అన్వేషించండి

Vinesh Phogat: ఓవైపు ఘన స్వాగతాలు, మరోవైపు విమర్శలు, వినేశ్ ఫొగాట్ భర్త సంచలన ఆరోపణలు

VINESH HUSBAND : భారత రెజ్లింగ్‌ సంఘంపై స్టార్ రెజ్లర్ వినేశ్‌ ఫొగాట్ భర్త సోమ్‌వీర్‌ రాథీ తీవ్ర ఆరోపణలు చేశారు. అయితే వినేశ్‌ ఫొగాట్‌ రిటైర్‌మెంట్‌ ప్రకటనపై మాత్రం స్పందించలేదు.

Vinesh's Husband On WFI After Wrestler's Shocking Retirement:  ఇటీవల ముగిసిన పారిస్ ఒలింపిక్స్‌లో మహిళల 50 కేజీల రెజ్లింగ్‌లో భారత స్టార్‌ రెజ్లర్‌ వినేశ్‌ ఫొగాట్‌ (Vinesh Phogat) ఫైనల్‌కు చేరి పతకం ఖరారు చేసుకున్నా నిరాశే ఎదురైంది. అయితే ఆ తర్వాత 100 గ్రాముల అధిక బరువు ఎక్కువగా ఉందన్న కారణంతో ఆమెపై ఒలింపిక్స్‌ నిర్వహక కమిటీ నిషేధం విధించింది. ఆ తర్వాత వినేశ్‌ కోర్ట్ ఆఫ్ ఆర్బిటరేషన్ ఆఫ్ స్పోర్ట్స్ ( CAS) ను ఆశ్రయించినా అక్కడా ఆమెకు సానుకూల నిర్ణయం రాలేదు. వినేశ్‌ తరపు లాయర్లు సమర్థంగా వాదనలు వినిపించినా... సానుకూల తీర్పైతే రాలేదు. దీంతో రిక్త హస్తాలతోనే వినేశ్‌... స్వదేశానికి తిరిగి వచ్చింది. పతకం తేకపోయినా " నువ్వే మా ఛాంపియన్‌"  అంటూ వినేశ్‌కు భారతావని అఖండ స్వాగతం పలికింది. ఈ ఘన స్వాగతంతో వినేశ్‌ కూడా భావోద్వేగానికి గురైంది. ఇక్కడివరకూ అంతా బాగానే ఉన్న ఇప్పుడు తాజాగా వినేశ్‌ భర్త చేసిన వ్యాఖ్యలు కొత్త వివాదానికి దారి తీశాయి.  అసలు వినేశ్‌కు భారత రెజ్లింగ్‌ సంఘం ఎలాంటి మద్దతు ఇవ్వలేదన్న వినేశ్‌ ఫొగాట్‌ భర్త సోమ్‌వీర్‌ రాథీ(Somvir Rathee) చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు తీవ్ర సంచలనం రేపుతున్నాయి. రెజ్లింగ్‌ సమాఖ్య మద్దతు ఇవ్వకపోతే అసలు అథ్లెట్లు ఎలా అత్యుత్తమ ప్రదర్శన చేస్తారని ప్రశ్నించారు. 
 
సంచలన ఆరోపణలు
పారిస్‌ వేదికగా జరిగిన విశ్వ క్రీడల్లో భారత స్టార్‌ రెజ్లర్‌ వినేశ్‌ ఫొగాట్‌కు భారత రెజ్లింగ్ సమాఖ్య నుంచి ఎలాంటి మద్దతు లభించలేదని వినేశ్‌ వినేశ్‌ ఫొగాట్ భర్త సోమ్‌వీర్‌ రాథీ సంచలన ఆరోపణలు చేశారు. మహిళల 50 కేజీల రెజ్లింగ్‌లో ఛాంపియన్‌ను ఓడించి ఫైనల్‌కు చేరిన వినేశ్‌కు WFI నుంచి ఎలాంటి మద్దతు లభించలేదని సోమ్‌వీర్‌ తెలిపారు. ఫైనల్లో అనర్హత వేటుకు గురైన ఫొగాట్‌ తీవ్ర నిర్వేదంలో కూరుకుపోయిందని అన్నారు. 
 
