అన్వేషించండి

Mana patel: ఒలింపిక్స్‌కు వెళ్తున్న తొలి ఇండియన్ ఉమెన్‌ స్విమ్మర్‌.. స్విమ్మింగ్‌ ఎందుకు స్టార్ట్‌ చేసిందో తెలుసా?

మానా పటేల్.. టోక్యో ఒలిపింక్స్​లో బెర్తు ఖరారు చేసుకున్న భారత తొలి మహిళా స్విమ్మర్. ఈ విషయం గురించి అందరికీ తెలిసిందే. అయితే ఈ అందాల స్విమ్మర్ గురించి ఈ ఆసక్తికర విషయాలు మీకు తెలుసా?

అధిక బరువును తగ్గించుకోవాలని ఏడేళ్ల వయసులో ఈత కొలనులోకి దిగింది. దాన్నే కెరీర్‌గా మార్చుకొని, జాతీయ, అంతర్జాతీయ స్థాయి పోటీల్లో పతకాల పంట పండించింది. 
ఇక ఒలింపిక్స్‌కు రెడీ అవుతున్న టైంలో దురదృష్టవశాత్తూ వరుస గాయాలు, లాక్‌డౌన్‌ అడ్డంకులతో రెండేళ్లపాటు ఆటకు దూరమైంది. కానీ ఒలింపిక్స్‌ కలను నెరవేర్చుకునేందుకు ఈ ఏడాది మళ్లీ పూల్‌లోకి అడుగుపెట్టింది. విరామం వచ్చినా తనలో వాడి తగ్గలేదని నిరూపించుకుంది. టోక్యో బెర్తును ఖరారు చేసుకుని.. ఈ ఘనత సాధించిన భారత తొలి మహిళా స్విమ్మర్‌గా చరిత్ర సృష్టించింది. ఆమే అహ్మదాబాద్‌కు చెందిన 21 ఏళ్ల మానా పటేల్.

ఆ కోటాలో..

ఒలింపిక్స్‌.. నాలుగేళ్లకోసారి వచ్చే ఈ ప్రతిష్ఠాత్మక పోటీల్లో పాల్గొనాలని, కనీసం ఒక్క పతకమైనా సాధించాలని ప్రపంచంలోని క్రీడాకారులందరూ కోరుకుంటారు. అలా ఒలింపిక్స్‌ ఛాంపియన్‌ కావాలన్న తన స్వప్నాన్ని సాకారం చేసుకునే ప్రయాణంలో మొదటి అడుగు విజయవంతంగా పూర్తి చేసింది మానా పటేల్‌. గుజరాత్‌లోని అహ్మదాబాద్‌కు చెందిన ఈ బ్యాక్‌స్ట్రోక్‌ స్విమ్మర్.. Universality quota (ఒక దేశం నుంచి ఒక ఆడ, ఒక మగ పోటీదారుల్ని ఒలింపిక్స్‌లో పాల్గొనడానికి అనుమతించడం)లో ఒలింపిక్స్‌ బెర్తు ఖరారు చేసుకుంది. దీంతో టోక్యో ఒలింపిక్స్‌కు అర్హత సాధించిన భారత తొలి మహిళా స్విమ్మర్‌గా చరిత్రకెక్కిందీ ఈ అమ్మాయి.

ఈ విషయాలు తెలుసా?

