అన్వేషించండి
Vinesh Phogat: వినేశ్ వెనకే యావత్ దేశం, నువ్వో ఛాంపియన్ అంటూ మద్దతుగా నిలుస్తున్న ప్రముఖులు
Vinesh Phogat Disqualified: పారిస్ ఒలింపిక్స్ 2024లో భారత స్టార్ మహిళా రెజ్లర్ వినేశ్ ఫొగాట్‌పై అనర్హత వేటు పడిన సంగతి తెలిసిందే. అయితే ఈ సందర్భంలో కూడా దేశం అంతా వినేశ్ ఫొగాట్ వెన్నంటే ఉంది.
Heartbroken Vinesh Phogat fans: ఒలింపిక్స్ ఫైనల్లో పాల్గొనకుండా వినేశ్ ఫొగాట్(Phogat fans)పై అనర్హత వేటు పడడంపై భారత క్రీడాభిమానులతో పాటు భారతప్రధాని సహా పలువురు నిర్వేదం వ్యక్తం చేశారు. వినేశ్‌కు అండగా నిలుస్తూ ట్వీట్లు చేస్తున్నారు.
పారిస్ ఒలింపిక్స్‌లో అనర్హత వేటు పడిన వినేశ్ ఫోగట్‌కు ప్రధాని మోదీ అండగా నిలిచారు. 'వినేశ్ నువ్వు భారత్‌కు గర్వకారణం. నువ్వు ఛాంపియన్లకే ఛాంపియన్. దేశ ప్రజలందరిలో స్ఫూర్తి నింపావు. ఇలా జరగడంపై నాకు కలిగిన నిరాశ మాటల్లో చెప్పలేకపోతున్నాను. నీ పట్టుదల నాకు తెలుసు. సవాళ్లను ఎదుర్కోవడమే నీ సహజతత్వం. మరింత బలంతో ముందుకెళ్లాలి. మీ గెలుపు కోసం చూస్తున్నామంటూ ప్రధాని మోదీ ట్వీట్ చేశారు.
Vinesh, you are a champion among champions! You are India's pride and an inspiration for each and every Indian.
— Narendra Modi (@narendramodi) August 7, 2024
Today's setback hurts. I wish words could express the sense of despair that I am experiencing.
At the same time, I know that you epitomise resilience. It has always…
స్వర్ణ పతక రేసులో ఉన్న పొగాట్‌పై అనూహ్యంగా అనర్హత వేటు పడటంపై ప్రముఖ పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్రా తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఇది పీడకల అయితే బాగుండు... నిజం కాకపోతే బాగుండని మహింద్ర ట్వీట్ చేశారు.
ఆప్ ఎంపీ సంజయ్‌సింగ్ కూడా వినేష్‌కు మద్దతుగా ట్వీట్ చేశారు. ఇది వినేష్‌కు జరిగిన అవమానం కాదు దేశానికే అవమానమని సంజయ్‌సింగ్ అన్నారు. వినేష్ ఫోగట్ ప్రపంచ వ్యాప్తంగా చరిత్ర సృష్టించబోతున్నారని, ఆమె 100 గ్రాములు అధిక బరువు ఉందని ప్రకటించి అనర్హులుగా ప్రకటించడం తీవ్ర అన్యాయమని, వినేష్‌కి దేశం మొత్తం అండగా ఉంటుందని సంజయ్‌సింగ్ ట్వీట్ చేశారు. భారత ప్రభుత్వం జోక్యం చేసుకోవాలని... తక్షణమే, దీనిని అంగీకరించకపోతే, ఒలింపిక్స్‌ను బహిష్కరించాలని ఆయన ట్వీట్ చేశారు.
NO! NO! NO!
— anand mahindra (@anandmahindra) August 7, 2024
Please make this a bad dream that I will wake up from and find it isn’t true… https://t.co/T5BLQCkLVI
#WATCH | Paris: On Indian wrestler Vinesh Phogat's disqualification from #ParisOlympics2024, Wrestling Federation of India (WFI) president Sanjay Singh says, "We have less time, but we will do whatever is possible. Since she was training all night to reduce her weight, there is… pic.twitter.com/jWgsBtjBAs
— ANI (@ANI) August 7, 2024
వైద్యులు వద్దన్నారా?
పారిస్ ఒలింపిక్స్ కోసం బరువు తగ్గవద్దని వైద్యులు ముందే వినేశ్ ఫొగాట్‌కు సలహా ఇచ్చారు. 50 ఫ్రీస్టైల్ కేజీల విభాగంలో 100 గ్రాములు అధిక బరువుతో అనర్హత వేటు పడటంతో పారిస్ ఒలింపిక్స్‌లో వినేష్ ఫోగాట్ పరుగు విషాదకరంగా ముగిసింది. 56 కిలోల సాధారణ బరువు ఉన్న వినేశ్.. ఈ ఒలింపిక్స్‌కోసం బరువు తగ్గింది. ఇది అంత సులభంగా సాగలేదు. కరోనా బారినపడినా వినేష్ అంకిత భావంతో క్రమశిక్షణతో బరువు తగ్గింది. గత ఏడాది ఆగస్టులో వినేష్ లిగమెంట్ టియర్ సర్జరీ చేయించుకున్నాడు. ఆ సమయంలో ఆమె బరువు 59 కిలోలకు చేరుకుంది. అయితే, 50 కిలోల విభాగంలో ఒలింపిక్స్‌లో బరిలో దిగాలని చూసిన వినేశ్... ఆహారం, నీటి తీసుకోవడం గణనీయంగా తగ్గించింది. ఇది సాధారణంగా బలహీనత, గాయాలకు దారి తీస్తుందని వైద్యులు వినేశ్‌కు సలహా ఇచ్చారు. అయితే వినేష్ మాత్రం 50 కేజీల విభాగంలో పోటీపడి పతకం సాధించేందుకు ఆ రిస్క్ తీసుకుంది. పారిస్‌లో నాలుగుసార్లు ప్రపంచ ఒలింపిక్ ఛాంపియన్‌గా నిలిచిన జపాన్ రెజ్లర్ యుయి సుసాకితో తలపడి విజయంసాధించి చరిత్ర సృష్టించి ఫైనల్ చేరింది. ఇక పతకం ఖాయమనుకుంటున్న వేళ ఈ అనర్హత వేటు పడి భారత అభిమానుల ఆశలపై నీళ్లు చల్లింది.
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
ఆంధ్రప్రదేశ్
క్రైమ్
తెలంగాణ
ఆంధ్రప్రదేశ్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
Advertisement
Nagesh GVDigital Editor
Opinion