అన్వేషించండి

Virat Kohli: గ్రౌండ్‌లో విరాట్ ‘నాటు నాటు’ - డ్యాన్స్ వేసిన వీడియో చూశారా?

ఆస్ట్రేలియాతో జరుగుతున్న మొదటి మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ ‘నాటు నాటు’ స్టెప్ వేశాడు.

విరాట్ కోహ్లీకి డ్యాన్స్ అంటే ఎంత ఇష్టమో అందరికీ తెలిసిందే. అంతర్జాతీయ మ్యాచ్‌లతో పాటు ఐపీఎల్‌లో కూడా విరాట్ కోహ్లీ డ్యాన్స్ చేయడం చూసి ఉంటారు. ప్రస్తుతం ఆస్ట్రేలియాతో జరుగుతున్న మొదటి వన్డేలో విరాట్ కోహ్లీ నాటు నాటు స్టెప్ వేస్తూ కెమెరాకు చిక్కాడు. ఫస్ట్ స్లిప్‌లో ఫీల్డింగ్ వేస్తున్న సమయంలో కోహ్లీ ఈ స్టెప్ వేశాడు.

ఇక మ్యాచ్ విషయానికి వస్తే... మొదట బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా 35.4 ఓవర్లలో 188 పరుగులకు ఆలౌట్ అయింది. ఆస్ట్రేలియా బ్యాటర్లలో మిషెల్ మార్ష్ (81: 65 బంతుల్లో, 10 ఫోర్లు, ఐదు సిక్సర్లు) ఒక్కడే ఒంటరి పోరాటం చేశాడు. భారత బౌలర్లలో మహ్మద్ షమీ, మహ్మద్ సిరాజ్ మూడేసి వికెట్లు తీసుకున్నారు. రవీంద్ర జడేజా రెండు వికెట్లు పడగొట్టాడు. హార్దిక్ పాండ్యా, కుల్దీప్ యాదవ్ చెరో వికెట్ తీసుకున్నారు.

మొదట బ్యాటింగ్‌కు దిగిన ఆసీస్‌కు మంచి ఆరంభం లభించలేదు. రెండో ఓవర్లోనే ఓపెనర్‌ ట్రావిస్‌ హెడ్‌‌ను (5: 10 బంతుల్లో, ఒక ఫోర్) మహ్మద్‌ సిరాజ్‌ బౌల్డ్‌ చేశాడు. మంచి లెంత్‌లో పడిన బంతిని మిడిల్‌ చేసేందుకు ట్రావిస్ హెడ్‌ ప్రయత్నించాడు. అయితే బ్యాటు లోపలి అంచుకు తగిలిన బంతి నేరుగా వికెట్లను లేపేసింది.

మరో ఓపెనర్‌ మిచెల్‌ మార్ష్‌ (81: 65 బంతుల్లో, 10 ఫోర్లు, ఐదు సిక్సర్లు) మాత్రం సూపర్‌ ఇన్నింగ్స్‌ ఆడేశాడు. కాస్త నిలదొక్కుకున్నాక చక్కని షాట్లు బాదేశాడు. బౌండరీలు, సిక్సర్లతో మోత మోగించాడు. అతడికి కెప్టెన్ స్టీవ్‌ స్మిత్‌ (22; 30 బంతుల్లో, నాలుగు ఫోర్లు) అండగా నిలిచాడు. వీరిద్దరూ రెండో వికెట్‌కు కేవలం 63 బంతుల్లో 72 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు.

ప్రమాదకరంగా మారిన ఈ జోడీని స్మిత్‌ను ఔట్‌ చేయడం ద్వారా రవీంద్ర జడేజా విడదీశాడు. ఆ తర్వాత మార్నస్ లబుషేన్‌ (15: 22 బంతుల్లో, ఒక ఫోర్) అండతో మార్ష్‌ రెచ్చిపోయాడు. 51 బంతుల్లో హాఫ్‌ సెంచరీ అందుకున్నాడు. ఆపై ఎడాపెడా బాదేసి స్కోరు వేగం పెంచాడు. దాంతో 16.4 ఓవర్లకు ఆసీస్‌ 100 పరుగుల మైలురాయి అధిగమించింది.