  1. తనకున్న ఊబకాయాన్ని అధిగమించేందుకు ఏడేళ్ల వయసులోనే ఈతపై ఇంట్రస్ట్​ పెంచుకుంది మానా పటేల్‌. ఆ తర్వాత ఇదే క్రీడను కెరీర్‌గా ఎంచుకుని జాతీయ, అంతర్జాతీయ స్థాయి పోటీల్లో సత్తా చాటింది.
  2. బ్యాచిలర్‌ ఆఫ్‌ కామర్స్ (ఆనర్స్)లో డిగ్రీ పట్టా పొందిన ఆమె ఇంట్లోకి తొంగిచూస్తే.. అంతా పతకాలు, ట్రోఫీలు, ప్రశంసా పత్రాలే కనిపిస్తాయి.
  3. చిన్న వయసులోనే జాతీయ క్రీడల్లో భాగంగా 50 మీటర్ల బ్యాక్‌స్ట్రోక్‌, 200 మీటర్ల బ్యాక్‌స్ట్రోక్‌ పోటీల్లో స్వర్ణ పతకాలు సాధించిన ఘనత మానా పటేల్‌ సొంతం.
  4. 2015 నేషనల్‌ స్కూల్‌ గేమ్స్‌లో భాగంగా 100 మీటర్ల బ్యాక్‌స్ట్రోక్‌ స్విమ్మింగ్‌ పోటీల్లోనూ పసిడి గెలుచుకొని అప్పటివరకు ఉన్న జాతీయ రికార్డును బద్దలు కొట్టింది.
  5. 2018లో జరిగిన 72వ సీనియర్‌ నేషనల్‌ అక్వాటిక్‌ ఛాంపియన్‌షిప్‌లోనూ మూడు బంగారు పతకాలు సాధించింది. అదే ఏడాది తిరువనంతపురంలో జరిగిన సీనియర్‌ నేషనల్స్‌ స్విమ్మింగ్‌ పోటీల్లో మూడు బ్యాక్‌స్ట్రోక్‌ ఈవెంట్లను కైవసం చేసుకుందీ యువ స్విమ్మర్.
  6. ప్రతి రోజూ 5 గంటలు స్విమ్మింగ్‌ ప్రాక్టీస్‌ చేస్తుందట మానా. ఉదయం రెండు గంటలు, మధ్యాహ్నం గంట, సాయంత్రం రెండు గంటలు సాధన చేస్తుంది.
  7. రోజూ గంట పాటు జిమ్‌లో గడుపుతుంది. మానసికంగా దృఢంగా ఉండేందుకు కొన్ని రకాల వ్యాయామాలు చేస్తుందట.
  8. ఈ అందాల స్విమ్మర్ పూర్తి శాకాహారి.

" "టీవీల్లో ఒలింపిక్స్‌ పోటీలు చూస్తూ పెరిగాను. అలాంటి ప్రతిష్ఠాత్మక పోటీల్లో ఇప్పుడు నా దేశం తరఫున ప్రాతినిథ్యం వహించే అవకాశం నాకు దక్కింది. టోక్యో ఫ్లైట్‌ ఎక్కబోతున్నందుకు ఎంతో గర్వంగా ఉంది. నా ఆనందాన్ని వర్ణించడానికి మాటలు రావడం లేదు. ప్రపంచంలోని అత్యుత్తమ స్విమ్మర్లతో పోటీ పడేందుకు ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను" "
-- మానా పటేల్, భారత స్విమ్మర్

టాప్ హెడ్ లైన్స్

Smriti VS Harmanpreet :  డ్రెస్సింగ్ రూంలో ఎడ‌మ మొహం, పెడ‌మొహం.. హర్మన్, స్మృతి మధ్య విభేదాలు నిజమేనా..?  కెప్టెన్సీ మార్పు లేటుగా జ‌రిగిందా..?
డ్రెస్సింగ్ రూంలో ఎడ‌మ మొహం, పెడ‌మొహం.. హర్మన్, స్మృతి మధ్య విభేదాలు నిజమేనా..?  కెప్టెన్సీ మార్పు లేటుగా జ‌రిగిందా..?
Smriti Mandhana Captaincy Era:  భారత మహిళల క్రికెట్ కొత్త బాస్ గా స్మృతి మంధాన, ఆర్సీబీ డబుల్ ట్రోఫీ నాయకి చేతుల్లోకి పగ్గాలు
భారత మహిళల క్రికెట్ కొత్త బాస్ గా స్మృతి మంధాన, ఆర్సీబీ డబుల్ ట్రోఫీ నాయకి చేతుల్లోకి పగ్గాలు
Captain Destructive Storm:  శ్రేయ‌స్ కెప్టెన్ ఇన్నింగ్స్.. విధ్వంసకర శతకంతో విండీస్ విలవిల, తొలి టీ20లో ఘన విజయంతో భారత్ బోణీ
శ్రేయ‌స్ కెప్టెన్ ఇన్నింగ్స్.. విధ్వంసకర శతకంతో విండీస్ విలవిల, తొలి టీ20లో ఘన విజయంతో భారత్ బోణీ
Bhuvi Sensational Return: నాలుగేళ్ల నిరీక్షణ తర్వాత మళ్లీ భారత జెర్సీలో స్వింగ్ మాస్టర్.. కివీస్ టూర్ టీ20 జట్టులో భువనేశ్వర్ కు చోటు
నాలుగేళ్ల నిరీక్షణ తర్వాత మళ్లీ భారత జెర్సీలో స్వింగ్ మాస్టర్.. కివీస్ టూర్ టీ20 జట్టులో భువనేశ్వర్ కు చోటు

