By: ABP Desam | Updated at : 24 Oct 2021 12:13 PM (IST)
Edited By: Ramakrishna Paladi
కపిల్ దేవ్, విరాట్ కోహ్లీ
ఐసీసీ టీ20 ప్రపంచకప్‌లో పాకిస్థాన్‌తో మ్యాచుకు ముందు కపిల్‌దేవ్ టీమ్‌ఇండియాను హెచ్చరించాడు. ఒత్తిడిని జయించకపోతే పాకిస్థాన్ విజయం సాధించే అవకాశం ఉందని సూచించాడు. కోహ్లీసేన పేపర్‌పై పటిష్ఠంగానే కనిపిస్తున్నా మైదానంలోని పరిస్థితులే జయాపజయాలను నిర్ణయిస్తాయని వెల్లడించాడు. ఏబీపీ న్యూస్‌తో ఆయన ప్రత్యేకంగా మాట్లాడాడు.
ఆదివారం మైదానంలో ఏ జట్టు ఆధిపత్యం సాధిస్తుందని అడగ్గా.. 'మైదానంలో ఇవేవీ పనిచేయవు. రెండు జట్లు ఒత్తిడిలోనే ఉంటాయి. అందుకే ఒత్తిడిని ఎవరు జయిస్తారన్నది ఆసక్తికరం' అని కపిల్ అన్నాడు. 'పాకిస్థాన్ జట్టు గురించి నాకూ ఎక్కువేం తెలియదు. అయినప్పటికీ టీ20ల్లో వారు ప్రమాదకరమమని చెప్పగలను. తమదైన రోజున వారు ఎవర్నైనా ఓడించగలరు' అని ఆయన పేర్కొన్నాడు.
The world is watching.
Tonight in Dubai, India and Pakistan go toe-to-toe.#INDvPAK | #T20WorldCup pic.twitter.com/NnGtaRzv6d— T20 World Cup (@T20WorldCup) October 24, 2021
'పేపర్‌పై టీమ్‌ఇండియా బలంగా ఉంది. వారు లయ అందుకుంటారేమో చూడాలి. ఎందుకంటే వారు టోర్నీలో తొలి మ్యాచ్ ఆడబోతున్నారు' అని కపిల్ చెప్పాడు. పాక్ అనిశ్చితి గురించి గుర్తుచేయగా.. 'రెండు జట్లు ఒకరితో ఒకరు తలపడలేదు. అందుకే కచ్చితంగా అనిశ్చితి ఉంటుంది. భారత్ బలంగానే కనిపిస్తోంది. కానీ పాక్‌లో ఊహించని ఆటగాళ్లు ఉన్నారు. ఏదేమైనా భారత్ ఆందోళన చెందాల్సిన అవసరం లేదు' అని వెల్లడించాడు. ఒకవేళ ఒత్తిడిని తట్టుకోలేకపోతే మాత్రం టీమ్‌ఇండియాను పాక్ ఓడించగలదని అంచనా వేశాడు.
Also Read: T20 WC, BAN vs SL Preview: బంగ్లా పులులా? లంకేయులా? సూపర్ 12లో షాకిచ్చేదెవరు?
Also Read: ENG Vs WI, Match Highlights: వెస్టిండీస్‌పై ఇంగ్లండ్ విజయం.. ఆ రికార్డు బ్రేక్!
Also watch: T20 World Cup 2021: పదేళ్ల తర్వాత ప్రపంచకప్ గెలిచే సత్తా కోహ్లీసేనకు ఉందా? ధోనీ మెంటారింగ్‌తో లాభం ఏంటి?
Strap yourselves in!
— T20 World Cup (@T20WorldCup) October 24, 2021
Who takes out today's #T20WorldCup matches? pic.twitter.com/oAeDsk4fnN
India Tour of Zimbabwe, 2022: జింబాబ్వే సిరీస్‌కు టీమిండియా స్క్వాడ్ రెడీ - కెప్టెన్ ఎవరంటే?
గెలిచిన ప్రైజ్‌మనీ తిరిగి శ్రీలంకకే - ఆస్ట్రేలియా క్రికెట్ టీమ్ పెద్ద మనసు!
BCCI over IPL Team Owners: ఐపీఎల్ ఓనర్లకు భయపడుతున్న బీసీసీఐ! ఎందుకంటే?
Fact Check: బీసీసీఐ ఛైర్మన్ పదవికి గంగూలీ రాజీనామా! కొత్త ఛైర్మన్‌గా జే షా!! నిజమేనా?
Rishabh Pant on Urvashi Rautela: నన్ను వదిలెయ్ చెల్లెమ్మా! ఊర్వశి రౌటెలాపై పంత్ పంచ్‌లు!
TS ECET Results 2022: తెలంగాణ ఈసెట్ ఫలితాలు విడుదల, రిజల్ట్స్ ఇక్కడ చూసుకోండి!
Nizamabad: పెళ్లి చేయట్లేదని తండ్రి, బాబాయ్ హత్య - కర్రతో చావ బాదిన కొడుకు!
Actor Prithvi On Nude Video: వ్రతం ముందురోజే ఆ దరిద్రం చూశా, అక్కాచెల్లెళ్లు ఫోన్లు చూడొద్దు - నటుడు పృథ్వీ
Malik Review: మాలిక్ రివ్యూ: ఫహాద్ ఫాజిల్ గ్యాంగ్‌స్టర్ థ్రిల్లర్ ఆకట్టుకుంటుందా?