WPL 2023: టాస్ గుజరాత్‌దే - బౌలింగ్‌కే ఫిక్స్ అయిన బెత్ మూనీ!
మహిళల ఐపీఎల్ మొదటి సీజన్ తొలి మ్యాచ్‌లో గుజరాత్ జెయింట్స్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది.
Gujarat Giants vs Mumbai Indians Women, WPL 2023: మహిళల ప్రీమియర్ లీగ్ మొదటి మ్యాచ్‌లో గుజరాత్ జెయింట్స్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. ముంబైలోని డాక్టర్ డీవై పాటిల్ స్పోర్ట్స్ అకాడమీలో గుజరాత్ జెయింట్స్, ముంబై ఇండియన్స్ మహిళల జట్టు మధ్య ఈ మ్యాచ్ జరగనుంది. ఈ సీజన్ మొత్తం స్పోర్ట్స్ 18 నెట్‌వర్క్‌లో ప్రత్యక్ష ప్రసారం కానుంది. ఈ మ్యాచ్ రాత్రి ఎనిమిది గంటలకు ప్రారంభం కానుంది.
గుజరాత్ జెయింట్స్, ముంబై ఇండియన్స్ మహిళల జట్ల మధ్య జరిగే ఈ సీజన్ మొదటి మ్యాచ్‌ను మొత్తం సీజన్ మ్యాచ్‌ల ప్రసార హక్కులను కలిగి ఉన్న స్పోర్ట్స్ 18 నెట్‌వర్క్‌లో ప్రత్యక్ష ప్రసారం ద్వారా రాత్రి 7:30 గంటలకు చూడవచ్చు. ఈ మ్యాచ్ ఆన్‌లైన్ లైవ్ స్ట్రీమింగ్‌ను సినిమా యాప్, వెబ్‌సైట్ ద్వారా చూడవచ్చు. మ్యాచ్‌ను 4కే స్ట్రీమింగ్ చేసే అవకాశం కూడా ఉంది.
ముంబై ఇండియన్స్ వుమెన్ (ప్లేయింగ్ XI)
హేలీ మాథ్యూస్, యాస్తికా భాటియా(వికెట్ కీపర్), హర్మన్‌ప్రీత్ కౌర్(కెప్టెన్), నాట్ స్కివర్-బ్రంట్, అమేలియా కెర్, అమంజోత్ కౌర్, పూజా వస్త్రాకర్, హుమైరా కాజీ, ఇస్సీ వాంగ్, జింటిమణి కలిత, సైకా ఇషాక్
గుజరాత్ జెయింట్స్ (ప్లేయింగ్ XI)
బెత్ మూనీ(కెప్టెన్, వికెట్ కీపర్), సబ్బినేని మేఘన, హర్లీన్ డియోల్, ఆష్లీ గార్డనర్, అన్నాబెల్ సదర్లాండ్, దయాళన్ హేమలత, జార్జియా వేర్‌హామ్, స్నేహ రాణా, తనూజా కన్వర్, మోనికా పటేల్, మాన్సీ జోషి
మహిళల ప్రీమియర్ లీగ్ మ్యాచ్‌ల ప్రత్యక్ష ప్రసారం కూడా స్పోర్ట్స్-18లోనే జరగనుంది. ఆన్‌లైన్‌లో లైవ్ స్ట్రీమింగ్ అయితే జియో సినిమా యాప్‌లో చూడవచ్చు. ప్రారంభ వేడుకల అనంతరం ఈ సీజన్‌లో గుజరాత్ జెయింట్స్, ముంబై ఇండియన్స్ మధ్య తొలి మ్యాచ్ జరగనుంది.
ఇండియన్ ప్రీమియర్ లీగులో ముంబయి ఇండియన్స్ (MI) ఛాంపియన్స్ జట్టు! మహిళల ప్రీమియర్ లీగులోనూ విజేతగా నిలవాలని అనుకుంటోంది. అందుకు తగ్గట్టే మంచి జట్టును ఎంపిక చేసుకుంది. సపోర్ట్ స్టాఫ్‌కు తిరుగులేదు. పురుషుల్లాగే ఇక్కడా టీమ్‌ఇండియా కెప్టెన్‌నే సారథిగా ఎంచుకుంది. ప్రత్యర్థుల మతి పోగొట్టే షాట్లు ఆడగల హర్మన్ ప్రీత్ కౌర్‌ను (Harmanpreet Kaur) నాయకురాలిగా నియమించింది. బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్‌లో ఆమెకు ఎదురు లేదు. చకచకా వ్యూహాలు రచించగలదు. లాంకాషైర్ థండర్, మంచెస్టర్ ఒరిజినల్స్, మెల్‌బోర్న్ రెనెగేడ్స్, సిడ్నీ థండర్స్, సూపర్‌నోవా జట్లకు ఆడింది. 151 టీ20ల్లో 28 సగటుతో 3058 పరుగులు చేసింది. 32 వికెట్లు పడగొట్టింది.
మహిళల లీగులో మంచి సపోర్ట్ స్టాఫ్ ఉన్న జట్టేదైనా ఉందంటే అది గుజరాత్ జెయింట్స్ (Gujarat Giants)! మిథాలీ రాజ్, రేచెల్ హెయిన్స్‌ను తీసుకుంది. వీరిద్దరూ రైల్వేస్, ఆసీస్ క్రికెటర్లను ఎక్కువగా తీసుకున్నారు. చక్కని ఆల్‌రౌండర్లనూ ఎంపిక చేశారు. అయితే రూ.3.2 కోట్లకు కొనుగోలు చేసిన యాష్లే గార్డ్‌నర్‌ను కాకుండా రూ.2 కోట్లకు తీసుకున్న బెత్ మూనీకి (Beth Mooney) సారథ్యం అప్పగించారు. ఆసీస్ క్రికెట్లో ఆమె ఓ సంచలనం. నిలబడిందంటే సెంచరీ చేయడం పక్కా! ఏ మాత్రం కనికరించకుండా సిక్సర్లు, బౌండరీలు బాదేస్తుంది. బ్రిస్బేన్ హీట్, లండన్ స్పిరిట్, పెర్త్ స్కార్చర్స్, క్వీన్స్‌ల్యాండ్, యార్క్‌షైర్‌కు ఆడింది. 83 టీ20ల్లో 40.51 సగటుతో 2350 పరుగులు చేసింది. 2 సెంచరీలు, 18 హాఫ్ సెంచరీలు కొట్టింది.