UEFA Champions League: గ్రూప్ స్టేజ్ డ్రా వచ్చేసింది! బేయార్న్‌తో బార్సిలోనా, మ్యాన్ సిటీతో డార్ట్‌మండ్ ఢీ!
UEFA Champions League: ఫుట్‌బాల్ ప్రేమికులకు గుడ్‌న్యూస్! ప్రతిష్ఠాత్మక యూఈఎఫ్‌ఏ ఛాంపియన్స్ లీగ్ గ్రూప్ స్టేజ్ డ్రా వచ్చేసింది. ఈ మ్యాచులకు టర్కీ రాజధాని ఇస్తాంబుల్ ఆతిథ్యం ఇవ్వనుంది.
UEFA Champions League: ఫుట్‌బాల్ ప్రేమికులకు గుడ్‌న్యూస్! ప్రతిష్ఠాత్మక యూఈఎఫ్‌ఏ ఛాంపియన్స్ లీగ్ గ్రూప్ స్టేజ్ డ్రా వచ్చేసింది. టర్కీ రాజధాని ఇస్తాంబుల్‌లో డ్రా తీశారు. కాగా బేయార్న్ మ్యూనిచ్, బార్సిలోనా జట్లు గ్రూపు-సిలో ఉన్నాయి. చెక్ ఛాంపియన్స్ విక్టోరియా ప్లెజ్, ఇంటర్ మిలన్ సైతం ఇదే గ్రూపులో ఉండటం ప్రత్యేకం. ఇక ఎర్లింగ్ హాలాండ్ తన మాజీ జట్టు మాంచెస్టర్ సిటీతో తలపడనున్నాడు. ఎందుకంటే అతడు ప్రాతినిధ్యం వహిస్తున్న బొరష్యా డార్ట్‌మండ్ గ్రూప్-జిలో ఉన్నాయి.
2020లో లిస్బన్ వేదికగా జరిగిన క్వార్టర్ ఫైనల్లో బార్సిలోనాను 8-2 తేడాతో బేయార్న్ ఓడించిన సంగతి తెలిసిందే. గత సీజన్లో జర్మన్స్ చేతిలో రెండుసార్లు 3-0తో ఓడిపోయిన కాటలాన్స్ గ్రూప్ స్టేజీలోనే ఇంటికెళ్లిపోయింది. కాగా 50 మిలియన్ యూరోల ఫీజుతో లెవాండోస్కీ బార్సీలోనాకు వెళ్లిపోయాడు. అంతకు ముందు బేయార్న్ తరఫున ఎనిమిదేళ్లలో అతడు 344 గోల్స్ కొట్టడం ప్రత్యేకం.
'కేవలం ఫుట్‌బాల్‌లోనే ఇలాంటివి చోటు చేసుకుంటాయి. బార్సీలోనా మరింత పటిష్ఠంగా మారింది. ఇప్పుడక్కడ లెవాండోస్కీ ఉన్నాడు. మరో ఇద్దరు ముగ్గురు మంచి ఆటగాళ్లు దొరికితే మ్యాచులు మరింత ఆసక్తికరంగా మారతాయి' అని బేయార్న్ డైరెక్టర్ హసన్ సలిహమిజ్ అన్నాడు.
ప్రీమియర్ లీగ్ ఛాంపియన్స్ సిటీ కోసం హాలాండ్ డార్ట్‌మండ్‌ను వదిలేశాడు. ఇప్పుడు గ్రూప్-జిలో వారు సెవిల్లా, డానిష్ ఛాంపియన్స్ ఎఫ్‌సీ కోపెన్‌హాగన్‌తో తలపడాల్సి వస్తోంది. 2021 క్వార్టర్ ఫైనల్లో సిటీ, డార్ట్‌మండ్ తలపడ్డాయి. అప్పుడు పెప్ గార్డియోలా ప్రాతినిథ్యం వహించిన జట్టే 4-2 తేడాతో గెలిచింది. 2015/16 సీజన్లో గ్రూప్ స్టేజ్‌లో సెవిల్లాను ఓడించిన అనుభవం సిటీకి ఉంది.
గతేడాది ఫైనల్లో ఓడిపోయిన లివర్ పూల్ ఈ సారి గ్రూప్-ఏలో ఉంది. అజాక్స్, నెపోలి, రేంజర్స్‌తో తలపడనుంది. ఛాంపియన్స్ అయిన రియల్ మాడ్రిడ్ గ్రూప్-ఎఫ్‌లో సెల్టిక్, ఆర్బీ లీప్‌జిగ్, షాక్టర్ డన్‌టెస్క్‌తో తలపడనుంది. రియల్ మాడ్రిడ్, షాక్టర్ ఒకే గ్రూపులో ఉండటం వరుసగా ఇది మూడోసారి. ఉక్రెయిన్‌లో యుద్ధం కారణంగా షాక్టర్ తన హోమ్ గేమ్స్‌ను పొలాండ్ రాజధాని వార్సాలో ఆడనుంది.
రేంజర్స్ 12 ఏళ్లలో తొలిసారిగా యూఈఎఫ్ఏ ఛాంపియన్స్ లీగ్ గ్రూప్ స్టేజ్‌కు అర్హత సాధించడం గమనార్హం. 2010-11 సీజన్లో వారు మాంచెస్టర్ యునైటెడ్‌తో మ్యాచును 0-0తో డ్రా చేసుకున్న సంగతి తెలిసిందే. ఆ తర్వాత అప్పుల పాలవ్వడంతో ఆ జట్టును స్కాటిష్ ఫోర్త్ టైర్‌కు డీమోట్ చేశారు. ప్యారిస్ సెయింట్ జర్మన్ మరోసారి ఫేవరెట్‌గా బరిలోకి దిగుతోంది. గ్రూప్-హెచ్‌లో జువెంటాస్, బెన్‌ఫికా, మకాబీ హైఫాతో తలపడనున్నారు. 2021 విజేత చెల్సీ గ్రూప్-ఈలో ఏసీ మిలన్, రెడ్ బుల్ సల్జాబర్గ్, డినామో జగ్‌రెబ్‌తో పోటీ పడనుంది. గ్రూప్-డిలో టాటోన్‌హామ్, ఫ్రాంక్‌ఫర్ట్, స్పోర్టింగ్ లిస్బన్, మార్‌షెల్లీ ఉన్నాయి. పోర్టో, అట్లెటికో మాడ్రిడ్ గ్రూప్‌లో ఉన్నాయి. తాజా సీజన్ గ్రూప్ దశ సెప్టెంబర్ 6న మొదలవుతుంది. వచ్చే ఏడాది జూన్ 10న ఇస్తాంబుల్‌లోని అటాటర్క్ ఒలింపిక్ స్టేడియంలో ఫైనల్ జరుగుతుంది.
Bring it on! 👊#UCL || #UCLdraw pic.twitter.com/z9IBs4zdUA
— UEFA Champions League (@ChampionsLeague) August 25, 2022
🇹🇷 What. A. Day.
— UEFA Champions League (@ChampionsLeague) August 25, 2022
Goodnight 👋 #UCLdraw | #UCL pic.twitter.com/jVaraYLh2W