Paralympics 2024: పారా ఒలింపిక్స్‌లో తొలి అడుగు ఘనంగా , అద్భుతం చేసిన శీతల్
Paris 2024 Paralympics: భారత ఆర్మ్ లెస్ ఆర్చర్ శీతల్ దేవి అరంగేట్రంలోనే అదరగొట్టింది. మహిళల వ్యక్తిగత కాంపౌండ్ ఓపెన్ ర్యాంకింగ్ రౌండ్‌లో అద్భుతమైన ప్రదర్శన చేసి రెండవ స్థానంలో నిలిచింది

India Got Off To A Good Start As Para Archer Sheetal Devi Excelled Beyond Expectations: పారా ఒలింపిక్స్(2024 Paralympics)లో భారత(India) పోరాటం ఆరంభమైంది. శీతల్ దేవి(Sheetal Devi) అద్భుతం చేయడంతో తొలి రోజు భారత్ సంతృప్తికరంగానే ముగించింది. ఇక ఇవాళ భారత ఖాతాలో తొలి పతకం చేరే అవకాశం కనిపిస్తోంది. పారా ఒలింపిక్స్‌లో తొలిరోజు భారత ఆర్చర్ శీతల్ దేవీ.. షట్లర్లు సుకాంత్, సుహాస్, తరుణ్ శుభారంభం చేశారు. శీతల్ దేవీ ప్రదర్శనే తొలి రోజు హైలెట్‌గా నిలిచింది. తొలిసారి పారా ఒలింపిక్స్‌లో బరిలోకి దిగిన శీతల్ రెండు చేతులు లేకోపోయినా కాళ్లతో గురి పెట్టి లక్ష్యాన్ని ఛేదించారు. శీతల్ పట్టుదల ముందు ప్రపంచ రికార్డు ఆమె పాదాక్రాంతమైంది. ఇక నేరుగా ప్రీ క్వార్టర్స్‌కు చేరిన శీతల్ దేవి... పతక ఆశలను రెట్టింపు చేసింది. కాలితో విల్లును పట్టి, భుజంతో బాణాలు విసిరే శీతల్ పారాలింపిక్స్‌లో తన ప్రదర్శనతో అద్భుతమే చేసింది.
Read Also: Virat Kohli : గిల్ నన్ను ఎప్పటికీ దాటలేడు, కోహ్లీ డీప్ ఫేక్ వీడియో వైరల్
At 17, Sheetal Devi on her Paralympics Debut 🫡
— The Khel India (@TheKhelIndia) August 29, 2024
- Broke World & Personal Record
- Score brilliant 703/720
- Finished 2nd at Ranking Round
Sheetal Devi is the only Female International Archer in the World who shoots without arms.pic.twitter.com/8qS2THRxM0
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

