T20 WC, India New Jersey: టీమ్‌ఇండియా కొత్త జెర్సీ చూసారా? అద్దిరిపోయింది..! అభిమానులను ప్రతిబింబించేలా డిజైన్
ఐసీసీ టీ20 ప్రపంచకప్ జెర్సీని బీసీసీఐ ఆవిష్కరించింది. కిట్ స్పాన్సర్ మొబైల్ ప్రీమియర్ లీగ్ సంస్థ దీనిని రూపొందించింది. ముదురు నేవీ బ్లూ రంగు జర్సీ మధ్యలో మధ్యలో లేత నీలిరంగు చారలు బాగున్నాయి.
ఐసీసీ టీ20 ప్రపంచకప్ జెర్సీని బీసీసీఐ ఆవిష్కరించింది. కిట్ స్పాన్సర్ మొబైల్ ప్రీమియర్ లీగ్ సంస్థ దీనిని రూపొందించింది. ముదురు నేవీ బ్లూ రంగు జర్సీ మధ్యలో మధ్యలో లేత నీలిరంగు ప్యాట్రెన్స్ ఆకట్టుకుంటున్నాయి. వందకోట్ల మంది అభిమానుల కేరింతలను ప్రతిబింబించేందుకు ప్యాట్రెన్స్ సృష్టించారు.
Presenting the Billion Cheers Jersey!
— BCCI (@BCCI) October 13, 2021
The patterns on the jersey are inspired by the billion cheers of the fans.
Get ready to #ShowYourGame @mpl_sport.
Buy your jersey now on https://t.co/u3GYA2wIg1#MPLSports #BillionCheersJersey pic.twitter.com/XWbZhgjBd2
'వంద కోట్ల మంది ఆనందించే జెర్సీని తీసుకొస్తున్నాం! కోట్లాది మంది అభిమానులకు ప్రతిబింబంగా జెర్సీ మధ్యలో ప్యాట్రెన్స్ రూపొందించాం. సరికొత్త జెర్సీని ఇప్పుడే కొనుగోలు చేయండి' అని బీసీసీఐ ట్వీట్ చేసింది. అక్టోబర్ 13న కొత్త జెర్సీని ఆవిష్కరిస్తామని మూడు రోజుల క్రితమే బీసీసీఐ ట్వీట్ చేసింది.
Also Read: విరాట్ కోహ్లీ కెప్టెన్సీపై ఆర్సీబీ ప్లేయర్ డివిలియర్స్ ఆసక్తికర వ్యాఖ్యలు
'మనందరం ఎదురు చూస్తున్న తరుణం ఇదే! అక్టోబర్ 13న మాతో జాయిన్ అవ్వండి. మీరంతా ఆసక్తిగా ఉన్నారా?' అంటూ బీసీసీఐ ట్వీట్ చేసింది. అక్టోబర్ 13న సరికొత్త జెర్సీని ఆవిష్కరిస్తున్నామని ఓ చిత్రాన్ని జత చేసింది. ఈ విషయం ప్రకటించగానే అభిమానులంతా రీ ట్వీట్లు చేయడం మొదలు పెట్టారు.
Also Read: ధోనీ ది గ్రేట్! పారితోషికం తీసుకోకుండానే మెంటార్‌గా సేవలు
ఐసీసీ వన్డే, టీ20 ప్రపంచకప్‌ల ముంగిట అన్ని దేశాలు కొత్త జెర్సీలను రూపొందించుకుంటాయి. టీమ్‌ఇండియా సైతం ఇందుకు మినహాయింపేమీ కాదు. 2016 టీ20 ప్రపంచకప్, 2019 వన్డే ప్రపంచకప్ ముందు కొత్త కిట్‌లతో కోహ్లీసేన బరిలోకి దిగింది. ఇంగ్లాండ్‌లో జరిగిన వన్డే ప్రపంచకప్ సమయంలో రూపొందించిన రెట్రో జెర్సీలు ఒకప్పటికి భారత జట్టును ప్రతిబింబించాయి.
Also Read: 15-20శాతం తగ్గిన ఐపీఎల్ రేటింగ్.. స్టార్ సతమతం.. ఆందోళనలో అడ్వర్టైజర్లు!
ప్రస్తుతం ఆవిష్కరించిన జెర్సీలో నేవీ బ్లూ, లేత నీలి రంగు, నారింజ రంగులను ఉపయోగించారు. జెర్సీ మధ్యలో ప్యాట్రెన్స్ ఇచ్చారు. ఎడమవైపు బీసీసీఐ లోగో, కుడివైపు స్పాన్సర్ ఎంపీఎల్ లోగో ఉన్నాయి. టీమ్‌ఇండియా సాధించిన మూడు ప్రపంచకప్‌లకు గుర్తుగా బీసీసీఐ లోగోపై మూడు నక్షత్రాలను పెట్టారు. కొత్త జెర్సీలో కేఎల్ రాహుల్, రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, రవీంద్ర జడేజా, జస్ప్రీత్ బుమ్రా మెరిసిపోయారు.
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి
The moment we've all been waiting for!
— BCCI (@BCCI) October 8, 2021
Join us for the big reveal on 13th October only on @mpl_sport. 🇮🇳
Are you excited? 🥳 pic.twitter.com/j4jqXHvnQU