WFI Suspension: ఐఓఏ చేతికి రెజ్లింగ్ సమాఖ్య నిర్వహణ, లేఖ రాసిన కేంద్రం
Indian Olymic Association: నూతనంగా ఎన్నికైన భారత రెజ్లింగ్ సమాఖ్యను రద్దు చేసిన కేంద్ర కీడామంత్రిత్వశాఖ... రెజ్లింగ్ ఫెడరేషన్‌ను చక్కదిద్దే బాధ్యతను ఇండియన్ ఒలంపిక్ అసోసియేషన్‌కు అప్పగించింది.
నూతనంగా ఎన్నికైన భారత రెజ్లింగ్ సమాఖ్యను రద్దు చేసిన కేంద్ర కీడామంత్రిత్వశాఖ... రెజ్లింగ్ ఫెడరేషన్‌ను చక్కదిద్దే బాధ్యతను ఇండియన్ ఒలంపిక్ అసోసియేషన్‌కు అప్పగించింది. రెజ్లింగ్ ఫెడరేషన్ నిర్వహణకు తాత్కాలిక కమిటీ ఏర్పాటు చేయాలని ఐఓఏను క్రీడా శాఖ లేఖ రాసింది. రెజ్లర్ల సెలక్షన్ , ఫెడరేషన్ నిర్వహణ బాధ్యతలను చూడాలని ఐఓఏను కేంద్ర ప్రభుత్వం కోరింది.
అసలేం జరిగిందంటే...?
భారత రెజ్లింగ్ సమాఖ్య (Wrestling Federation Of India )పై వివాదం జరుగుతున్న వేళ కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. నూతనంగా ఎన్నికైన భారత రెజ్లింగ్ సమాఖ్య కొత్త ప్యానెల్‌ను కేంద్ర ప్రభుత్వం (Central Government) సస్పెండ్ (Suspend) చేసింది. డబ్ల్యూఎఫ్‌ఐ, క్రీడా శాఖ నిబంధనలకు విరుద్ధంగా పోటీల నిర్వహణకు కొత్త అధ్యక్షుడు (President) సంజయ్ సింగ్ (Sanjay Singh) సిద్ధమయ్యారు. అండర్-15, అండర్-20 జాతీయ రెజ్లింగ్ పోటీలు నిర్వహించాలని ప్రకటన కూడా చేశారు. ఉత్తరప్రదేశ్‌లోని నందినీ నగర్, గోండాలో ఈ నెలాఖరులోపు నిర్వహిస్తామని చెప్పారు. పోటీల్లో పాల్గొనేందుకు రెజ్లర్లకు సమయం ఇవ్వకుండా ప్రకటించడంపై క్రీడాకారుల నుంచి విమర్శలు వెల్లువెత్తాయి. యునైటెడ్ వరల్డ్ రెజ్లింగ్ ఎగ్జిక్యూటివ్ కమిటీ ఎంపిక చేసిన ప్రదేశాల్లోనే సబ్ జూనియర్, జూనియర్, సీనియర్ రెజ్లింగ్ పోటీలను నిర్వహించాల్సి ఉంటుంది. దానికి విరుద్ధంగా సంజయ్ సింగ్ ప్రకటన చేయడంతో కొత్త ప్యానెల్‌ను కేంద్ర క్రీడా మంత్రిత్వ శాఖ సస్పెండ్ చేసింది. క్రీడా శాఖ రూల్స్ ను అతిక్రమించడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది. మళ్లీ ఉత్తర్వులు ఇచ్చే వరకు ఈ సస్పెన్షన్ అమల్లో ఉంటుందని స్పష్టం చేసింది. ్నారు. రెజ్లింగ్ వ్యవహారాల నుంచి తాను పూర్తిగా రిటైర్మెంట్ తీసుకున్నట్లు చెప్పారు. మరోవైపు WFI బాడీని క్రీడాశాఖ సస్పెండ్ చేయడంపై....రెజ్లర్ సాక్షి మాలిక్ హర్షం వ్యక్తం చేశారు. రెజ్లర్ల పోరాటంలో ఇది తొలి అడుగు అని చెప్పిన ఆమె.......... తన రిటైర్మెంట్ అంశం కొత్తగా ఏర్పడే WFI బాడీపై ఆధారపడి ఉంటుందని చెప్పారు.
ఈ పరిణామాల నేపథ్యంలో భారత రెజ్లింగ్ సమాఖ్య (Wrestling Federation of India) మాజీ చీఫ్ బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ (Brij Bhushan Saran Singh) సంచలన నిర్ణయం తీసుకున్నారు. రెజ్లింగ్ నుంచి శాశ్వతంగా వైదొలుగుతున్నట్లు ప్రకటించారు. 12ఏళ్ల పాటు రెజ్లింగ్ సేవలు అందించానని, క్రీడలతో తనకు ఉన్న అనుబంధాన్ని తెంచుకున్నట్లు తెలిపారు. ఛైర్మన్ గా సుదీర్ఘకాలం పాటు భారత రెజ్లింగ్ సమాఖ్యకు సేవలు అందించానని బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ వెల్లడించారు. రెజ్లింగ్ వ్యవహారాలను కొత్తగా ఎన్నికైన సంజయ్ సింగ్ ప్యానెల్ చూసుకుంటుందని స్పష్టం చేశారు. భారత రెజ్లింగ్ సమాఖ్య నూతన ప్యానెల్‌ను కేంద్రం సస్పెండ్ చేసిన రోజే, బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ రెజ్లింగ్ నుంచి వైదొలుగుతున్నట్లు ప్రకటించడం సంచలనంగా మారింది. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతో సమావేశం అయ్యారు. ఈ భేటీలో రెజ్లింగ్ వ్యవహారాల అంశమే చర్చకు రాలేదని వెల్లడించారు. ఆ తర్వాత రెజ్లింగ్ కు దూరంగా ఉంటున్నట్లు తెలిపారు. వచ్చే ఏడాది సార్వత్రిక ఎన్నికలతో పాటు అనేక రకాల బాధ్యతలు ఉండటంతో ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు చెప్పారు. సుదీర్ఘ కాలంగా రెజ్లింగ్ కు సేవలు అందించానని, ఇక నుంచి క్రీడా రాజకీయాలకు దూరంగా ఉంటున్నట్లు స్పష్టం చేశారు. డబ్ల్యూఎఫ్‌ఐ వ్యవహారాలు చూసుకోవడానికి తాత్కాలిక కమిటీని నియమించాలని ఐవోఏ కేంద్రాన్ని కోరింది.