Amazon Festival Sale: ఈ ఎంఐ ఫోన్‌పై అమెజాన్‌లో భారీ ఆఫర్.. ఏకంగా రూ.9 వేల వరకు తగ్గింపు!
ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్‌లో ఎంఐ 11ఎక్స్ 5జీ స్మార్ట్ ఫోన్‌పై భారీ ఆఫర్లు అందించారు.
అమెజాన్ ఫెస్టివల్ సేల్‌లో ఎంఐ 11ఎక్స్ 5జీ స్మార్ట్ ఫోన్‌పై భారీ ఆఫర్లు అందించారు. సిటీబ్యాంక్, యాక్సిస్ బ్యాంకు కార్డుల ద్వారా కొనుగోలు చేస్తే రూ.3,500 ఇన్‌స్టంట్ క్యాష్ బ్యాక్ లభించనుంది. అలాగే ఎక్స్‌చేంజ్ బోనస్‌లు కూడా కలిపితే.. రూ.18,000 వరకు తగ్గింపు లభించనుంది. అమెజాన్ ‘Upgrade Your Happiness’ సేల్‌లో భాగంగా ఈ ఆఫర్ అందించారు.
అమెజాన్ నవరాత్రి ఆఫర్ల గురించి తెలుసుకోవడానికి ఇక్కడ క్లిక్ చేయండి
ఎంఐ 11ఎక్స్ 5జీ ధర
ఈ ఫోన్ అసలు ధర రూ.33,999 కాగా, ఈ సేల్‌లో రూ.6,000 తగ్గింపు అందించారు. దీంతో దీని ధర రూ.27,999కు తగ్గింది. సిటీ బ్యాంకు, యాక్సిస్ బ్యాంకులకు చెందిన క్రెడిట్, డెబిట్ కార్డుల ద్వారా ఈ ఫోన్ కొనుగోలు చేస్తే మరో రూ.3,500 తగ్గింపు లభించనుంది. అంటే రూ.24,500కే ఈ ఫోన్ లభించనుందన్న మాట. దీంతోపాటు మీ పాత ఫోన్ ఎక్స్‌చేంజ్ చేసుకోవాలనుకుంటే రూ.18,000 వరకు అదనపు తగ్గింపు లభించనుంది. అమెజాన్ ప్రైమ్ సభ్యులకు ఆరు నెలల వరకు ఉచితంగా స్క్రీన్ రీప్లేస్‌మెంట్ కూడా లభించనుంది.
ఎంఐ 11ఎక్స్ 5జీ కొనడానికి ఇక్కడ క్లిక్ చేయండి
ఎంఐ 11ఎక్స్ 5జీ స్పెసిఫికేషన్లు
ఇందులో 6.67 అంగుళాల ఫుల్ హెచ్‌డీ+ అమోఎల్ఈడీ డిస్ ప్లేను అందించారు. దీని రిఫ్రెష్ రేట్ 120 హెర్ట్జ్ కాగా, టచ్ శాంప్లింగ్ రేట్ మాత్రం ఏకంగా 300 హెర్ట్జ్‌గా ఉంది. డిస్ ప్లే యాస్పెక్ట్ రేషియో 20:9గా ఉంది. బిల్ట్ ఇన్ అలెక్సా ఫీచర్‌ను కూడా అందించారు. దీని ద్వారా మీరు ఫోన్ కాల్స్ కనెక్ట్ చేసుకోవచ్చు, యాప్స్ ఓపెన్ చేయవచ్చు.
దీని బ్యాటరీ సామర్థ్యం 4520 ఎంఏహెచ్‌గా ఉంది. 33W ఫాస్ట్ చార్జింగ్‌ను ఇది సపోర్ట్ చేయనుంది. ఆక్టాకోర్ క్వాల్ కాం స్నాప్ డ్రాగన్ 870 ప్రాసెసర్‌పై ఈ ఫోన్ పనిచేయనుంది. 12 జీబీ వరకు ర్యామ్, 256 జీబీ వరకు స్టోరేజ్‌ను ఇందులో అందించారు.
ఇక కెమెరాల విషయానికి వస్తే.. ఇందులో వెనకవైపు మూడు కెమెరాలు ఉండన్నాయి. వీటిలో ప్రధాన కెమెరా సామర్థ్యం 48 మెగాపిక్సెల్ కాగా, దీంతోపాటు 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్, 5 మెగాపిక్సెల్ సూపర్ మాక్రో సెన్సార్ కూడా ఇందులో ఉండనున్నాయి. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ముందువైపు 20 మెగాపిక్సెల్ కెమెరాను అందించారు.
5జీ, 4జీ ఎల్టీఈ, వైఫై 6, బ్లూటూత్ వీ5.1, జీపీఎస్/ఏ-జీపీఎస్, ఎన్ఎఫ్‌సీ, ఇన్‌ఫ్రారెడ్ బ్లాస్టర్, యూఎస్‌బీ టైప్-సీ పోర్టులను ఇందులో అందించారు. ఇన్ డిస్ ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ కూడా ఇందులో ఉంది. దీని మందం 0.78 సెంటీమీటర్లు కాగా, బరువు 196 గ్రాములుగా ఉంది.
Also Read: Star Link: ఎలాన్ మస్క్ బ్రాడ్‌బ్యాండ్ వచ్చేస్తుంది.. తెలుగు రాష్ట్రాల్లో మొదట ఆ పట్టణంలోనే!