News
News
abp shortsABP షార్ట్స్వీడియోలు ఆటలు
X
ఎన్నికల ఫలితాలు 2023

World Cup 2023: ప్రపంచ కప్‌లో మర్చిపోలేని క్షణాలివే - విరాట్ 50 సెంచరీల నుంచి మ్యాక్స్‌వెల్ మెరుపుల వరకు!

World Cup 2023 Best Moments: 2023 వరల్డ్ కప్‌లో అభిమానులు ఎప్పటికీ మర్చిపోలేని బెస్ట్ మూమెంట్స్ కొన్ని ఉన్నాయి.

FOLLOW US: 
Share:

World Cup 2023 Highlights: ప్రపంచ కప్ 2023 ప్రయాణం ముగిసింది. ప్యాట్ కమిన్స్ నేతృత్వంలోని ఆస్ట్రేలియా ఫైనల్లో టీమిండియాను ఓడించి ట్రోఫీని గెలుచుకుంది. 46 రోజుల పాటు జరిగిన ఈ టోర్నీలో 48 మ్యాచ్‌లు జరిగాయి. ఈ మ్యాచ్‌ల్లో ఎన్నో కొత్త రికార్డులు నమోదయ్యాయి. అనేక వివాదాలు కూడా వార్తల్లో నిలిచాయి. ప్రపంచ కప్ 2023లో చిరస్మరణీయమైన క్షణాల గురించి తెలుసుకుందాం.

గ్లెన్‌ మాక్స్‌వెల్‌, ఎయిడెన్‌ మార్క్రమ్‌ మెరుపులు
ప్రపంచ కప్ ప్రారంభ రోజుల్లో దక్షిణాఫ్రికా బ్యాట్స్‌మెన్ ఎయిడెన్ మార్క్రమ్ ప్రపంచ కప్ చరిత్రలోనే అత్యంత వేగవంతమైన సెంచరీని సాధించాడు. శ్రీలంకపై ఎయిడెన్ మార్క్రమ్ కేవలం 49 బంతుల్లోనే సెంచరీ మార్కును చేరుకున్నాడు. అయితే కేవలం 18 రోజుల వ్యవధిలోనే ఆస్ట్రేలియా ఆటగాడు గ్లెన్ మాక్స్‌వెల్ నెదర్లాండ్స్‌పై 40 బంతుల్లో సెంచరీ చేసి ఎయిడెన్ మార్క్రమ్ రికార్డును బద్దలు కొట్టాడు.

సత్తా చాటిన ఆఫ్ఘనిస్తాన్, నెదర్లాండ్స్
ఈ ప్రపంచకప్‌లో బలహీనంగా భావించే జట్లు అద్భుతంగా ఆడాయి. ముఖ్యంగా ఆఫ్ఘనిస్థాన్, నెదర్లాండ్స్ అద్భుతమైన ఆటతీరును కనబరిచి, పలు బలమైన జట్లపై బాగా పోరాడాయి. ఇంగ్లండ్, పాకిస్తాన్ వంటి జట్లను ఓడించి ఆఫ్ఘనిస్తాన్ అందరినీ ఆశ్చర్యపరిచింది. కాగా దక్షిణాఫ్రికాను ఓడించడం ద్వారా నెదర్లాండ్స్ కూడా వార్తల్లో నిలిచింది.

గ్లెన్ మాక్స్‌వెల్ మరిచిపోలేని ఇన్నింగ్స్
ఆస్ట్రేలియా ఆటగాడు గ్లెన్ మాక్స్‌వెల్ ప్రపంచకప్ చరిత్రలో అత్యంత వేగవంతమైన సెంచరీని నమోదు చేశాడు. నెదర్లాండ్స్‌పై గ్లెన్ మాక్స్‌వెల్ కేవలం 40 బంతుల్లోనే సెంచరీ సాధించాడు. ఆ తర్వాత ఆఫ్ఘనిస్థాన్‌పై గ్లెన్ మాక్స్‌వెల్ 128 బంతుల్లో 201 పరుగులు చేశాడు. గ్లెన్ మాక్స్‌వెల్ అద్భుత ఇన్నింగ్స్‌తో ఆస్ట్రేలియా ఓటమి అంచుల నుంచి బయటపడి ఆఫ్ఘనిస్తాన్‌పై విజయం సాధించాడు.

