French Open 2025: అల్కరాజ్ ఫైనల్ చేరాడు, ముసెట్టీ గాయంతో వైదొలగడంతో విజయం!
Carlos Alcaraz: టెన్నిస్‌లో రెండో ర్యాంక్‌లో ఉన్న స్పెయిన్ సంచలనం అల్కరాజ్ ప్రెంచ్ ఓపెన్ ఫైనల్‌కు చేరుకున్నాడు. ఇటలీ ఆటగాడు లోరెంజో ముసెట్టీపై విజయం సాధించాడు.

French Open:స్పెయిన్ యువ టెన్నిస్ సంచలనం కార్లోస్ అల్‌కరాజ్ 2025 ఫ్రెంచ్ ఓపెన్ (రోలాండ్ గ్యారోస్) ఫైనల్‌కు చేరాడు. శుక్రవారం జరిగిన సెమీఫైనల్‌లో అతడు ఇటలీ ఆటగాడు లోరెంజో ముసెట్టీపై విజయం సాధించాడు. అయితే ఈ మ్యాచ్ నాటకీయంగా ముగిసింది – ముసెట్టీ గాయం కారణంగా మధ్యలోనే ఆటను వదిలివేశాడు.
స్పెయిన్ సంచలనం కార్లోస్ అల్‌కరాజ్ ఫ్రెంచ్ ఓపెన్ 2025 ఫైనల్‌కు ప్రవేశించాడు. ఇటలీ ఆటగాడు లోరెంజో ముసెట్టీతో జరిగిన సెమీఫైనల్ మ్యాచ్‌లో నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి. చివరి వరకు పోరాడిన ముసెట్టి గాయం కారణంగా వైదలొగడంతో కార్లోస్ అల్‌కరాజ్‌ను విజేతగా ప్రకటించారు.
శుక్రవారం జరిగిన మ్యాచ్‌లో అల్కరాజ్ మొదటి సెట్‌లో వెనుకంజలో ఉన్నాడు. మొదటి సెట్‌లో మాత్రం మూసెట్టీ చూలా దూకుడుగా ఆడాడు. రెండో సెట్‌లో మాత్రం అల్కకరాజ్ పుంజుకొని విజయం సాధించాడు. ఈ సెట్ హోరాహోరీగా సాగింది. తగ్గేదేలే అన్నట్టు ఇరువురు వీరోచితంగా పోరాడారు. ఆట ఆడుతున్న ముసెట్టి, అల్కరాజ్ ఊపిరి తీసుకోకుండా పోరాడుతుంటే చూసే ప్రేక్షకులు కూడా ఊపిరి బిగబట్టి చూశారు. మ్యాచ్ టై-బ్రేక్‌లో అల్కరాజ్ సెట్‌ను గెలుచుకున్నాడు.
మూడో సెట్‌లో స్పెయిన్ ఆటగాడు పూర్తి ఆధిపత్యం చూపించాడు. 6-0తో సెట్ గెలుచుకున్నాడు. నాల్గో సెట్‌లో కూడా 2-0తో అల్కరాజ్ ఆధిక్యంలో ఉన్నారు. ఇంతలో ముసెట్టీకి గాయమైంది. ఆయన ఎడమ తొడ కండరాల పట్టేశాయి. మూడో సెట్ సమయంలో కూడా కాస్త ఇబ్బంది పడ్డాడు. అయినా ఆటను కంటిన్యూ చేశాడు. నాల్గో సెట్‌లో మాత్రం ఆ పోరాటాన్ని కంటిన్యూ చేయలేకపోయాడు. గాయం బాధ ఎక్కువైనందున ఆట నుంచి వైదొలగుతున్నట్టు ప్రకటించాడు.
ఈ విజయం స్పందించిన అల్కరాజ్ తాను సంతృప్తిగా లేనని చెప్పాడు. ముసెట్టీ అలా వైదొలగడం బాధగా ఉందన్నాడు. ఎప్పుడైనా పోరాడి గెలిస్తేనే కిక్ ఉంటుందని చెప్పుకొచ్చాడు. ఇలా ప్రత్యర్థి గాయం కారణంగా వైదొలగి మనం గెలిస్తే అది ధర్మబద్ధమైన గెలుపు కాదని అభిప్రాయపడ్డాడు.
ప్రెంచ్ ఓపెన్ ఫైనల్‌కు చేరుకున్న అల్కరాజ్ జానిక్ సిన్నర్ లేదా నోవాక్ జొకోవిచ్‌తో తలపడబోతున్నాడు. తమ సెమీఫైనల్ మ్యాచ్ వాళ్లిద్దరు ఆడనున్నారు. అందుకే ఈ మ్యాచ్ తాను చూస్తానని అన్నాడు అల్కరాజ్. అత్యుత్తమ మ్యాచ్‌లలో ఒకటి అవుతుందని అభిప్రాయపడ్డాడు. అందులో వాళ్లిద్దరి టెక్నిక్ ఎలా ఉంటుందో తెలుసుకోవడానికి కూడా ఉపయోగపడుతుందని తెలిపారు.
కార్లోస్ అల్కరాజ్ ఆస్తులు, సంపద
2025 నాటికి కార్లోస్ అల్కరాజ్ నికర ఆస్తులు సుమారు 350 కోట్ల రూపాయలకుపైగా ఉంటాయని ఫోర్బ్స్ సహా అంతర్జాతీయ మీడియా సంస్థలు అంచనా వేస్తున్నాయి. కార్లోస్ అల్కరాజ్ ప్రపంచంలోనే అత్యంత సంపన్న టెన్నిస్ క్రీడాకారుడిగా సీఈవో టుడే 2025 లెక్కల చెబుతున్నాయి. పే చెక్ ఇండియా నివేదిక ప్రకారం అతని ఏడాది సంపాదన 38 కోట్లుపైమాటే అంటున్నారు. ప్రైజ్ మనీ ప్రకారం టోర్నమెంట్ల ద్వారా $38 మిలియన్‌కు సంపాదించినట్టు తెలుస్తోంది. ఇవి కాకుండా వివిధ బ్రాండ్లకు అంబాజిడర్‌గా ఉన్నందున ఎండోర్స్‌మెంట్ డీల్ ద్వారా కూడా సంపాదన భారీగానే ఉంటుంది. ఇతను ప్రజల్లో ఒకసారి కనిపించేందుకు ఏడు నుంచి 15 కోట్ల రూపాయలు వరకు ఛార్జ్ చేస్తాడట.
అల్కరాజ్ కార్ల కలెక్షన్
అల్కరాజ్ వద్ద మొత్తం నాలుగు లెటెస్ట్ ఫీచర్డ్ కార్లు ఉన్నాయి. అధునాతన టెక్ ఫీచర్లు ఉన్న బీఎండబ్ల్యూ 1 సిరీస్ లగ్జరీ, స్పోర్టీ ఎస్‌యూవీ ఉంది. హై-ఎండ్ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ బీఎండబ్ల్యూ iX1 కలిగి ఉన్నాడు. వింబుల్డన్ 2023 తర్వాత సెల్ఫ్ రివార్డ్‌గా బీఎండబ్ల్యూ M4 కొనుగోలు చేశాడు. స్టైలిష్, ఎలక్ట్రిక్ కారు మినీ కూపర్ ఎస్‌ఈ లిమిటెడ్ ఎడిషన్ కారు కూడా ఉంది.





















