Vinesh Phogat: వినేశ్ అప్పీలును తిరస్కరించిన కాస్, భారత్ చేజారిన మరో పతకం
Vinesh Phogat : వినేశ్ ఫోగట్‌కు భారీ షాక్. వినేశ్ ఫోగట్ అప్పీల్‌ను తిరస్కరించిన కాస్. సిల్వర్ పతకం ఇవ్వాలన్న వినేశ్ అభ్యర్థనను తిరస్కరించిన కాస్.
VINESH PHOGAT's PETITION HAS BEEN DISMISSED...!!! [RevSportz]
— Johns. (@CricCrazyJohns) August 14, 2024
- A heartbreaking news for Indian sports fans. 💔 pic.twitter.com/MuNYNqUDKt
భారత అభిమానుల హృదయం ముక్కలైంది. భారత స్టార్ రెజ్లర్ వినేశ్ ఫోగాట్ ఏదో ఒక పతకంతో భారత్‌లో అడుగు పెడుతుందన్న ఆశలు.. నిర్వీర్యమైపోయాయి. ఒలింపిక్ అనర్హతపై వినేష్ ఫోగట్ చేసిన అప్పీల్‌ను కాస్ తిరస్కరించింది. విశ్వ క్రీడల్లో పైనల్‌కు చేరిన తర్వాత తనపై అనర్హత వేటు వేయడంపై భారత స్టార్ రెజ్లర్ వినేష్ ఫోగట్... కోర్ట్ ఆఫ్ ఆర్బిట్రేషన్ ఫర్ స్పోర్ట్‌ను ఆశ్రయించింది. అయితే వినేశ్ ఫొగాట్ అప్పీల్‌ను కాస్ తిరస్కరించిందని భారత ఒలింపిక్ సంఘం తెలిపింది. గత వారం మహిళల 50 కేజీల ఫ్రీస్టైల్ ఫైనల్‌లో వినేష్ ఫొగాట్‌పై 100 గ్రాముల అధిక బరువుతో అనర్హత వేటు పడింది. ఇంటర్నేషనల్ ఒలింపిక్ కమిటీ నిర్ణయానికి వ్యతిరేకంగా రెజ్లర్ వినేష్ ఫోగాట్ చేసిన దరఖాస్తును కాస్ తిరస్కరించిందని ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్ ప్రెసిడెంట్ PT ఉష(PT Usha) ఒక ప్రకటనలో తెలిపారు. కాస్ తీర్పుపై ఉష దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. వినేష్ విజ్ఞప్తిని తిరస్కరించడం వల్ల పారిస్ ఒలింపిక్స్‌లో భారత్‌కు ఒక రజతం, ఐదు కాంస్యాలు కలిపి ఆరు పతకాలు మాత్రమే దక్కినట్లు అయింది.
The Indian Olympic Association (IOA) President Dr PT Usha has expressed her shock and disappointment at the decision of the Sole Arbitrator at the Court of Arbitration for Sport (CAS) to dismiss wrestler Vinesh Phogat’s application against the United World Wrestling (UWW) and the… pic.twitter.com/8OWDh3UT8O
— ANI (@ANI) August 14, 2024
ఈ విషయంపై బాక్సర్ విజయేంద్ర సింగ్ స్పందించారు. ఇది చాలా బాధాకరమైన విషయమన్నారు. వినేశ్ పోటీపడి ఉంటే భారత్ కు ఖచ్చితంగా స్వర్ణం వచ్చి ఉండేదన్న నమ్మకం వ్యక్తం చేశారు. తాను గతంలోనే కాదు భవిష్యత్తులో కూడా వినేష్ కు మద్దతుగానే ఉంటామన్నారు.
#WATCH | Delhi: On Vinesh Phogat’s application dismissed by CAS | Boxer Vijender Singh says, "This is a very sad and unfortunate thing for us...We could have won gold in the Olympics if she had made it through the finals. We are standing with Vinesh and will always support… pic.twitter.com/lU7f46gfGc
— ANI (@ANI) August 14, 2024
అభిమానులకు నిరాశ:
కాస్ తీర్పుతో భారత క్రీడా అభిమానులు తీవ్ర నిరాశకు లోనయ్యారు. పారిస్ విశ్వ క్రీడల్లో ఫైనల్‌కు చేరిన భారత స్టార్ రెజ్లర్ వినేశ్ ఫొగాట్ ఏదో ఒక పతకంతో భారత్‌లో అడుగు పెడుతుందని అంతా భావించారు. అయితే కాస్ తీర్పు భారత అభిమానుల ఆశలకు వ్యతిరేకంగా వచ్చింది. ఒలింపిక్స్‌లో ఇప్పటివరకూ ఓటమంటే ఎరుగని ప్రపంచ నెంబర్ వన్ రెజ్లర్‌ను ఓడించిన వినేశ్ ఫొగాట్‌కు కచ్చితంగా స్వర్ణం వస్తుందని అంతా భావించారు. అయితే ఈ ఆశలు నెరవేరలేదు. కేవలం వంద గ్రాముల బరువుతో వినేశ్ పతకాన్ని కోల్పోవడం అశేష భారతావని జీర్ణించుకోలేకపోతోంది. పతకం సాధించకపోయినా వినేశ్.. ఛాంపియనే అంటూ పలువురు కామెంట్లు చేస్తున్నారు. క్రికెట్ గాడ్ సచిన్ టెండూల్కర్, ప్రిన్స్ సౌరవ్ గంగూలీ ఇప్పటికే వినేశ్‌కు మద్దతు ఇచ్చారు. అయినా కాస్ తీర్పు మాత్రం భారత్‌కు వ్యతిరేకంగా వచ్చింది.