వీడియోలు

Morne Morkel Backs Vaibhav Suryavanshi | వైభవ్ పై మోర్నీ మోర్కెల్ ఆసక్తికర వ్యాఖ్యలు
USA Pacer Ali Khan Wide Ball | వైడ్ బాల్ నేరుగా సిక్స్ వెళ్ళిన వైనం! అమెరికా బౌలర్ అరుదైన రికార్డ్
India vs Pakistan Asian Games 2026 Final | భారత్ - పాకిస్థాన్ మ్యాచ్‌లో షేక్ హ్యాండ్ ఉంటుందా?
Gautam Gambhir Slams Flat Pitches vs WI | పిచ్‌ల తీరుపై గౌతమ్ గంభీర్ తీవ్ర అసహనం
Ishan Kishan Knock in Asian Games 2026 | శ్రీలంకపై ఘన విజయం సాధించి ఫైనల్‌లోకి భారత్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
RBI బిగ్ షాక్... 2023 తరువాత వడ్డీ రేట్లు పెంచిన రిజర్వ్ బ్యాంక్- మరింత బారం కానున్న EMI
RBI బిగ్ షాక్... 2023 తరువాత వడ్డీ రేట్లు పెంచిన రిజర్వ్ బ్యాంక్- మరింత బారం కానున్న EMI
Hyderabad Elevated Corridor: కేబీఆర్ పార్క్ ప్రాజెక్టు రద్దు.. రూ.1090 కోట్లతో ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణం
కేబీఆర్ పార్క్ ప్రాజెక్టు రద్దు.. రూ.1090 కోట్లతో ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణం
Andhra Pradesh Politics: స్థానిక ఎన్నికల్లో సీట్ల సర్దుబాటుపై చర్చించిన చంద్రబాబు, పవన్ కళ్యాణ్.. జనసేన ఏం కోరుతోంది!
స్థానిక ఎన్నికల్లో సీట్ల సర్దుబాటుపై చర్చించిన చంద్రబాబు, పవన్ కళ్యాణ్.. జనసేన ఏం కోరుతోంది!
Tirumala: బుధవారం తిరుమల శ్రీవారి రూ.300 దర్శనం టికెట్లు విడుదల.. 10 రోజులు వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు
బుధవారం తిరుమల శ్రీవారి రూ.300 దర్శనం టికెట్లు విడుదల.. 10 రోజులు వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు
Honda Elevate Facelift కొత్త లుక్‌ అదిరిపోయింది.. కేవలం ₹21,000తో బుక్‌ చేసుకోవచ్చు
హోండా ఎలివేట్ ఫేస్‌లిఫ్ట్ లాంచ్‌.. ధర రూ.11.80 లక్షలు.. కొత్తగా వచ్చిన మార్పులు ఇవే!
Vijayawada Crime News: పాకిస్థాన్ ఏజెంట్లతో లింకులు.. ‘ఆపరేషన్ ఫైర్‌వాల్’లో ఇద్దర్ని అరెస్ట్ చేసిన ఏపీ పోలీసులు
పాకిస్థాన్ ఏజెంట్లతో లింకులు.. ‘ఆపరేషన్ ఫైర్‌వాల్’లో ఇద్దర్ని అరెస్ట్ చేసిన ఏపీ పోలీసులు
Smriti Mandhana Captaincy Era:  భారత మహిళల క్రికెట్ కొత్త బాస్ గా స్మృతి మంధాన, ఆర్సీబీ డబుల్ ట్రోఫీ నాయకి చేతుల్లోకి పగ్గాలు
భారత మహిళల క్రికెట్ కొత్త బాస్ గా స్మృతి మంధాన, ఆర్సీబీ డబుల్ ట్రోఫీ నాయకి చేతుల్లోకి పగ్గాలు
Leftover Rice Dosa : రాత్రి అన్నం మిగిలిపోయిందా? పారేయకండి.. ఉదయాన్నే ఇలా దోశలు వేసుకోండి
రాత్రి అన్నం మిగిలిపోయిందా? పారేయకండి.. ఉదయాన్నే ఇలా దోశలు వేసుకోండి
Embed widget