SA20: కప్పు కొట్టిన సన్‌రైజర్స్ - అదే చేత్తో ఐపీఎల్‌లో కూడా!
దక్షిణాఫ్రికా టీ20 లీగ్‌ను సన్‌రైజర్స్ ఈస్టర్న్ కేప్ జట్టు గెలుచుకుంది.
SA20 Winner Sunrisers Eastern Cap: సౌతాఫ్రికా టీ20 లీగ్ చివరి మ్యాచ్‌లో ప్రిటోరియా క్యాపిటల్స్‌ను నాలుగు వికెట్ల తేడాతో ఓడించి సన్‌రైజర్స్ ఈస్టర్న్ క్యాప్ టైటిల్ గెలుచుకుంది. దక్షిణాఫ్రికా టీ20 లీగ్ తొలి సీజన్‌లో ఎయిడెన్ మార్క్రమ్ జట్టు సన్‌రైజర్స్ ఈస్టర్న్ క్యాప్ విజేతగా నిలిచింది.
ఫైనల్ మ్యాచ్‌లో సన్‌రైజర్స్ జట్టు ప్రిటోరియా క్యాపిటల్స్‌ను సులువుగా ఓడించి మ్యాచ్ మరియు టైటిల్‌ను గెలుచుకుంది. ఈ మ్యాచ్‌లో సన్‌రైజర్స్ టాస్ గెలిచిన తర్వాత మొదట బౌలింగ్ చేయాలని నిర్ణయించుకుంది. వారి బౌలర్లు ఈ నిర్ణయం ఖచ్చితంగా సరైనదని నిరూపించారు. ప్రిటోరియా క్యాపిటల్స్‌ను సన్‌రైజర్స్ జట్టు 19.3 ఓవర్లలో కేవలం 135 పరుగులకే ఆలౌట్ చేసింది.
ప్రిటోరియా క్యాపిటల్స్ నుంచి ఒక్క ఆటగాడు కూడా పెద్ద ఇన్నింగ్స్ ఆడలేకపోయాడు. ఆ జట్టు తరపున కుశాల్ మెండిస్ అత్యధికంగా 21 పరుగులు చేశాడు. మిగతా ఆటగాళ్లందరూ దీని కంటే తక్కువ పరుగులు చేశారు. దీని కారణంగా ప్రిటోరియా జట్టు పెద్ద స్కోరు చేయలేకపోయింది.
రోలోఫ్ వాన్ డెర్ మెర్వేకు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్
సన్‌రైజర్స్ తరఫున 38 ఏళ్ల వెటరన్ ప్లేయర్ రోలోఫ్ వాన్ డెర్ మెర్వే నాలుగు ఓవర్లలో 31 పరుగులిచ్చి నాలుగు వికెట్లు పడగొట్టాడు. ఫైనల్ మ్యాచ్‌లో మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్‌గా కూడా ఎంపికయ్యాడు. సన్‌రైజర్స్ ఈస్టర్న్ క్యాప్ బ్యాటింగ్ గురించి చెప్పాలంటే వారి మొదటి వికెట్ కేవలం 11 పరుగులకే పడిపోయింది. అయితే ఆ తర్వాత ఆడమ్ రోసింగ్టన్, జోర్డాన్ హర్మాన్ మధ్య 67 పరుగుల భాగస్వామ్యం ఏర్పడింది. ఇది వారి విజయాన్ని ఖరారు చేసింది.
సన్‌రైజర్స్ తరఫున ఆడమ్ రోసింగ్టన్ 30 బంతుల్లో 57 పరుగులతో మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. అతనితో పాటు కెప్టెన్ అడెన్ మార్క్రామ్ కూడా 19 బంతుల్లో 26 పరుగుల ఇన్నింగ్స్ ఆడి తన జట్టును విజయపథంలోకి తీసుకెళ్లాడు. ఆ తర్వాత చివర్లో మార్కో జాన్సెన్ 11 బంతుల్లో అజేయంగా 13 పరుగులు చేసి జట్టుకు విజయాన్ని అందించాడు. ఈ టోర్నీ మ్యాన్ ఆఫ్ ద సిరీస్ ఎయిడెన్ మార్క్రామ్‌కు దక్కింది. ఐపీఎల్ సన్‌రైజర్స్ హైదరాబాద్ కూడా వారి ఫ్రాంచైజీ జట్టు విజయాన్ని సెలబ్రేట్ చేసుకుంది.
View this post on Instagram
View this post on Instagram
View this post on Instagram