టైమ్ అవుట్‌గా పెవిలియన్ బాట పట్టిన మొదటి బ్యాటర్
146 ఏళ్ల అంతర్జాతీయ క్రికెట్‌లో టైం అవుట్ అయిన తొలి క్రికెటర్‌గా శ్రీలంక ఆటగాడు ఏంజెలో మాథ్యూస్ నిలిచాడు. దీనిపై పెద్ద దుమారమే చెలరేగింది. వాస్తవానికి ఏంజెలో మాథ్యూస్ హెల్మెట్‌లో కొంత సమస్య ఉంది. దాని కారణంగా అతను బంతిని ఎదుర్కొనేందుకు సిద్ధంగా లేడు. అప్పుడు బంగ్లాదేశ్ అప్పీల్ చేయడంతో అంపైర్ ఏంజెలో మాథ్యూస్‌ను టైమ్ అవుట్ అని ప్రకటించారు.

మహ్మద్ షమీ విధ్వంసకర బౌలింగ్‌
శ్రీలంకతో జరిగిన గ్రూప్ మ్యాచ్‌లో భారత ఫాస్ట్ బౌలర్ మహ్మద్ షమీ ఐదుగురు బ్యాట్స్‌మెన్‌లను పెవిలియన్ బాట పట్టించాడు. ఈ మ్యాచ్‌లో శ్రీలంక జట్టు కేవలం 55 పరుగులకే కుప్పకూలింది. ఆ తర్వాత న్యూజిలాండ్‌పై మహ్మద్ షమీ ఏడు వికెట్లు పడగొట్టాడు. అలాగే ఈ ప్రపంచకప్‌లో మహ్మద్ షమీ అత్యధికంగా 24 వికెట్లు పడగొట్టాడు.

సచిన్ టెండూల్కర్‌ను వెనక్కు నెట్టిన విరాట్ కోహ్లి
న్యూజిలాండ్‌తో జరిగిన ప్రపంచకప్ సెమీ ఫైనల్ మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ తన వన్డే కెరీర్‌లో 50వ సెంచరీని నమోదు చేశాడు. ఈ విధంగా వన్డే ఫార్మాట్‌లో అత్యధిక సెంచరీలు చేసిన బ్యాట్స్‌మెన్‌గా విరాట్ కోహ్లీ నిలిచాడు. గతంలో ఈ రికార్డు భారత మాజీ దిగ్గజం సచిన్ టెండూల్కర్ పేరిట ఉండేది. సచిన్ టెండూల్కర్ తన వన్డే కెరీర్‌లో 49 సెంచరీలు సాధించాడు.

గుండెలు బద్దలు చేసిన ట్రావిస్ హెడ్ సెంచరీ
భారత్‌తో జరిగిన ఫైనల్లో ట్రావిస్ హెడ్ చేసిన సెంచరీ కోట్లాది అభిమానుల హృదయాలను బద్దలు కొట్టింది. ఈ మ్యాచ్‌లో ట్రావిస్ హెడ్ 120 బంతుల్లో 137 పరుగులు చేశాడు. ఈ ఇన్నింగ్స్‌తో భారత్‌ను ఓడించి ఆస్ట్రేలియా వన్డే ప్రపంచకప్‌ను ఆరోసారి గెలుచుకుంది.

