Breaking News: నా వంతు ప్రయత్నం చేశా: మను భాకర్
2024 Paris Olympics Live Updates: రెండు పతకాలతో అదరగొట్టిన మనుభాకర్ స్వర్ణం సాధించే ఛాన్స్ ఉంది దాంతోపాటు ఇతర న్యూస్ అప్‌డేట్స్‌ను ఇక్కడ చూసుకోవచ్చు.
LIVE
Background
Breaking News: మూడో పతకం గెలవాలన్న పట్టుదలతో ఉన్న స్టార్ షూటర్ మను భాకర్ గోల్డ్‌పై గురిపెట్టారు. ఆమె హ్యాట్రిక్ కొట్టి ఇంతవరకూ భారత క్రీడా చరిత్రలో ఎవరూ సాధించిన ఘనత సాధిస్తే చూడాలన్న తలంపుతో అభిమానులు కూడా సిద్ధంగా ఉన్నారు. విశ్వ క్రీడల్లో(Paris 2024 Olympics 2024) మూడో పతకంపై కన్నేసిన మను బాకర్ కాసేపట్లో మహిళల 25 మీటర్ల పిస్టల్ ఫైనల్‌లో తలపడనుంది. ఇప్పటికే రెండు పతకాలు సాధించి మంచి టచ్‌లో ఉన్న మను... ఈ పతకాన్ని కూడా సాధిస్తే... క్రీడా చరిత్రలో ఆమె పేరు చిరస్థాయిగా నిలిచిపోతుంది. ఇప్పటికే మహిళల 10 మీటర్ల పిస్టల్, మిక్స్‌డ్ టీమ్ 10 మీటర్ల పిస్టల్ ఈవెంట్‌లలో కాంస్య పతకాలను గెలుచుకున్న మను.. మూడో పతకం సాధించి కొత్త చరిత్ర సృష్టించినట్టే. ఆర్చరీలో దీపికా కుమారి మళ్లీ కాసేపట్లో బరిలో దిగనుంది. భారత ఆర్చర్లు దీపికా కుమారి, భజన్ కౌర్‌లతో పాటు బాక్సర్ నిశాంత్ దేవ్ కూడా నేడు పోటీ పడనున్నారు.
మూడుసార్లు ఒలింపియన్ దీపికా కుమారి 18 ఏళ్ల భజన్ కౌర్‌తో కలిసి మహిళల వ్యక్తిగత ఆర్చరీలో పోటీ పడుతున్నారు. 16వ రౌండ్లో దీపికా జర్మనీకి చెందిన మిచెల్ క్రోపెన్‌తో ఢీ కొట్టనుంది. భజన్ రెండుసార్లు ఆసియా క్రీడల్లో పతక విజేత ఇండోనేషియాకు చెందిన డియానందా కొయిరునిసాతో ఢీ కొట్టింది. ఇప్పటికే మిక్స్‌డ్ టీమ్ సిల్వర్ మెడల్ సాధించిన క్రోపెన్‌తో దీపిక రౌండ్ ఆఫ్ 16లో తలపడనుంది. పురుషుల 71 కేజీల క్వార్టర్ ఫైనల్‌లో భారత బాక్సర్ నిశాంత్ దేవ్ మార్కో అలోన్సో వెర్డే అల్వారెజ్‌తో పోటీపడనున్నారు. గోల్ఫ్‌లో శుభంకర్ శర్మ, గగన్‌జీత్ భుల్లర్ రౌండ్ 3 కోసం సిద్దపడ్డారు.
Paris Olympics 2024, Day 8 Live: ఆర్జరీలో షాక్- ప్రీ క్వార్టర్స్‌లో భజన్ కౌర్ నిష్క్రమణ
Paris Olympics 2024, Day 8 Live: ఆర్చరీలో భారత్‌కు షాక్ . ఉత్కంఠభరితమైన షూట్-ఆఫ్‌లో ఇండోనేషియా ఆర్చర్‌తో ఓడిపోయిన భజన్ కౌర్ ప్రీ-క్వార్టర్ ఫైనల్‌లో నిష్క్రమించింది.
Paris Olympics 2024, Day 8 Live: ఆర్చరీలో క్వార్టర్ ఫైనల్‌కు దూసుకెళ్లిన దీపికా కుమారి
Paris Olympics 2024, Day 8 Live: ఆర్చరీ మహిళల వ్యక్తిగత విభాగంలో దీపికా కుమారి అద్భుత ప్రదర్శన చేశారు. 16వ రౌండ్లో దీపికా కుమారి జర్మనీకి చెందిన మిచెల్ క్రోపెన్‌పై విజయం సాధించింది. 6-4 స్కోరుతో దీపిక విజయం సాధించింది. ఈ విజయంతో క్వార్టర్స్‌కు దూసుకెళ్లారు.
నా వంతు ప్రయత్నం చేశా: మను భాకర్
మూడో పతకం చేజార్చుకున్న భారత షూటింగ్ క్వీన్ మను భాకర్ మాట్లాడుతూ.. నేను ఇప్పుడు నెక్స్ట్ ఏంటని ఆలోచిస్తున్నాను... ఇప్పటి వరకు నా ప్రయత్నం నేను చేశాను."
తృటిలో పతకం కోల్పోయిన మను భాకర్
25 మీటర్ల ఎయిర్ పిస్టల్ మహిళల సింగిల్స్ ఫైనల్లో భారత్ కు చెందిన మను భాకర్ పతకం తృటిలో చేజార్చుకుంది. మను భాకర్ మూడో పతకం సాధించలేకపోయింది. ఇప్పటికే పారిస్ ఒలింపిక్స్ లో ఆమె రెండు పతకాలు సాధించింది. 25 మీటర్ల రేస్‌లో నాలుగో స్థానంలో నిలిచింది.
ఫైనల్లో మను భాకర్ అద్భుత ప్రదర్శన
25 మీటర్ల ఎయిర్ పిస్టల్ మహిళల సింగిల్స్ ఫైనల్లో మను భాకర్ అద్భుత ప్రదర్శన చేస్తోంది. స్టార్టింగ్‌లో తడబడిన మను తర్వాత పుంజుకుంది. ఏడు సిరీస్ల తర్వాత మను భాకర్ 26 పాయింట్లతో రెండో స్థానంలో ఉన్నట్టే మళ్లీ నాల్గో స్థానానికి పడిపోయింది..