![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
Amazon Great Indian Festival 2024: అమెజాన్ బిగ్గెస్ట్ సేల్ తేదీ ఇదే - మొబైల్స్, టీవీలపై భారీ ఆఫర్లు - ఎంత తగ్గనుంది?
Amazon Sale Offers: అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ 2024... ఈ నెల 27వ తేదీ నుంచి ప్రారంభం కానుంది. ప్రైమ్ వినియోగదారులకు మాత్రం ఒక్కరోజు ప్రారంభం కానుంది.
![Amazon Great Indian Festival 2024: అమెజాన్ బిగ్గెస్ట్ సేల్ తేదీ ఇదే - మొబైల్స్, టీవీలపై భారీ ఆఫర్లు - ఎంత తగ్గనుంది? Amazon Great Indian Festival 2024 Sale To Be Kickstarted From September 27th Check Best Deals Here Amazon Great Indian Festival 2024: అమెజాన్ బిగ్గెస్ట్ సేల్ తేదీ ఇదే - మొబైల్స్, టీవీలపై భారీ ఆఫర్లు - ఎంత తగ్గనుంది?](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/09/21/53e9da849bf999963ac950e54d4660fc1726918417953252_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Amazon Great Indian Festival 2024 Sale: 2024 సంవత్సరానికి అమెజాన్ తన బిగ్గెస్ట్ ఫెస్టివల్ సేల్స్ తేదీని ప్రకటించింది. అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ 2024 సేల్ గురించి దేశవ్యాప్తంగా ఎంతో వెయిటింగ్ ఉంది. ఎందుకంటే ఈ సేల్‌లో అమెజాన్ కనీవినీ ఎరుగని డిస్కౌంట్లు అందించడం కారణంగా ఎన్నో ఉత్పత్తులు తక్కువ ధరకు లభిస్తాయి. దీంతో వినియోగదారులు తమకు కావాల్సిన వస్తువులను ఈ సేల్‌లోనే కొనుగోలు చేయడానికి మొగ్గు చూపిస్తారు. దీంతోపాటు బ్యాంక్ ఆఫర్లు, నో కాస్ట్ ఈఎంఐలు, ఎక్స్‌ఛేంజ్ ఆఫర్లు కూడా ఈ సేల్‌లో లభిస్తాయి. కస్టమర్లకు ఫెస్టివల్ షాపింగ్‌కు ఇది పర్ఫెక్ట్ టైమ్‌గా మారుతుంది. ఈసారి సేల్ ఎప్పుడు ప్రారంభం కానుంది? వేటిపై మంచి డీల్స్ అందుబాటులో ఉండనున్నాయి? అనే వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ 2024 ఎప్పుడు మొదలవుతుంది?
అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ 2024... సెప్టెంబర్ 27వ తేదీ నుంచి ప్రారంభం కానుంది. అయితే అమెజాన్ ప్రైమ్ మెంబర్ షిప్ ఉన్న వినియోగదారులకు మాత్రం ఒక్క రోజు ముందే అంటే సెప్టెంబర్ 26వ తేదీ నుంచే ఈ సేల్ మొదలవనుంది.
అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ 2024 బ్యాంక్ ఆఫర్లు
అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ 2024కు సంబంధించి అమెజాన్ ఇప్పటికే పలు బ్యాంక్ ఆఫర్లను రివీల్ చేసింది. సేల్ జరుగుతున్న సమయంలో ఎస్‌బీఐ క్రెడిట్ కార్డు, డెబిట్ కార్డులతో కొనుగోలు చేస్తే 10 శాతం ఇన్‌స్టంట్ డిస్కౌంట్ లభించనుంది. ఒకవేళ అమెజాన్ పే యూపీఐ నుంచి కనీసం రూ.1,000 నగదు చెల్లింపు చేస్తే రూ.100 క్యాష్‌బ్యాక్ లభించనుంది. వీటితో పాటు నో కాస్ట్ ఈఎంఐ, ఎక్స్‌ఛేంజ్ ఆఫర్లు కూడా అందుబాటులో ఉన్నాయి.
అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ 2024లో మొబైల్స్‌పై ఆఫర్లు
ఈ సేల్‌లో మొబైల్స్, యాక్సెసరీలపై 40 శాతం వరకు డిస్కౌంట్ లభించనుంది. వన్‌ప్లస్ నార్డ్ సీఈ4 లైట్, శాంసంగ్ గెలాక్సీ ఎస్23 అల్ట్రా, రెడ్‌మీ 13సీ, ఐకూ జెడ్9ఎక్స్ 5జీ, రియల్‌మీ 70ఎక్స్, షావోమీ 14 సీవీ, మోటొరోలా రేజర్ 50, టెక్నో పోవా 6 నియో వంటి మొబైల్స్‌పై భారీ ఆఫర్లు అందించనున్నారు.
అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ 2024లో ల్యాప్‌టాప్‌లపై ఆఫర్లు
అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్‌లో పాపులర్ ల్యాప్‌టాప్‌లపై భారీ ఆఫర్లు ఉండనున్నాయి. స్టాండర్డ్ ల్యాప్‌టాప్‌లపై ఏకంగా 40 శాతం వరకు డిస్కౌంట్ లభించనుంది. అలాగే గేమింగ్ ల్యాప్‌టాప్‌ల ధర రూ.39,900 నుంచి ప్రారంభం కానుంది. అసుస్ టీయూఎఫ్ రైజెన్ 7 3050 వంటి హైఎండ్ గేమింగ్ ల్యాప్‌టాప్‌ను ఈ సేల్‌లో రూ.70 వేలలోపే కొనుగోలు చేయవచ్చు. డెల్ 15 ల్యాప్‌టాప్ ధర రూ.40 వేల కంటే తక్కువకే రానుంది. అసుస్ వివోబుక్ 15 ధర రూ.49,900కు తగ్గనుంది.
Also Read: ఫేస్‌బుక్, ఇన్‌స్టాలో సరికొత్త సబ్‌స్క్రిప్షన్ ప్లాన్స్ - ధరలు ఎలా ఉన్నాయో తెలుసా?
అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ 2024లో ఆడియో, వేరబుల్స్‌పై ఆఫర్లు
ఆడియో, వేరబుల్స్‌పై కూడా అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ 2024లో భారీ ఆఫర్లు లభించనున్నాయి. ట్రూ వైర్‌లెస్ ఇయర్‌బడ్స్‌పై ఏకంగా 75 శాతం తగ్గింపు అందించనున్నారు. అలాగే వేరబుల్స్‌పై కూడా 80 శాతం వరకు డిస్కౌంట్ లభించనుంది.
అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ 2024లో స్మార్ట్ టీవీలపై ఆఫర్లు
స్మార్ట్ టీవీలపై అయితే ఈ సేల్‌లో మంచి డీల్స్ లభించనున్నాయి. స్మార్ట్ టీవీల ధర రూ.6,999 నుంచే ప్రారంభం కానుంది. స్మార్ట్ టీవీలపై 24 నెలల పాటు నో కాస్ట్ ఈఎంఐ, మూడు సంవత్సరాల వరకు వారంటీ కూడా లభించనుంది. ఇది మాత్రమే కాకుండా శాంసంగ్, సోనీ, ఎల్జీ, షావోమీ, తోషిబా, టీసీఎల్ వంటి బ్రాండెడ్ టీవీలపై రూ.5,500 వరకు ఎక్స్‌ఛేంజ్ డిస్కౌంట్ లభించనుంది.
అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ 2024లో హోం అప్లయన్సెస్‌పై ఆఫర్లు
అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ 2024లో గృహోపకరణాలపై కూడా మంచి ఆఫర్లు అందుబాటులో ఉన్నాయి. వాషింగ్ మెషీన్లు, ఏసీలు, రిఫ్రిజిరేటర్లపై 75 శాతం వరకు తగ్గింపు లభించనుంది. పాపులర్ వాషింగ్ మెషీన్లపై ఏకంగా 60 శాతం వరకు డిస్కౌంట్ లభించనుంది. ప్రీమియం రిఫ్రిజిరేటర్లపై రూ.15,000 వరకు ఎక్స్‌ఛేంజ్ బోనస్ అందించనున్నారు.
Also Read: మంచి కెమెరా క్వాలిటీ, పెద్ద బ్యాటరీ- రూ. 20 వేల లోపు బెస్ట్ 5G మొబైల్స్ ఇవే
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)