Watch Video: 6 బంతుల్లో... 6 సిక్స్‌లు... అమెరికా క్రికెటర్ జస్కరన్ మల్హోత్రా... అంతర్జాతీయ వన్డే క్రికెట్లో రెండోవాడు
అమెరికాకు చెందిన జస్కరన్ మల్హోత్రా అంతర్జాతీయ వన్డే క్రికెట్లో ఆరు బంతుల్లో ఆరు సిక్సర్లు బాదాడు.
సాధారణంగా మనకి 6 బంతుల్లో 6 సిక్సర్లు అంటే ఎవరు గుర్తొస్తారు? తప్పనిసరిగా యువరాజ్ సింగ్. ఔను కదా. అయితే యువీ అంతర్జాతీయ టీ20 క్రికెట్లో 6 బంతుల్లో 6 సిక్సర్లు బాదాడు. ఇప్పుడు ఇదంతా ఎందుకు అనే కదా మీ సందేహం.
ఎందుకంటే... తాజాగా అమెరికాకు చెందిన జస్కరన్ మల్హోత్రా అంతర్జాతీయ వన్డే క్రికెట్లో ఆరు బంతుల్లో ఆరు సిక్సర్లు బాదాడు. దీంతో అంతర్జాతీయ క్రికెట్లో ఈ ఘనత సాధించిన రెండో ఆటగాడిగా నిలిచాడు. పపువా న్యూ గినియాతో జరిగిన రెండో వన్డేలో పేసర్ గాడీ టోకా వేసిన 50వ ఓవర్లో జస్కరన్ వరుసగా 6, 6, 6, 6, 6, 6 బాదాడు. చండీగఢ్‌లో పుట్టి వలస వెళ్లిన జస్కరన్ అమెరికాకు ప్రాతినిథ్యం వహిస్తున్నాడు.
6️⃣ x 6️⃣ from the legendary USA cricketer, Jaskaran Malhotra! 🔥🏏 pic.twitter.com/JsuqzoHv7B
— Willow TV (@willowtv) September 9, 2021
ఈ ఇన్నింగ్స్‌లో 124 బంతుల్లో 4 ఫోర్లు, 16 సిక్సర్లతో 173 పరుగులతో అజేయంగా నిలిచిన జస్కరన్ అంతర్జాతీయ వన్డేల్లో అత్యధిక సిక్సర్లు బాదిన ఆటగాడిగా మోర్గాన్ (17) తర్వాతి స్థానంలో నిలిచాడు. అంతేకాదు అమెరికా తరఫున తొలి సెంచరీ బాదిన బ్యాట్స్‌మన్‌గానూ జస్‌కరణ్ రికార్డులకెక్కాడు. ఈ మ్యాచ్‌లో అమెరికా 134 పరుగుల తేడాతో గెలిచింది. అమెరికా 50 ఓవర్లలో 271/9 స్కోరు చేయగా... పపువా జట్టు 137కే ఆలౌటైంది. జట్టు విజయంలో కీలకపాత్ర పోషించిన జస్కరన్ మల్హోత్రా మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు దక్కించుకున్నాడు.
🏏 173* runs off 124 balls
— ICC (@ICC) September 9, 2021
💥 4 fours and 16 sixes
🔥 Six sixes in one over
🚨 First man to score an ODI century for USA
A busy day at the office for Jaskaran Malhotra. #USAvPNG | 📸 @usacricket pic.twitter.com/VyVnxX40Xi
2007 వన్డే వరల్డ్ కప్ మ్యాచ్‌లో డాన్ వాన్ బంగ్ ఓవర్లో దక్షిణాఫ్రికా ఆటగాడు హెర్షల్ గిబ్స్ 6 సిక్సర్లు కొట్టాడు. అంతర్జాతీయ టి20ల్లో యువరాజ్ సింగ్, కీరన్ పొలార్డ్ ఈ అరుదైన ఫీట్‌ను సాధించారు.