Published at : 21 Nov 2023 12:24 AM (IST) Tags: Glenn Maxwell VIRAT KOHLI World Cup 2023 Virat Kohli 50th Century World Cup 2023 Best Moments Glenn Maxwell Greatest Innings

ఇవి కూడా చూడండి

South Africa Squad vs India: భారత్‌తో సిరీస్‌కు దక్షిణాఫ్రికా జట్టు ప్రకటన,  బవూమాకు బిగ్‌ షాక్‌

South Africa Squad vs India: భారత్‌తో సిరీస్‌కు దక్షిణాఫ్రికా జట్టు ప్రకటన, బవూమాకు బిగ్‌ షాక్‌

IND v AUS: టీం ఇండియా ఆనవాయతీ కొనసాగించిన స్కై , విన్నింగ్ ట్రోఫీ ఎవరికి ఇచ్చాడంటే..

IND v AUS:  టీం ఇండియా ఆనవాయతీ కొనసాగించిన స్కై , విన్నింగ్ ట్రోఫీ ఎవరికి ఇచ్చాడంటే..

Virat Kohli: కింగ్‌ కోహ్లీ అంటే అట్లుంటది మరి, ప్రభావవంతమైన వ్యక్తుల జాబితాలో చోటు

Virat Kohli: కింగ్‌ కోహ్లీ అంటే అట్లుంటది మరి, ప్రభావవంతమైన వ్యక్తుల జాబితాలో చోటు

Ruturaj Gaikwad: రుతురాజ్‌ గైక్వాడ్‌ అరుదైన రికార్డు , ఆసిస్‌పై అన్ని పరుగులు చేయటం తొలిసారట

Ruturaj Gaikwad: రుతురాజ్‌ గైక్వాడ్‌ అరుదైన రికార్డు , ఆసిస్‌పై అన్ని పరుగులు చేయటం తొలిసారట

Sports Award selection committee: క్రీడా పురస్కారాల ఎంపికకు కమిటీ , 12 మంది దిగ్గజాలతో ఏర్పాటు

Sports Award selection committee:  క్రీడా పురస్కారాల ఎంపికకు కమిటీ , 12 మంది దిగ్గజాలతో ఏర్పాటు

టాప్ స్టోరీస్

Janagama ZP Chairman Died: జనగామ జడ్పీ చైర్మన్ సంపత్ రెడ్డి మృతి, బీఆర్ఎస్ పార్టీలో విషాదం

Janagama ZP Chairman Died: జనగామ జడ్పీ చైర్మన్ సంపత్ రెడ్డి మృతి, బీఆర్ఎస్ పార్టీలో విషాదం

Telangana State Corporation Chairmans: తెలంగాణ రాష్ట్ర కార్పొరేషన్ చైర్మన్ల ముకుమ్మడి రాజీనామాలు, సీఎస్ కు లేఖ

Telangana State Corporation Chairmans: తెలంగాణ రాష్ట్ర కార్పొరేషన్ చైర్మన్ల ముకుమ్మడి రాజీనామాలు, సీఎస్ కు లేఖ

Telangana CLP Meeting: ముగిసిన తెలంగాణ సీఎల్పీ భేటీ- ముఖ్యమంత్రి అభ్యర్థి ఎంపిక బాధ్యత అధిష్ఠానానికి అప్పగిస్తూ తీర్మానం

Telangana CLP Meeting: ముగిసిన తెలంగాణ సీఎల్పీ భేటీ- ముఖ్యమంత్రి అభ్యర్థి ఎంపిక బాధ్యత అధిష్ఠానానికి అప్పగిస్తూ తీర్మానం

Hyundai Price Hike: 2024లో పెరగనున్న హ్యుందాయ్ కార్ల ధరలు - ఎందుకు పెరగనున్నాయి? ఎంత పెరగనున్నాయి?

Hyundai Price Hike: 2024లో పెరగనున్న హ్యుందాయ్ కార్ల ధరలు - ఎందుకు పెరగనున్నాయి? ఎంత పెరగనున్నాయి?
×