Asia Cup 2025 Abhishek sharma New Record: అభిషేక్ ఫాస్టెస్ట్ రికార్డు.. ఆసియాకప్ లో అత్యధిక రన్స్ తో ఘనత.. లంకపై ఫిఫ్టీతో మెరిసిన శర్మ.. కోహ్లీ, రోహిత్ సరసన చేరిక
ఓపెనర్ అభిషేక్ పరుగుల వరద పారిస్తున్నాడు.ఆసియాకప్ లో అత్యధిక పరుగులు చేసిన క్రికెటర్ గా రికార్డులకెక్కాడు. అలాగే వరుసగా మూడో ఫిఫ్టీతో సత్తా చాటాడు. అలాగే వరుసగా ఏడో 30+ స్కోరును సాధించాడు.

Asia Cup 2025 Abhishek Sharma Latest News: సూపర్ ఫామ్ లో ఉన్న భారత విధ్వంసక ఓపెనర్ అభిషేక్ శర్మ.. తాజాగా తన ఖాతాలో మరో అరుదైన రికార్డును దక్కించుకున్నాడు. శ్రీలంకతో తాజాగా జరిగిన మ్యాచ్ లో తను విధ్వంసక ఫిఫ్టీ (31 బంతుల్లో 61, 8 ఫోర్లు, 2 సిక్సర్లు) తో సత్తా చాటి, పలు రికార్డులను కొల్లగొట్టాడు. ఆసియాకప్ (టీ20 ఎడిషన్ లో) ఒక ఎడిషన్ లో 300 పరుగులు చేసిన క్రికెటర్ గా రికార్డులకెక్కాడు. గతంలో ఈ రికార్డు పాకిస్థాన్ వికెట్ కీపర్ బ్యాటర్ మహ్మద్ రిజ్వాన్ పేరిట ఉండగా, తాజాగా దీన్ని అభిషేక్ బద్దలు కొట్టాడు. అలాగే తొలిసారి 300+ పరుగులు చేసిన క్రికెటర్ గానూ రికార్డులకెక్కాడు. శుక్రవారం దుబాయ్ వేదికగా శ్రీలంకతో జరిగిన మ్యాచ్ లో అభిషేక్ మరిన్ని ఘనతలను సొంతం చేసుకున్నాడు. వరుసగా 7వ సారి 30+ స్కోరును చేసిన క్రికెటర్ గా జాయింట్ గా ఘనత వహించాడు. గతంలో రోహిత్ శర్మ, రిజ్వాన్ కూడా ఈ ఘనత సాధించారు. మరోవైపు వరుసగా మూడో అర్థ సెంచరీతో తను సత్తా చాటాడు. తన కెరీర్లో 25 బంతులలోపు ఫాస్టెస్ట్ గా చేసిన ఆరో ఫిఫ్టీ కావడం విశేషం.
Abhishek Sharma = Genius Mode ON. 🚀🔥
— Mera Gurgaon News (@MeraGurgaonNews) September 26, 2025
Fearless. Flawless. Fireworks!#AbhishekSharma #INDvSL #SLvsIND #T20Match #AsiaCup2025 #INDvsPAK #AsiaCupFinal #TeamIndia #PakistanCricket #CricketNews pic.twitter.com/XSqA6GSUBk
ఇద్దరి సరసన..
ఒక టీ20 టోర్నీలో 250+ పరుగులను చేసిన మూడో భారత క్రికెటర్ గా అభిషేక్ ఘనత వహించాడు. గతంలో విరాట్ కోహ్లీ ( 2014 టీ20 ప్రపంచకప్ లో319 పరుగులు, 2016 టీ20 ప్రపంచకప్ లో 273 రన్స్, 2022 టీ20 ప్రపంచకప్ లో 296 రన్స్) సాధించాడు. అలాగే గతేడాది జరిగిన టీ20 ప్రపంచకప్ లో రోహిత్ శర్మ 257 పరుగులు సాధించాడు. తాజాగా ఆసియాకప్ లో 309 పరుగులు చేసిన అభిషేక్ వీరి సరసన చేవాడు. మరో 11 పరుగులు సాధిస్తే, కోహ్లీని అధిగమించి, ఒక టోర్నమెంట్ లో అత్యధిక పరుగులు చేసిన భారత క్రికెటర్ గా నిలుస్తాడు.
ఆ రికార్డుపై గురి..
ఒక ఒక టీ20 ట్రోఫీలో అత్యధిక పరుగులు చేసిన రికార్డు ఇంగ్లాండ్ కు చెందిన ఫిల్ సాల్ట్ పేరిట ఉంది. గతంలో తను ఒక సిరీస్ లో ఐదు ఇన్నింగ్స్ ల్లోనే 331 పరుగులు సాధించాడు. ప్రస్తుతం ఈ ట్రోఫీలో 309 పరుగులు చేసిన అభిషేక్.. మరో 23 పరుగులు చేస్తే, ఈ రికార్డును సమం చేస్తాడు. ఆదివారం పాకిస్తాన్ తో ఫైనల్ ఉన్న నేపథ్యంలో ఈ రికార్డును అందుకోవాలని భారత అభిమానులు కోరుకుంటున్నారు. మరోవైపు వరుసగా మూడు అర్దసెంచరీలు చేసిన భారత ప్లేయర్లు కోహ్లీ (మూడుసార్లు), కేఎల్ రాహుల్, సూర్య కుమార్ యాదవ్ (రెండు సార్లు), రోహిత్ శర్మ, శ్రేయస్ అయ్యర్ మాత్రమే గతంలో ఈ ఘనత సాధించారు. ఆదివారం ఫైనల్లో మరో ఫిఫ్టీని శర్మ సాధిస్తే, వరుసగా నాలుగో ఫిఫ్టీ చేసిన భారత క్రికెటర్ గా రికార్డులకెక్కుతాడు.




