జట్టు స్కోరు 139 వద్ద మార్నస్ లబుషేన్‌ను కుల్‌దీప్‌ యాదవ్‌ బుట్టలో పడేశాడు. చక్కని లెంగ్తులో వచ్చిన బంతిని డ్రైవ్‌ చేసేందుకు ప్రయత్నించిన మార్షన్ లబుషేన్‌ కుదరకపోవడంతో గాల్లోకి ఆడేశాడు. దానికి రవీంద్ర జడేజా డైవ్‌ చేసి ఒడిసిపట్టాడు. మరో 10 పరుగులకే మార్ష్‌ను జడేజా అవుట్‌ చేశాడు. సిక్సర్‌ బాదే క్రమంలో బ్యాటు అంచుకు తగిలిన బంతి థర్డ్‌మ్యాన్‌ వైపు లేచింది. దానిని మహ్మద్ సిరాజ్‌ పట్టేశాడు. దీంతో ఆస్ట్రేలియా 139 పరుగులకు నాలుగు వికెట్లు కోల్పోయింది.

అయితే ఆ తర్వాత వచ్చిన జాన్ ఇంగ్లిస్, కామెరాన్ గ్రీన్ కాసేపు బాధ్యతగా ఆడారు. వీరిద్దరూ ఐదో వికెట్‌కు 30 పరుగులు జోడించారు. అయితే వీరు అవుటయ్యాక ఆస్ట్రేలియా ఒక్కసారిగా కుప్పకూలింది. ఒక దశలో 169 పరుగులకు నాలుగు వికెట్లతో కనిపించిన ఆస్ట్రేలియా కేవలం 19 పరుగుల వ్యవధిలోనే ఆరు వికెట్లు కోల్పోయింది. మహ్మద్ షమీ, సిరాజ్ ఆస్ట్రేలియా లోయర్ ఆర్డర్ వెన్ను విరిచారు. దీంతో ఆస్ట్రేలియా 35.4 ఓవర్లలో 188 పరుగులకు ఆలౌట్ అయింది.

టాప్ హెడ్ లైన్స్

India Dominates Galle Test:  విజ‌యంపై క‌న్నేసిన భార‌త్, లంక ముందు 372 రన్స్ భారీ టార్గెట్.. ఛేజింగ్‌లో తేలిపోయిన ప్రత్యర్థి
విజ‌యంపై క‌న్నేసిన భార‌త్, లంక ముందు 372 రన్స్ భారీ టార్గెట్.. ఛేజింగ్‌లో తేలిపోయిన ప్రత్యర్థి
National Sports Awards: గాయ‌త్రీ , శ్రీకాంత్ లకు అర్జున అవార్డు.. మొత్తం 17 మందికి ఈ పురస్కారాలు, ఈసారి ఎవరికీ దక్కని ఖేల్ రత్న అవార్డు..  
గాయ‌త్రీ , శ్రీకాంత్ లకు అర్జున అవార్డు.. మొత్తం 17 మందికి ఈ పురస్కారాలు, ఈసారి ఎవరికీ దక్కని ఖేల్ రత్న అవార్డు..  
Siraj Wierd Throw Towords Umpire: అంపైర్ వైపు దూసుకొచ్చిన సిరాజ్ రాకెట్ త్రో.. జడేజా ఫన్నీ రియాక్షన్ తో గాలే టెస్టులో నవ్వులు.. ఆన్ ఎయిర్ లో తిట్టుకున్న కామేంటేటర్లు..!
అంపైర్ వైపు దూసుకొచ్చిన సిరాజ్ రాకెట్ త్రో.. జడేజా ఫన్నీ రియాక్షన్ తో గాలే టెస్టులో నవ్వులు.. ఆన్ ఎయిర్ లో తిట్టుకున్న కామేంటేటర్లు..!
Pujara Bold Strategy: టీమిండియా గెలవాలంటే సాహసోపేత డిక్లరేషన్ ఇవ్వాల్సిందే.. గాలే టెస్ట్ లో నెగ్గాలంటే ఏం చేయాలో చెప్పిన మాజీ క్రికెట‌ర్!
టీమిండియా గెలవాలంటే సాహసోపేత డిక్లరేషన్ ఇవ్వాల్సిందే.. గాలే టెస్ట్ లో నెగ్గాలంటే ఏం చేయాలో చెప్పిన మాజీ క్రికెట‌ర్!

