Airtel Network Issue: ఎయిర్‌టెల్ వినియోగదారులకు నెట్‌వర్క్ సమస్యలు - మొబైల్ డేటా కూడా పనిచేయడం లేదట!
ఎయిర్‌టెల్ వినియోగదారులకు నెట్‌వర్క్ సమస్యలు ఎదురయ్యాయి. ఈ విషయాన్ని వినియోగదారులు ట్విట్టర్ ద్వారా తెలుపుతున్నారు.
భారత టెలికాం సర్వీస్ ఎయిర్‌టెల్ వినియోగదారులకు మళ్లీ సమస్యలు ఎదురవుతున్నాయి. దేశంలోని ఎన్నో ప్రాంతాల్లో నెట్‌వర్క్‌కు సంబంధించిన సమస్యలు తలెత్తాయని వినియోగదారులు ఫిర్యాదు చేస్తున్నారు. ఎఫెక్ట్ అయిన వినియోగదారులు ట్విట్టర్ వేదికగా ఈ విషయమై ఫిర్యాదులు చేస్తున్నారు. కొందరికి మొబైల్ డేటా కూడా పని చేయడం లేదని తెలుస్తోంది.
అయితే ఈ అవుటేజ్ వినియోగదారులు అందరినీ ఎఫెక్ట్ చేయలేదు. కాల్ రిసెప్షన్, సిగ్నల్ స్ట్రెంత్, మొబైల్ డేటా వంటి సర్వీసులు కొందరికి పనిచేస్తుండగా... కొందరికి మాత్రమే సమస్య తలెత్తినట్లు కనిపిస్తుంది. ఎందుకంటే ట్విట్టర్ వేదికగా కొందరు వినియోగదారులు మాత్రమే ఫిర్యాదు చేస్తున్నారు.
ప్రస్తుతానికి ఈ అవుటేజ్ ఎక్కువ ఈశాన్య రాష్ట్రాల్లో ఎక్కువగా ఉన్నట్లు కనిపిస్తుంది. అయితే డౌన్ డిటెక్టర్ వెబ్‌సైట్లో మాత్రం ముంబై, ఢిల్లీ, జైపూర్, హైదరాబాద్, బెంగళూరు, చెన్నై, కోల్‌కతా, గువాహటి వంటి ప్రాంతాల్లో కూడా ఈ సమస్య ఉన్నట్లు చూపిస్తుంది.
డౌన్‌డిటెక్టర్ వెబ్‌సైట్ ప్రకారం... మధ్యాహ్నం 1:50 గంటల సమయంలో ఈ అవుటేజ్ ప్రారంభం అయింది. మధ్యాహ్నం 2:40 గంటల నుంచి 3:40 గంటల మధ్యలో సమస్య సద్దుమణిగిందని పలువురు వినియోగదారులు రిపోర్ట్ చేశారు. అయితే సర్వీస్ డౌన్ అయిన విషయాన్ని ఎయిర్‌టెల్ ధ్రువీకరించలేదు.
week indoor poor coverage, anytime network fluctuations, slow ghatiya Bad Data speed Issues se Pareshan Ho Gaya Hoon. Complaint krne pe sirf jhaansa ashvasan Diya ja rha hai working krne ka, Aajtak koi improvement nhi hua hai. #Airteldown @Airtel_Presence @DoT_India pic.twitter.com/Gkxwg2W7AN
— AMIT KUMAR SINGH (@AMITKUM78655343) May 28, 2022
Is airtel really down for everyone or i am only facing it???#Airtel #airteldown@airtelindia
— Hindu🕉️ (@kabra_mal) May 28, 2022
Shame on u airtel!
The network of #airtel is very down in #Cuddalore #TamilNadu 🤦pls solve this problem quickly #Airteldown
— R.K.SIVA (@R_K_SIVA_) May 28, 2022
Also Read: వన్‌ప్లస్ 10ఆర్ వచ్చేసింది - ఏకంగా 150W ఫాస్ట్ చార్జింగ్ - ధర ఎంతంటే?
Also Read: రూ.10 వేలలోనే ట్యాబ్లెట్ - లాంచ్ చేసిన రియల్‌మీ - ఎలా ఉందో చూశారా!