యాపిల్‌ను కొట్టే ఫీచర్ ఆండ్రాయిడ్‌లో - డెవలప్ చేసిన గూగుల్ - భూకంపాలు వస్తే!
యాపిల్‌ను కొట్టే ఫీచర్‌ను గూగుల్ డెవలప్ చేసింది.
కాలిఫోర్నియాలో ఒక మోస్తరు భూకంపం సంభవించే ముందు చాలా మంది Android స్మార్ట్‌ఫోన్ వినియోగదారులకు అలెర్ట్ వచ్చింది. 2020 తర్వాత లాంచ్ అయిన ఆండ్రాయిడ్ మొబైల్స్‌లో బిల్ట్-ఇన్ క్వేక్ డిటెక్షన్ ఫీచర్‌ను అందించారు. శాన్ జోస్, కాలిఫోర్నియా సమీపంలో రిక్టర్ స్కేలుపై 5.1 నమోదైన భూకంపం సమయంలో దీన్ని పరీక్షించినట్లు గూగుల్ వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇంజినీరింగ్ ఫర్ ఆండ్రాయిడ్ డేవ్ బుర్క్ తెలిపారు. ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌ల భూకంపాన్ని తాకడానికి ముందే గుర్తించాయి. గూగుల్ భూకంప గుర్తింపు సామర్థ్యం ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌లను సీస్మోమీటర్‌లుగా మారుస్తుంది.
‘ఈరోజు SF బే ఏరియాలో భూకంపం వచ్చింది. పసుపు/ఎరుపు రంగులో కనిపిస్తున్న సర్కిళ్లలో ఆండ్రాయిడ్ ఫోన్‌లు సీస్మోమీటర్‌లుగా పనిచేస్తాయి. ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌లు భూకంపం గురించి ముందుగా తెలియజేసేందుకు వెలుగుతున్నాయి.’ అని డేవ్ బుర్క్ ట్వీట్ చేశారు.
చాలా మంది ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్ వినియోగదారులు తమ ఆండ్రాయిడ్ ఫోన్‌లకు షాక్ తరంగాల తరహాలో ఐదు నుండి 10 సెకన్ల ముందు భూకంపం నోటిఫికేషన్‌లు వచ్చాయని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. భూకంపానికి కొన్ని సెకన్ల ముందే హెచ్చరిక వచ్చినప్పటికీ, వినియోగదారులు జాగ్రత్త పడటానికి ఈ తేడా సరిపోతుంది.
ఆండ్రాయిడ్ ఫోన్‌ల కోసం భూకంప గుర్తింపు, ముందస్తు హెచ్చరికలను Google 2020 ఆగస్టులో ప్రారంభించింది. కాలిఫోర్నియాలోని Android పరికరాలకు గూగుల్ నేరుగా షేక్‌అలర్ట్ యాప్ ద్వారా భూకంప హెచ్చరికలను పంపడానికి యునైటెడ్ స్టేట్స్ జియోలాజికల్ సర్వే (USGS), కాలిఫోర్నియా గవర్నర్స్ ఆఫీస్ ఆఫ్ ఎమర్జెన్సీ సర్వీసెస్ (Cal OES)తో కలిసి పనిచేసింది.
కొంతమంది ప్రముఖ భూకంప శాస్త్రవేత్తలు అభివృద్ధి చేసిన, షేక్అలర్ట్ సిస్టమ్ USGS, Cal OES, యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా బర్కిలీ, కాలిఫోర్నియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ద్వారా వ్యవస్థాపించబడిన 700 కంటే ఎక్కువ సీస్మోమీటర్ల నుంచి సంకేతాలను ఉపయోగిస్తుంది. ఇంతవరకు ఐఫోన్లలో ఈ ఫీచర్ లేదు. దీని ద్వారా ఐఫోన్లపై ఆండ్రాయిడ్ ఫోన్లు పై చేయి సాధించనున్నాయి.
Also Read: ఐఫోన్ 14 సిరీస్ వచ్చేసింది - ధర విషయంలో జాగ్రత్త పడ్డ యాపిల్ - మనదేశంలో ఎంతంటే?
Earthquake in SF Bay Area today. Yellow/red represents shaking Android phones acting as seismometers. Circles are our inferred estimate of P & S waves. Earthquake alerts sent instantaneously to surrounding phones before the waves hit pic.twitter.com/8pumt19ReI
— Dave Burke (@davey_burke) October 26, 2022