వీడియోలు

India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్
Sunil Gavaskar Questions Players Fitness | టీమిండియా ఫిట్‌నెస్‌పై గవాస్కర్ షాకింగ్ కామెంట్స్
Bigg Boss Agnipariksha Uppal Balu | అగ్నిపరీక్షపై ఉప్పల్ బాలు సంచలన వ్యాఖ్యలు
Jadeja Comments On His Batting Position | బ్యాటింగ్ స్థానాలపై జడేజా తీవ్ర అసంతృప్తి
Anupama Parameswaran about Her Best Friend | అనుపమ పరమేశ్వరన్ షాకింగ్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
National Sports Awards: గాయ‌త్రీ , శ్రీకాంత్ లకు అర్జున అవార్డు.. మొత్తం 17 మందికి ఈ పురస్కారాలు, ఈసారి ఎవరికీ దక్కని ఖేల్ రత్న అవార్డు..  
గాయ‌త్రీ , శ్రీకాంత్ లకు అర్జున అవార్డు.. మొత్తం 17 మందికి ఈ పురస్కారాలు, ఈసారి ఎవరికీ దక్కని ఖేల్ రత్న అవార్డు..  
Telangana 22A Lands Issue: తెలంగాణలో 22ఏ భూప్రకంపనలు! పొంగులేటిని టార్గెట్ చేస్తున్న విపక్షాలు!
తెలంగాణలో 22ఏ భూప్రకంపనలు! పొంగులేటిని టార్గెట్ చేస్తున్న విపక్షాలు!
Peddi Sudarshan Reddy Wife Crying: నర్సంపేటలో అర్ధరాత్రి హైడ్రామా! మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి విగ్రహం తొలగింపు! కంటతడి పెట్టిన భార్య!
నర్సంపేటలో అర్ధరాత్రి హైడ్రామా! మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి విగ్రహం తొలగింపు! కంటతడి పెట్టిన భార్య!
KBR Park Traffic Rules:కేబీఆర్ పార్క్ చుట్టుపక్కల ఉండే వారికి బిగ్ అలర్ట్! బస్టాప్‌ల మార్పుపై పోలీసుల కీలక ప్రకటన!
కేబీఆర్ పార్క్ చుట్టుపక్కల ఉండే వారికి బిగ్ అలర్ట్! బస్టాప్‌ల మార్పుపై పోలీసుల కీలక ప్రకటన!
Konaseema Fishermen Missing:కోనసీమ మత్స్యకారుల గల్లంతుపై సీఎం, డిప్యూటీ సీఎం ఆరా! గాలింపు చర్యలు ముమ్మరం!
కోనసీమ మత్స్యకారుల గల్లంతుపై సీఎం, డిప్యూటీ సీఎం ఆరా! గాలింపు చర్యలు ముమ్మరం!
Vijay Son Jason Sanjay: గాంధీ జయంతికి విజయ్ తనయుడి సినిమా... సందీప్ కిషన్ 'సిగ్మా' లేటెస్ట్ రిలీజ్ డేట్ ఇదుగో
గాంధీ జయంతికి విజయ్ తనయుడి సినిమా... సందీప్ కిషన్ 'సిగ్మా' లేటెస్ట్ రిలీజ్ డేట్ ఇదుగో
Kids Brushing Tips : పిల్లలు పళ్లు తోముకునేటప్పుడు తల్లిదండ్రులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు.. డెంటిస్ట్​ల సూచనలివే
పిల్లలు పళ్లు తోముకునేటప్పుడు తల్లిదండ్రులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు.. డెంటిస్ట్​ల సూచనలివే
Irumudi Censor Review: 'ఇరుముడి' సెన్సార్ రివ్యూ... రవితేజ సినిమా రిపోర్ట్ ఎలా ఉందంటే?
'ఇరుముడి' సెన్సార్ రివ్యూ... రవితేజ సినిమా రిపోర్ట్ ఎలా ఉందంటే?
Embed widget