Virat Kohli: సచిన్ సెంచరీల రికార్డును విరాట్ బద్దలు కొడతాడా? - సునీల్ గవాస్కర్ ఏమన్నాడంటే?
సచిన్ టెండూల్కర్ రికార్డులను విరాట్ కోహ్లీ బద్దలు కొడతాడా? సునీల్ గవాస్కర్ ఏమన్నాడంటే?

Sunil Gavaskar On Virat Kohli: శ్రీలంకతో జరిగిన మూడో వన్డేలో విరాట్ కోహ్లీ అద్భుత సెంచరీ చేశాడు. ఆ మ్యాచ్‌లో భారత మాజీ కెప్టెన్ 110 బంతుల్లో 166 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. విరాట్ కోహ్లీ వన్డే కెరీర్‌లో ఇది 46వ సెంచరీ. అంతర్జాతీయ కెరీర్‌లో ఇది 74వ సెంచరీ.
గ్రేట్ బ్యాట్స్‌మెన్ సచిన్ టెండూల్కర్ 100 సెంచరీల రికార్డును విరాట్ కోహ్లీ బద్దలు కొట్టగలడా? మాస్టర్ బ్లాస్టర్ రికార్డును బద్దలు కొట్టాలంటే విరాట్ కోహ్లీ మరో 26 అంతర్జాతీయ సెంచరీలు చేయాల్సి ఉంటుంది. అయితే ఈ ప్రశ్నకు భారత మాజీ వెటరన్ బ్యాట్స్‌మెన్ సునీల్ గవాస్కర్ సమాధానమిచ్చాడు.
విరాట్ కోహ్లీ 100 సెంచరీలు సాధించగలడా?
శ్రీలంకపై సెంచరీ ఆడిన తర్వాత సునీల్ గవాస్కర్ విరాట్ కోహ్లీపై ప్రశంసలు కురిపించాడు. విరాట్ కోహ్లి 40 ఏళ్ల వరకు ఆడితే సులువుగా 100 సెంచరీలు సాధిస్తాడని అన్నాడు. విరాట్ కోహ్లీ మరో 5-6 ఏళ్ల పాటు అంతర్జాతీయ క్రికెట్‌లో ఆడితే అతను ఆ స్థాయికి చేరుకుంటాడని, అందులో ఎలాంటి సందేహం లేదని లిటిల్ మాస్టర్ చెప్పాడు.
విరాట్ కోహ్లి ప్రతి సంవత్సరం సగటున 6-6 సెంచరీలు చేస్తున్నాడని చెప్పాడు. అతను ఈ సగటుతో తన సెంచరీలను పెంచుకుంటూ పోతే వచ్చే ఐదు, ఆరు సంవత్సరాల్లో అతను ఖచ్చితంగా 26 సెంచరీలు సాధించడం ఖాయం.
ఫిట్‌నెస్‌పైనే దృష్టి పెట్టాడు
సచిన్ టెండూల్కర్ 40 ఏళ్ల వరకు క్రికెట్ ఆడుతూనే ఉన్నాడని, ఆ వయసు వరకు విరాట్ కోహ్లీ ఆడితే కచ్చితంగా 100 సెంచరీలు సాధిస్తాడని సునీల్ గవాస్కర్ అన్నాడు. దీంతో పాటు ఫిట్‌నెస్‌పై విరాట్ కోహ్లీకి చాలా అవగాహన ఉందని చెప్పాడు. అతను భారత జట్టులో వేగంగా పరుగెత్తే ఆటగాళ్లలో ఒకడు.
విరాట్ కోహ్లి కంటే వేగంగా పరిగెత్తగలిగింది మహేంద్ర సింగ్ ధోని మాత్రమే అని లిటిల్ మాస్టర్ అన్నాడు. విరాట్ కోహ్లి ఈ వయసులో కూడా యువ ఆటగాళ్ల కంటే వేగంగా పరిగెత్తగలడని తెలిపాడు. సింగిల్స్‌ను డబుల్స్‌గా మార్చగల సత్తా అతనికి ఉందన్నాడు. విరాట్ కోహ్లీ నిజమైన ఛాంపియన్ అనడంలో ఎలాంటి సందేహం లేదని పేర్కొన్నాడు.
View this post on Instagram
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

