IPL 2021 Broadcast Ratings: 15-20శాతం తగ్గిన ఐపీఎల్ రేటింగ్.. స్టార్ సతమతం.. ఆందోళనలో అడ్వర్టైజర్లు!
ఐపీఎల్ ప్లేఆఫ్స్, ఆఖరి మ్యాచులను అభిమానులు విపరీతంగా చూస్తుంటారు. ఈ సారి మాత్రం వ్యూస్, రేటింగులు పడిపోతున్నాయి. ప్రకటనదారులు పరిహారం కోసం డిమాండ్ చేస్తున్నారని తెలిసింది.
ఇండియన్ ప్రీమియర్ లీగ్ ఆఖరి అంకానికి చేరుకుంది. రెండో క్వాలిఫయర్, ఫైనల్ మాత్రమే మిగిలున్నాయి. సాధారణంగా ఐపీఎల్ ప్లేఆఫ్స్, ఆఖరి మ్యాచులను అభిమానులు విపరీతంగా చూస్తుంటారు. కోట్లాది వీక్షణలు లభిస్తాయి. ఈ సారి మాత్రం అందుకు భిన్నమైన వాతావరణం కనిపిస్తోంది. వ్యూస్, రేటింగులు పడిపోతున్నాయి. ముఖ్యంగా ప్రకటనదారులు పరిహారం కోసం డిమాండ్ చేస్తున్నారని తెలిసింది.
బార్క్ గణాంకాలను బట్టి చూస్తే ఐపీఎల్ రేటింగుల్లో 15-20 శాతం తగ్గుదల కనిపిస్తోందని ఎకనామిక్స్ టైమ్స్ నివేదించింది. యాదృచ్ఛికంగా మార్చి-ఏప్రిల్‌లో జరిగిన ఐపీఎల్ 2021 తొలి అంచె నుంచి రెండో అంచెకు రేటింగు హఠాత్తుగా పడిపోయింది. దాంతో పది సెకన్ల స్లాట్‌కు రూ.17.2 లక్షలు చెల్లించిన ప్రకటనదారులపై తీవ్ర ప్రభావం పడింది.
Also read: షాకింగ్ న్యూస్! పంజాబ్‌ను వదిలేయనున్న కేఎల్ రాహుల్.. ఆర్‌సీబీ కన్ను పడిందా?
ఈ ఐపీఎల్ ఆఖరి వారం యావరేజ్ మ్యాచ్ రేటింగ్ 2019 సీజన్ కన్నా తగ్గిపోయింది. ఇక ఐపీఎల్ యావరేట్ వీక్లీ రీచ్, టైమ్ స్పెండ్ పర్ వ్యూయర్ (TSV) 15 శాతానికి పైగా పడిపోయింది. గత వారం యావరేట్ రీచ్ పడిపోయింది. అంతకు ముందు వారం 82.4 మిలియన్లతో పోలిస్తే గత వారం 72.4 మిలియన్లేగా నమోదైంది. అదే తొలి అంచెలోని 29 మ్యాచులకు 104.8 మిలియన్ల రీచ్ వచ్చింది. చివరి వారం టీవీఆర్ 2.6కు పడిపోయింది.
Also read: జయమ్ము నిశ్చయంబురా! అని ఆడితే కేకేఆర్‌పై దిల్లీ గెలవొచ్చు.. లేదంటే!
'స్టార్ ఇండియా 2019లో సాధించిన దానికన్నా ఇప్పుడు టీవీఆర్ తక్కువగా ఉంది' అని ఓ సీనియర్ ఎగ్జిక్యూటివ్ అన్నారు. 'ఈ వారం రేటింగ్ 2.6 టీవీఆర్‌కు తగ్గిపోయింది. దాంతో మొత్తం యావరేజ్ 3.8 టీవీఆర్‌కు తగ్గింది. యావరేజ్ రీచ్, టీవీఆర్ రెండూ తగ్గాయి. మా క్లైంట్లు చాలామంది ఈ విషయం ప్రశ్నిస్తున్నారు. కొందరు మా ఇతర ఛానెళ్లలో పరిహారం కింద యాడ్ స్లాట్లు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు' అని ఆ ఎగ్జిక్యూటివ్ తెలిపారు.
Also read: అయ్యో ఆర్సీబీ.. ‘ఈ సాల’ కూడా కప్పు మిస్.. ఎలిమినేటర్‌లో కోల్‌కతా విజయం!
సాధారణంగా ఐపీఎల్ జరిగేటప్పుడు స్టార్‌స్పోర్ట్స్ హిందీ ఛానెల్ బార్క్ రేటింగుల్లో అగ్రస్థానం ఉంటుంది. ఈ సారి మాత్రం భిన్నంగా సన్‌నెట్‌వర్క్, స్టార్ ప్లస్ తర్వాత నిలిచింది. 2020, జూన్‌లో స్టార్‌స్పోర్ట్స్ హిందీ వన్ నంబర్‌వన్‌గా అవతరించింది. ముంబయి ఇండియన్స్, కేకేఆర్ మ్యాచుకు టాప్ రేటింగ్ లభించింది.
Also Read: అంపైర్‌పై కోహ్లీ ఆగ్రహం.. ఆపై నవ్వులు..! మీమ్స్‌తో రెచ్చిపోయిన అభిమానులు