Formula E Hyderabad: అసలు ‘ఫార్ములా E‘ రేసింగ్ అంటే ఏంటి? పర్యావరణానికి, ఫార్ములా Eకి లింకేంటి?
హైదరాబాద్‌లో జరగనున్న ఫార్ములా ఈ రేసింగ్ అంటే ఏంటి? ఇందులో ఏ కార్లు ఉపయోగిస్తారు?
ఫార్ములా ఈ ట్రయల్ రన్ హైదరాబాద్‌లో నవంబర్ 19, 20 తేదీల్లో జరగనుంది. అలాగే 2023 ప్రారంభంలో మనదేశంలోనే మొట్టమొదటి ఫార్ములా ఈ రేసు జరగనుంది. దీనికి కూడా హైదరాబాదే వేదిక కానుంది. 2023 ఫిబ్రవరి 11వ తేదీన ఈ రేసును నిర్వహించనున్నారు. హైదరాబాద్ నగరం నడిమధ్యలో ఎన్టీఆర్ గార్డెన్ ఎదురుగా ప్రారంభం అయి, ఎన్టీఆర్ మార్గ్ మీదుగా ఐమ్యాక్స్ రోడ్డు వద్ద ఈ రేసు ముగియనుంది.
అసలు ఈ ఫార్ములా ఈ రేసు అంటే ఏంటి?
ఫార్ములా ఈ అనేది ప్రపంచంలో మొదటి ఆల్ ఎలక్ట్రిక్ ఇంటర్నేషనల్ సింగిల్ సీటర్ చాంపియన్‌షిప్. ఏబీబీ ఎఫ్ఐఏ ఫార్ములా ఈ వరల్డ్ చాంపియన్‌షిప్ అని దీన్ని అధికారికంగా పిలుస్తారు. రేసింగ్‌లను మరింత మెరుగ్గా, కాలుష్యం లేకుండా నిర్వహించాలనే లక్ష్యంతో దీన్ని రూపొందించారు. 2014లో బీజింగ్‌లోని ఒలంపిక్ పార్క్‌లో దీనికి సంబంధించిన మొదటి రేసు జరిగింది. అప్పటి నుంచి ఫార్ములా ఈ గ్లోబల్ ఎంటర్‌టైన్‌మెంట్ బ్రాండ్‌గా ఎదిగింది. బెస్ట్ రేసింగ్ డ్రైవర్లు, టీమ్స్ ఇందులో ఉన్నారు.
ఫార్ములా ఈ కార్లు ఎలా పని చేస్తాయి?
ఫార్ములా ఈ కార్లలో ఒక ఇన్వర్టర్, మోటార్, ఒక ట్రాన్స్‌మిషన్ ఉంటాయి. బ్యాటరీ నుంచి తీసుకున్న ఎలక్ట్రిసిటీని ఇన్వర్టర్ డైరెక్ట్ కరెంట్ (డీసీ) నుంచి ఆల్టర్నేటింగ్ కరెంట్‌గా (ఏసీ) మారుస్తుంది. దీన్ని ఉపయోగించి మోటార్ చక్రాలను తిప్పుతుంది.
ఫార్ములా ఈ కార్లు ఎంత వేగంగా వెళ్తాయి?
ప్రస్తుతం ఉన్న అన్ని ఎలక్ట్రిక్ రేసింగ్ కార్లు గంటకు 280 కిలోమీటర్ల గరిష్ట వేగంతో ప్రయాణించగలవు. 250 kW పవర్ ద్వారా 0 నుంచి 100 కిలోమీటర్ల వేగాన్ని కేవలం 2.8 సెకన్లలోనే ఇవి అందుకుంటాయి.
ఫార్ములా ఈ కారు బరువు ఎంత ఉంటుంది?
ఫార్ములా ఈ కారు కనీసం 903 కేజీల బరువు ఉంటుంది. ఇది డ్రైవర్, బ్యాటరీ బరువుతో కలిపి. బ్యాటరీ బరువు సాధారణంగా 385 కేజీలుగా ఉంటుంది.
ఫార్ములా ఈ కారు బ్యాటరీ ఎంత సేపు ఉంటుంది?
సాధారణంగా ఫార్ములా ఈ రేసు 45 నిమిషాలు ఉంటుంది. ప్రస్తుతం ఉన్న టెక్నాలజీతో బ్యాటరీ మార్చాల్సిన అవసరం కూడా లేకుండా ఈ రేసును పూర్తి చేయవచ్చు. బ్యాటరీ అవుట్‌పుట్ రేసుకు 200 kW వరకు, క్వాలిఫయింగ్‌కు 250 kW వరకు ఉండవచ్చు.
View this post on Instagram