వినేశ్‌ ఫొగాట్‌ రిటైర్‌మెంట్‌ ప్రకటనపైనా సోమ్‌వీర్‌ కీలక వ్యాఖ్యలు చేశారు. వినేశ్‌ ఫొగాట్‌ రిటైర్‌మెంట్‌ ప్రకటనను వెనక్కి తీసుకుంటుందా అన్న ప్రశ్నకు సోమ్‌వీర్‌ ఎలాంటి సమాధానం చెప్పలేదు. పారిస్‌ నుంచి ఢిల్లీ విమానాశ్రయంలో అడుగుపెట్టిన వినేశ్‌కు అభిమానులు ఘన స్వాగతం పలికారు. అశేష జనవాహని ఎయిర్‌పోర్ట్‌కు తరలివచ్చి ఫొగాట్‌కు బ్రహ్మరథం పట్టారు. వినేశ్‌కు లభించిన ఘన స్వాగతంపై సోమ్‌వీర్‌ భావోద్వేగానికి గురయ్యాడు. అసలు తాము ఇంతటి ఘన స్వాగతాన్ని ఊహించలేదని.. ఏం మాట్లాడాలో అర్థం కావడం లేదని వినేశ్‌ భర్త తెలిపారు. వినేశ్‌ ఫొగాట్‌కు భారత రెజ్లర్లూ అందరూ మద్దతుగా నిలిచారని... వారికి కృతజ్ఞతలని వెల్లడించారు. భారత్‌కు మరో మెడలో వెంట్రుకవాసిలో చేజారిందని సోమ్‌వీర్‌ తెలిపారు. భారత రెజ్లింగ్ సమాఖ్య మద్దతు లేకపోతే రెజ్లర్లు నిర్భయంగా ఎలా ప్రదర్శన చేయగలరని సోమ్‌వీర్‌ ప్రశ్నించారు. 
 
అయితే వినేశ్‌ రిటైర్‌మెంట్‌పై ఆమె సోదరుడు హర్విందర్ ఫొగాట్ స్పందించారు. వినేశ్‌ రిటైర్‌మెంట్‌ను వెనక్కి తీసుకొనేలా ప్రయత్నిస్తామని హర్విందర్‌ తెలిపారు. రిటైర్‌మెంట్‌పై తప్పకుండా వినేశ్‌తో  మాట్లాడతామని తెలిపారు.

టాప్ హెడ్ లైన్స్

Gambhir Special Mantra: మ్యాచ్ కు ముందు గంభీర్ చెప్పిన మాటతో రగిలిపోయిన తిలక్ వర్మ.. కివీస్ పై సంచలన ఇన్నింగ్స్ వెనుక అసలు సీక్రెట్ ఇదే
మ్యాచ్ కు ముందు గంభీర్ చెప్పిన మాటతో రగిలిపోయిన తిలక్ వర్మ.. కివీస్ పై సంచలన ఇన్నింగ్స్ వెనుక అసలు సీక్రెట్ ఇదే
Arshdeep, Tilak Historic Record: భువీ ఆల్ టైమ్ రికార్డును బద్దలు కొట్టిన అర్ష్‌దీప్.. బ్యాట్ తోనే కాకుండా ఫీల్డ‌ర్ గా కూడా స‌త్తా చాటిన తిల‌క్ వ‌ర్మ‌
భువీ ఆల్ టైమ్ రికార్డును బద్దలు కొట్టిన అర్ష్‌దీప్.. బ్యాట్ తోనే కాకుండా ఫీల్డ‌ర్ గా కూడా స‌త్తా చాటిన తిల‌క్ వ‌ర్మ‌
Telugu Duo Tilak ,Nitish Brilliance: ఓటమి కోరల్లోంచి టీమిండియాను గెలిపించిన‌ తెలుగు కుర్రాళ్ళు.. కివీస్ గడ్డపై తిలక్ , నితీష్  మెరుపు ఛేజింగ్
ఓటమి కోరల్లోంచి టీమిండియాను గెలిపించిన‌ తెలుగు కుర్రాళ్ళు.. కివీస్ గడ్డపై తిలక్ , నితీష్  మెరుపు ఛేజింగ్
Bhuvi Expensive Return: నాలుగేళ్ల తర్వాత రీఎంట్రీలో దిమ్మతిరిగే షాక్.. భువీ చెత్త బౌలింగ్ పై దినేష్ కార్తీక్ ఆందోళన, నోబాల్స్ తో వెటరన్ పేసర్ కు సవాల్
నాలుగేళ్ల తర్వాత రీఎంట్రీలో దిమ్మతిరిగే షాక్.. భువీ చెత్త బౌలింగ్ పై దినేష్ కార్తీక్ ఆందోళన, నోబాల్స్ తో వెటరన్ పేసర్ కు సవాల్

