అన్వేషించండి
Advertisement
Paris Olympics 2024: పంచ్ అదిరితేనే పతకం దక్కేది, భారత బాక్సర్లకు కఠినమైన డ్రా
Olympic Games Paris 2024: వందేళ్లకంటే ఎక్కువ చరిత్ర ఉన్న ఒలింపిక్స్ బాక్సింగ్‌లో భారత్ కు పతకాల ఆశలు మెండుగా ఉన్నాయి. అయితే అదేమంత సుళువు కాదు ఎందుకంటే భారత బాక్సర్లకు కఠినమైన డ్రా ఎదురైంది.
Indian Boxers Handed Challenging Draws: భారత బాక్సర్లు పంచ్ విసిరేందుకు సిద్ధమయ్యారు. తమ పంచ్ పవర్‌తో ఒలింపిక్స్ పతకం కొల్లగొట్టేందుకు సమాయత్తమయ్యారు. అయితే భారత బాక్సర్లకు(Indian Boxers) కఠినమైన డ్రా వచ్చింది. నిఖత్ జరీన్, లవ్లీనా బోర్గోహైన్‌లకు కఠినమైన డ్రా ఎదురైంది. మహిళల 50 కిలోల బాక్సింగ్ ఈవెంట్‌లో నిఖత్ జరీన్... 32వ రౌండ్‌లో జర్మనీకి చెందిన మాక్సీ కరీనా క్లోట్జర్‌తో తొలి మ్యాచ్‌లో తలపడనుంది. అది గెలిస్తే రెండుసార్లు ప్రపంచ ఛాంపియన్, పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ చైనాకు చెందిన వు యును 16వ రౌండ్‌లో నిఖత్... ఎదుర్కోవాల్సి ఉంటుంది. నిఖత్ చైనీస్ బాక్సర్‌ను అధిగమించినట్లయితే క్వార్టర్-ఫైనల్స్‌లో థాయిలాండ్‌కు చెందిన చుతామత్ రక్షత్ లేదా ఉజ్బెకిస్తాన్‌కు చెందిన సబీనా బోబోకులోవాతో తలపడుతుంది. ఫిబ్రవరిలో జరిగిన స్ట్రాండ్జా మెమోరియల్ ఫైనల్‌లో నిఖత్.... బోబోకులోవా చేతిలో ఓడిపోయింది.
లవ్లీనా బోర్గోహైన్‌కు కూడా కఠినమైన డ్రా వచ్చింది. టోక్యో ఒలింపిక్స్ 2020లో కాంస్య పతకంతో సత్తా చాటిన లవ్లీనా బోర్గోహైన్.. రెండో రౌండ్‌కు చేరుకుంటే టాప్ సీడ్, రెండుసార్లు ఒలింపిక్ పతక విజేత లి కియాన్‌తో తలపడాల్సి ఉంటుంది. ఆసియా క్రీడల స్వర్ణ పతక పోరులో లి కియాన్.,... లవ్లీనాను ఓడించింది. అందులో విజయం సాధిస్తే టోక్యో ఒలింపిక్స్‌లో రజత పతక విజేత అయిన ఫిలిప్పీన్స్‌కు చెందిన నెస్తీ పెటెసియోతో జైస్మిన్ లాంబోరియాతో లవ్లీనా తలపడనుంది. భారత బాక్సర్ తదుపరి రౌండ్‌కు చేరుకుంటే యూరోపియన్ ఛాంపియన్‌గా ఉన్న ఫ్రాన్స్‌కు చెందిన మూడో సీడ్ అమీనా జిదానీతో తలపడుతుంది.
ఆసియా క్రీడల్లో కాంస్య పతక విజేత అయిన ప్రీతి పవార్... తన తొలి మ్యాచ్‌లో వియత్నాంకు చెందిన వో థి కిమ్ అన్‌తో తలపడనుంది. పురుషుల 51 కేజీల విభాగంలో అమిత్ పంఘల్... 71 కేజీల విభాగంలో నిశాంత్ దేవ్ వరుసగా 16వ రౌండ్‌లో తమ పోరాటాన్ని ప్రారంభిస్తారు. వీరిద్దరికి బై లభించింది. ఓపెనింగ్ బౌట్‌లో అమిత్ పంఘల్ జాంబియాకు చెందిన పాట్రిక్ చినియెంబతో తలపడనున్నాడు. చినియెంబా టోక్యో 2022 కామన్వెల్త్ గేమ్స్‌లో కాంస్య పతకాన్ని గెలుచుకున్నాడు. నిశాంత్ దేవ్ ముందుగా ఈక్వెడార్‌కు చెందిన జోస్ రోడ్రిగ్జ్ టెనోరియోతో తలపడనున్నాడు. బాక్సింగ్ ఈవెంట్‌లు జూలై 27న ప్రారంభమవుతాయి.
భారత బాక్సర్ల డ్రా
మహిళలు 50 కేజీలు: నిఖత్ జరీన్ vs మాక్సీ కరీనా క్లోట్జర్ (జర్మనీ)
మహిళల 54 కేజీలు: ప్రీతి పవార్ vs వో తి కిమ్ అన్హ్ (వియత్నాం)
మహిళల 57 కేజీలు: జైస్మిన్ లంబోరియా vs నెస్తీ పెటెసియో (ఫిలిప్పీన్స్)
మహిళల 75 కేజీలు: లోవ్లినా బోర్గోహైన్ vs సున్నివా హాఫ్‌స్టాడ్ ( నార్వే)
పురుషుల 51 కేజీలు: అమిత్ పంఘల్ vs పాట్రిక్ చినియెంబ (జాంబియా)
పురుషుల 71 కేజీలు: నిశాంత్ దేవ్ vs జోస్ రోడ్రిగ్జ్ టెనోరియో (ఈక్వెడార్)
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
తెలంగాణ
పాలిటిక్స్
హైదరాబాద్
పాలిటిక్స్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
Advertisement