్ షాక్ - 50 కోట్ల మంది డేటా లీక్!

క్రేజీ డెసిషన్స్‌తో పిచ్చెక్కిస్తున్న మస్క్ మామ - ట్రంప్ బాటలోనే కంగనా కూడా!

క్రేజీ డెసిషన్స్‌తో పిచ్చెక్కిస్తున్న మస్క్ మామ - ట్రంప్ బాటలోనే కంగనా కూడా!

ఐఫోన్ 14 ఫీచర్‌తో శాంసంగ్ కొత్త ఫోన్లు - ఫోన్‌లో సిగ్నల్ లేకపోయినా?

ఐఫోన్ 14 ఫీచర్‌తో శాంసంగ్ కొత్త ఫోన్లు - ఫోన్‌లో సిగ్నల్ లేకపోయినా?

Jio Airtel Plans: జియో, ఎయిర్ టెల్ అదిరిపోయే ప్లాన్స్, రోజూ 2GB డేటా, అన్ లిమిటెడ్ కాల్స్, ఫుల్ డీటైల్స్ మీకోసం!

Jio Airtel Plans: జియో, ఎయిర్ టెల్ అదిరిపోయే ప్లాన్స్, రోజూ 2GB డేటా, అన్ లిమిటెడ్ కాల్స్, ఫుల్ డీటైల్స్ మీకోసం!

టాప్ స్టోరీస్

PM Modi on Mann Ki Baat: సిరిసిల్ల కళాకారుడి టాలెంట్‌కు ప్రధాని మోదీ ఫిదా, మన్ కీ బాత్‌లో ప్రశంసలు

PM Modi on Mann Ki Baat: సిరిసిల్ల కళాకారుడి టాలెంట్‌కు ప్రధాని మోదీ ఫిదా, మన్ కీ బాత్‌లో ప్రశంసలు

Hyderabad Metro Rail : హైదరాబాద్ వాసులకు గుడ్ న్యూస్, మైండ్ స్పేస్ నుంచి శంషాబాద్ వరకు మెట్రో పొడిగింపు

Hyderabad Metro Rail : హైదరాబాద్ వాసులకు గుడ్ న్యూస్, మైండ్ స్పేస్ నుంచి శంషాబాద్ వరకు మెట్రో పొడిగింపు

Anasuya Bharadwaj: అనసూయకు వేధింపులు - కటకటాల్లోకి నిందితుడు, రష్మి, విష్ణు ప్రియను కూడా టార్గెట్ చేశాడా?

Anasuya Bharadwaj: అనసూయకు వేధింపులు - కటకటాల్లోకి నిందితుడు, రష్మి, విష్ణు ప్రియను కూడా టార్గెట్ చేశాడా?

Paritala Sunitha: పోటుగాడివా? చంద్రబాబుని చంపుతానంటావా? నోట్లో ఉమ్మేస్తారు - పరిటాల సునీత ఫైర్

Paritala Sunitha: పోటుగాడివా? చంద్రబాబుని చంపుతానంటావా? నోట్లో ఉమ్మేస్తారు - పరిటాల సునీత ఫైర్