WPL Auction 2023: మహిళల ఐపీఎల్‌లో టాప్-5 ప్లేయర్లు వీరే - కాసుల వర్షం కురిపించిన ఫ్రాంచైజీలు!
మహిళల ప్రీమియర్ లీగ్ వేలంలో టాప్-5 ఖరీదైన ఆటగాళ్లు వీరే.
Top Buy Of WPL: మహిళల ప్రీమియర్ లీగ్ వేలంలో ఆటగాళ్లపై భారీ డబ్బుల వర్షం కురిసింది. స్మృతి మంథన, యాష్లే గార్డ్‌నర్, నటాలీ స్కీవర్, దీప్తి శర్మ, జెమీమా రోడ్రిగ్స్, హర్మన్‌ప్రీత్ కౌర్ వంటి ప్లేయర్ల కోసం జట్లు చాలా డబ్బు ఖర్చు చేశాయి. ఇప్పుడు మహిళల ప్రీమియర్ లీగ్ వేలంలో ఐదుగురు అత్యంత ఖరీదైన ప్లేయర్లు ఎవరో చూద్దాం. ఈ జాబితాలో భారతీయ మహిళా క్రికెటర్లతో పాటు విదేశీ ప్లేయర్లు కూడా ఉన్నారు.
స్మృతి మంథన
మహిళల ప్రీమియర్ లీగ్ వేలంలో భారత జట్టు ఓపెనర్ స్మృతి మంథన అత్యంత ఖరీదైన క్రీడాకారిణిగా నిలిచింది. రూ.3.40 కోట్ల భారీ మొత్తానికి స్మృతి మంధానను రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు సంతకం చేసింది. స్మృతి మంథన కోసం ముంబై ఇండియన్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య ఆసక్తికరమైన పోరు జరిగింది. కానీ చివరికి రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు గెలిచింది.
యాష్లే గార్డనర్
ఆస్ట్రేలియా ఆల్ రౌండర్ యాష్లే గార్డనర్ పై డబ్బుల వర్షం కురిపించింది. మహిళల ప్రీమియర్ లీగ్ వేలంలో స్మృతి మంథన తర్వాత అత్యంత ఖరీదైన క్రీడాకారిణి యాష్లే గార్డనర్. గుజరాత్ టైటాన్స్ జట్టు ఈ ఆస్ట్రేలియా ఆల్ రౌండర్‌ను రూ.3.2 కోట్లు వెచ్చించి తమ జట్టులో చేర్చుకుంది. ఈ వెటరన్ ఆల్ రౌండర్ మహిళల ప్రీమియర్ లీగ్ మొదటి సీజన్‌లో గుజరాత్ జెర్సీలో కనిపించనుంది.
నటాలీ స్కీవర్
ఇంగ్లండ్‌కు చెందిన ఈ పేస్ బౌలింగ్ ఆల్‌రౌండర్‌పై కూడా కాసుల వర్షం కురిసింది. ముంబై ఇండియన్స్ రూ.3.2 కోట్లకు నటాలీని కొనుగోలు చేసింది. అంతర్జాతీయ క్రికెట్లో తనకు మంచి రికార్డు ఉంది. ఈ వేలంలో అత్యంత ఖరీదైన ఇంగ్లండ్ మహిళా క్రికెటర్‌గా నటాలీ స్కీవర్ నిలిచింది.
దీప్తి శర్మ
భారత ఆల్‌రౌండర్ దీప్తి శర్మకు ఊహించినట్లుగానే భారీ మొత్తం లభించింది. యూపీ వారియర్స్ ఈ ఆల్ రౌండర్‌ను రూ.2.60 కోట్లకు కొనుగోలు చేసింది. భారత జట్టులో తన బ్యాటింగ్‌తో పాటు, తన బౌలింగ్‌లో అద్భుతంగా రాణించిన దీప్తి శర్మ మహిళల ప్రీమియర్ లీగ్‌లో యూపీ వారియర్స్ జెర్సీలో కనిపించనుంది.
జెమీమా రోడ్రిగ్స్
ఆదివారం పాకిస్థాన్‌తో జరిగిన టీ20 ప్రపంచకప్ మ్యాచ్‌లో జెమీమా రోడ్రిగ్స్ అజేయమైన మ్యాచ్ విన్నింగ్ ఇన్నింగ్స్ ఆడింది. ఇప్పుడు మహిళల ప్రీమియర్ లీగ్ వేలంలో ఈ క్రీడాకారిణికి భారీ మొత్తం లభించింది. మహిళల ప్రీమియర్ లీగ్ వేలంలో ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు జెమీమా రోడ్రిగ్స్‌ను రూ.2.20 కోట్లకు కొనుగోలు చేసింది.
View this post on Instagram
View this post on Instagram