Amazon Great Indian Festival Sale: ల్యాప్ టాప్ కొంటున్నారా? అదిరిపోయే ఆఫర్లతో అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్!
ల్యాప్ టాప్ కొనాలి అనుకునే వారికి గుడ్ న్యూస్. అదిరిపోయే ఆఫర్లతో నచ్చిన ల్యాప్ టాప్ కొనుగోలు చేసే అవకాశం కల్పిస్తోంది అమెజాన్. సెప్టెంబర్ 23 నుంచి గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ ప్రారంభం కానుంది.
ఇ-కామర్స్ దిగ్గజం అమెజాన్.. అదిరిపోయే ఆఫర్లతో వినియోగదారులకు ముందుకు వచ్చింది. సెప్టెంబర్ 23 నుంచి అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ ప్రారంభించనుంది. సుమారు నెల రోజుల పాటు ఈ సేల్ కొనసాగనుంది. రేపటి నుంచి దీపావళి (అక్టోబర్ 24) వరకు ఈ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ అనేక ఆకర్షణీయమైన ఆఫర్‌లను అందిస్తుంది. స్మార్ట్ ఫోన్‌ల నుంచి ల్యాప్ టాప్‌ల కళ్లు చెదిరే డిస్కౌంట్ ఇస్తుంది. వీటిలో Asus, Dell, HP, Xiaomi సహా పలు బ్రాండ్‌లకు సంబంధించి ఎలక్ట్రానిక్ ఉత్పత్తులపై బెస్ట్ ఆఫర్లు ఉన్నాయి. Amazonలో ల్యాప్‌టాప్‌లపై అందిస్తున్న టాప్ డీల్స్ ఇప్పుడు చూద్దాం..
Asus TUF గేమింగ్ A15
డీల్ ధర: రూ. 51,990 | MRP: రూ. 76,990
Nvidia GeForce GTX 1650 GDDR6తో పాటు AMD Ryzen 5 4600H మొబైల్ ప్రాసెసర్‌తో ఈ ల్యాప్ టాప్ పని చేస్తుంది. Asus TUF గేమింగ్ A15 హెవీ-డ్యూటీ గేమ్‌లైన Forza Horizon 5, Halo Infiniteని రన్ చేస్తుంది. మెమరీతో పాటు స్టోరేజీ విషయానికి వస్తే 8GB SO-DIMM DDR4 3,200MHz RAMతో పాటు 512GB PCIe 3.0 NVMe M.2 SSDతో వస్తుంది. SSD పెంచుకునేందుకు M.2 స్లాట్‌ని కలిగి ఉంటుంది. 15.6-అంగుళాల పూర్తి-HD (1,920x1,080 పిక్సెల్‌లు) డిస్‌ప్లే 144Hz రిఫ్రెష్ రేట్, vIPS-స్థాయి యాంటీ-గ్లేర్ ప్రొటెక్షన్ ను కలిగి ఉంటుంది.
Mi నోట్బుక్ ప్రో
డీల్ ధర: రూ. 56,990 | MRP: రూ. 74,999
MacBook ఎయిర్ లాంటి పనితీరును కోరుకునే వారికి Mi నోట్‌బుక్ ప్రో బెస్ట్ సెలెక్షన్ గా చెప్పుకోవచ్చు. Mi నోట్‌బుక్ ప్రో 14-అంగుళాల IPS QHD+ (2,560x1,600 పిక్సెల్) LED డిస్‌ప్లేతో 16:10 వైడ్ యాస్పెక్ట్ రేషియోను కలిగి ఉంటుంది. మెమరీతో పాటు స్టోరేజీ విషయానికి వస్తే .. 16GB DDR4 3,200MHz RAM, 512GB PCIe NVMe M.2 SSDతో వస్తుంది. గ్రాఫిక్స్ ఇంటెల్ ఐరిస్ Xe ద్వారా రన్ అవుతుంది. Mi నోట్‌బుక్ ప్రో 11వ తరం ఇంటెల్ టైగర్ లేక్ కోర్ i5 ప్రాసెసర్‌తో పనిచేస్తుంది.
డెల్ విండోస్ ఇన్స్పిరాన్ 3515
డీల్ ధర: రూ. 39,990 | MRP: రూ. 62,423
డెల్ విండోస్ ఇన్‌స్పైరాన్ 3515.. 3.5GHz పీక్ క్లాక్ స్పీడ్‌తో AMD రైజెన్ 5-3450U ప్రాసెసర్‌తో రన్ అవుతుంది. 8GB DDR4 RAM , 512GB SSDని కలిగి ఉంటుంది. RAM సామర్థ్యాన్ని 32GB వరకు పెంచుకోవచ్చు. గ్రాఫిక్స్ Ryzen ఓన్ Radeon Vega GPU ద్వారా నడుస్తుంది. Dell Windows Inspiron 3515 పూర్తి-HD యాంటీ-గ్లేర్ డిస్‌ప్లేతో వస్తుంది.
HP 15s-Ryzen 3
డీల్ ధర: రూ. 33,999 | MRP: రూ. 47,873
HP 15s-Ryzen 3 విద్యార్థులకు బాగా ఉపయోగపడే ల్యాప్ టాప్. ల్యాప్‌టాప్ బరువు కేవలం 1.69 కిలోలు. మెమరీ పరంగా, ఇది 8GB DDR4-3200 SDRAMని కలిగి ఉంది. 16GB RAM వరకు సపోర్ట్ చేస్తుంది. స్టోరేజీ విషయానికి వస్తే 256GB PCIe NVMe M.2 SSDతో వస్తుంది. HP 15s-Ryzen 3 15.6-అంగుళాల ఫుల్-HD యాంటీ-గ్లేర్ డిస్‌ప్లేతో 250 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్‌తో వస్తుంది.
MSI గేమింగ్ స్వోర్డ్ 15
డీల్ ధర: రూ. 82,490 | MRP: రూ. 1,06,990
ఇది అత్యంత ఖరీదైన ల్యాప్‌టాప్. రూ. 1 లక్షలోపు అత్యుత్తమ గేమింగ్ ల్యాప్‌టాప్‌లలో ఒకటి. MSI గేమింగ్ స్వోర్డ్ 15 12వ తరం ఇంటెల్ కోర్ i5 CPU ద్వారా 4.50GHz గరిష్ట క్లాక్ స్పీడ్ తో రన్ అవుతుంది. ఇన్ బిల్ట్ Nvidia GeForce RTX 3050 GDDR6 4GB GPUతో రన్ అవుతుంది. 16GB DDR4 3.200MHz RAMతో వస్తుంది. దీని ర్యామ్ 64GB వరకు పెంచుకునే అవకాశం ఉంది. స్టోరేజ్ విషయానికి వస్తే 1TB NVMe PCIe Gen4x4 SSDని కలిగి ఉంటుంది. 2.3 కిలోల బరువుతో 15.6-అంగుళాల IPS డిస్ ప్లేను కలిగి ఉంటుంది. 144Hz రిఫ్రెష్ రేట్ ను కలిగి ఉంటుంది.