వీడియోలు

IND vs NZ 2nd T20 Match Preview | స్టార్ బ్యాటర్‌కు గాయం, తుది జట్టులో కీలక మార్పులు!
Amit Mishra about Virat | కోహ్లీ నన్ను మోసం చేశారు.. అమిత్ మిశ్రా సంచలన వ్యాఖ్యలు
World's First Mixed-Gender Cricket Tournament | ఒకే క్రికెట్ మ్యాచ్‌లో అమ్మాయిలు, అబ్బాయిలు
Harbhajan Singh Comments On Greg Chappell | గ్రేగ్ చాపెల్‌పై భజ్జీ తీవ్ర ఆరోపణలు
Arshdeep Singh Football-Style Run Out vs NZ | అర్ష్‌దీప్ సింగ్ కళ్లు చెదిరే రనౌట్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Andhra Pradesh Weather Update: తీవ్ర వాయుగుండంగా మారుతున్న అల్పపీడనం.. 12 జిల్లాలపై అర్ణాబ్ తుపాను తీవ్ర ప్రభావం
తీవ్ర వాయుగుండంగా మారుతున్న అల్పపీడనం.. 12 జిల్లాలపై అర్ణాబ్ తుపాను తీవ్ర ప్రభావం
BRS Leaders Kannepalli Visit: కన్నెపల్లి మోటార్లు వెంటనే ఆన్ చేయాలి.. లేకపోతే సీఎం ఇంటిని ముట్టడిస్తాం- బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు
కన్నెపల్లి మోటార్లు వెంటనే ఆన్ చేయాలి.. లేకపోతే సీఎం ఇంటిని ముట్టడిస్తాం- బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు
CBI Investigation Saikrishna Case: సాయికృష్ణ లాకప్ డెత్ కేసులో సీబీఐ దూకుడు.. ఆర్ఎంపీతో చికిత్స, లాకప్‌లో పెయింటింగ్‌పై ఆరా!
సాయికృష్ణ లాకప్ డెత్ కేసులో సీబీఐ దూకుడు.. ఆర్ఎంపీతో చికిత్స, లాకప్‌లో పెయింటింగ్‌పై ఆరా!
SEC Serious On Vidadala Raniji Incident: చిలకలూరిపేట ఘటనపై ఎస్‌ఈసీ సీరియస్.. ఎస్‌ఐ ప్రియాంకపై సస్పెన్షన్ వేటు.. విచారణకు ఆదేశం!
చిలకలూరిపేట ఘటనపై ఎస్‌ఈసీ సీరియస్.. ఎస్‌ఐ ప్రియాంకపై సస్పెన్షన్ వేటు.. విచారణకు ఆదేశం!
Two Wheeler Technology: ఇప్పుడు టూవీలర్లలోనూ లగ్జరీ కార్లకు పోటీగా స్మార్ట్‌ ఫీచర్లు.. ఇలాంటివి ఉన్నట్లు మీకు తెలుసా?
కార్లలోనే కాదు.. టూవీలర్లలోనూ అదిరిపోయే స్మార్ట్ ఫీచర్లు! మీ బండిలో ఇవి ఉన్నాయా?
Crime Thriller OTT : నగరంలో వరుస హత్యలు... శవాలను చంపే సైకో కిల్లర్ - ఓటీటీలోకి ఆది సాయి కుమార్ క్రైమ్ థ్రిల్లర్
నగరంలో వరుస హత్యలు... శవాలను చంపే సైకో కిల్లర్ - ఓటీటీలోకి ఆది సాయి కుమార్ క్రైమ్ థ్రిల్లర్
November Weather 2026: నవంబర్ 2026 వాతావరణం! భారీ వర్షాలు, తీవ్ర చలి.. కీలక తేదీలు ఇవే!
నవంబర్ 2026 వాతావరణం: భారీ వర్షాలు, తీవ్ర చలి.. కీలక తేదీలు ఇవే!
Gambhir Special Mantra: మ్యాచ్ కు ముందు గంభీర్ చెప్పిన మాటతో రగిలిపోయిన తిలక్ వర్మ.. కివీస్ పై సంచలన ఇన్నింగ్స్ వెనుక అసలు సీక్రెట్ ఇదే
మ్యాచ్ కు ముందు గంభీర్ చెప్పిన మాటతో రగిలిపోయిన తిలక్ వర్మ.. కివీస్ పై సంచలన ఇన్నింగ్స్ వెనుక అసలు సీక్రెట్ ఇదే
Embed widget