Sunil Chhetri: ఇది ఓ వీరుడి విజయం, సునీల్ ఛెత్రీ అరుదైన ఘనత
Sunil Chhetri Set For 150th International Cap: మంగళవారు అఫ్గానిస్థాన్‌తో జరిగే ప్రపంచకప్ క్వాలిఫయర్ ఛెత్రి కెరీర్‌లో 150వ అంతర్జాతీయ మ్యాచ్ ఆడనున్నాడు.
Sunil Chhetri to be felicitated by the AIFF on the occasion of his 150th appearance for India: ప్రపంచవ్యాప్తంగా ఫుట్‌బాల్(Foot Ball)కు ఉన్న క్రేజే వేరు. రొనాల్డో, మెస్సీ, ఎంబాపే వంటి దిగ్గజ ఆటగాళ్ల అద్భుత ప్రదర్శనకు లోకమంతా ఊగిపోతుంది. ఆర్జనలో, అభిమానంలో ఆటగాళ్ల స్థాయి ఆకాశమంత ఎత్తున ఉంటుంది. భారత్‌లో మాత్రం ఫుట్‌బాల్‌కు అంత ఆదరణ లేదు. అయినా మనకూ ఒక మెస్సీ ఉన్నాడు. తన ఆటతీరుతో భారత్‌లో ఫుట్‌బాల్ ఉనికిని కాపాడుతూ వస్తున్నాడు. తన ఆటతో భారత ఫుట్‌బాల్‌కు చిరునామాగా మారాడు. భారత్ ఫుట్‌బాల్ చరిత్రలో తన ఆట గురించి అందరూ మాట్లాడుకునేలా చేయగలిగాడు. తన అసాధారణ ప్రదర్శనతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. అతడే సునీల్ ఛెత్రీ(Sunil Chhetri).
దాదాపు రెండు దశాబ్దాల కింద అరంగేట్రం చేసిన భారత ఫుట్‌బాల్ స్టార్ సునీల్ ఛెత్రి.. మరో మైలురాయిని అందుకోనున్నాడు. ఈ మంగళవారు అఫ్గానిస్థాన్‌తో జరిగే ప్రపంచకప్ క్వాలిఫయర్ ఛెత్రి కెరీర్‌లో 150వ అంతర్జాతీయ మ్యాచ్ ఆడనున్నాడు. అంతర్జాతీయ ఫుట్‌బాల్‌లో 150 లేదా అంతకన్నా ఎక్కువ మ్యాచ్‌లు ఆడిన 40వ ఫుట్‌బాలర్‌గా అతడు నిలవనున్నాడు. ఈ జాబితాలో పోర్చుగల్ సూపర్‌స్టార్ రొనాల్డో 205 మొదటి స్థానంలో ఉన్నాడు. అఫ్గాన్‌తో మ్యాచ్ సందర్భంగా ఛెత్రిని సన్మానిస్తామని అఖిల భారత ఫుట్‌బాల్ (AISF) సమాఖ్య ప్రకటించింది. 39 ఏళ్ల ఛెత్రి 2005లో పాకిస్థాన్‌తో మ్యాచ్‌తో అరంగేట్రం చేశాడు.