అన్వేషించండి
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
Virat Kohli : గిల్ నన్ను ఎప్పటికీ దాటలేడు, కోహ్లీ డీప్ ఫేక్ వీడియో వైరల్
Virat Kohli's Deep Fake Video: టీమిండియా యువ బ్యాటర్, వైస్ కెప్టెన్ శుభ్‌మన్ గిల్‌ను ఉద్దేశించి విరాట్ కోహ్లీ అనుచిత వ్యాఖ్యలు చేసినట్లుగా ఉన్న ఆ వీడియో ప్రస్తుతం వైరల్‌గా మారింది.
Virat Kohli's Deepfake Video Slamming Shubman Gill Goes Viral: డీప్ ఫేక్ వీడియో(Deepfake Video) మరోసారి క్రికెట్ ప్రపంచాన్ని విస్మయపరిచింది. టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ(Virat Kohli) మరోసారి డీప్ ఫేక్ బారినపడడం కలకలం రేపింది. గతంలో ఓ బెట్టింగ్ యాప్‌ను ప్రమోట్ చేస్తున్నట్లు కోహ్లీ డీప్ ఫేక్ వీడియో కలకలం రేపగా.. తాజాగా శుభ్‌మన్ గిల్(Shubman Gill)పై అనుచిత వ్యాఖ్యలు చేస్తున్న డీప్ ఫేక్ వీడియో తీవ్ర సంచలనం సృష్టించింది. గతంలో సచిన్ టెండూల్కర్, రష్మిక మంధాన, ప్రధాని మోడీతో మొదలు వివిధ రంగాల ప్రముఖులు కూడా డీప్ ఫేక్ వీడియోల బారిన పడ్డారు. దీనిపై కేంద్రం ఇప్పటికే స్పందించినా ఇలాంటి చర్యలు మాత్రం ఆగడం లేదు.
అసలు ఏముంది ఆ వీడియోలో....
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(AI) అందుబాటులోకి వచ్చిన తర్వాత డీప్ ఫేక్ వీడియోలు తీవ్ర కలకలం రేపుతున్నాయి. స్టార్ ఆటగాళ్లు, సినిమా నటుల డీప్ ఫేక్ వీడియోలు ఇప్పుడు సంచలనం సృష్టిస్తున్నాయి. తాజాగా కింగ్ కోహ్లీ మరోసారి డీప్ ఫేక్ వీడియో బారినపడ్డాడు. ఈ మార్ఫింగ్ వీడియోలో సామాజిక మాధ్యమాల్లో సంచలనం సృష్టిస్తోంది. ఈ డీప్ ఫేక్ మార్ఫింగ్ వీడియోలో కింగ్ కోహ్లీ... శుభ్‌మన్ గిల్‌పై తీవ్ర వ్యాఖ్యలు చేస్తున్నట్లుగా గుర్తించారు. ఒక ఇంటర్వ్యూలో కోహ్లీ చేసిన వ్యాఖ్యలను డీప్ ఫేక్ చేసి ఈ మార్ఫింగ్ వీడియో రూపొందించారు. తనతో శుభ్ మన్ గిల్‌ను పోల్చడంపై విరాట్ కొన్ని వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తున్నట్లు ఆ మార్ఫింగ్ వీడియో రూపొందించారు. గిల్‌ను తాను చాలా సంవత్సరాలుగా చూస్తున్నానని... గిల్ మంచి టాలెంట్ ఉన్న ఆటగాడని కోహ్లీ చెప్తున్నట్లుగా ఆ వీడియోను మార్చారు. ఇంతవరకు బాగానే ఉన్నా గిల్ లెజెండ్‌గా మారడానికి చాలా దూరంలో ఉన్నాడని.. గిల్ బ్యాటింగ్ టెక్నిక్ అద్భుతంగా ఉన్నా తన కంటే ముందుకు వెళ్లలేడని కోహ్లీ అన్నట్లు ఆ వీడియోలో ఉంది. తదుపరి విరాట్ కోహ్లి గిల్ అని చాలా మంది మాట్లాడుతున్నారని.... కానీ విరాట్ కోహ్లీ ఎప్పుడూ ఒక్కడే అంటూ కోహ్లీ వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తున్నట్లు ఆ వీడియోను డీప్ ఫేక్ చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ముఖ్యంగా ఇది డీప్ ఫేక్ వీడియో అని తెలియక కొందరు కింగ్ కోహ్లీపై విమర్శలు కూడా కురిపించారు.
AI is Dangerous pic.twitter.com/njUvwiwc4t
— Cricketopia (@CricketopiaCom) August 27, 2024
తీవ్ర ఆగ్రహం
కోహ్లీ డీప్ ఫేక్ వీడియోపై సర్వత్రా విమర్శల జల్లు కురుస్తోంది. కృత్రిమ మేధతో ఎంత మేలు జరుగుతుందో అంతే ప్రమాదం పొంచి ఉందనే చర్చ జరుగుతోంది. ప్రముఖులకు ఈ డీప్ ఫేక్ పెద్ద సమస్యగా మారింది. ఇప్పటికే రష్మీక మంధాన డీప్ ఫేక్ వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అయిందియ ఏఐ దుర్వినియోగం.. దాని పర్యావసనాలపై నెటిజన్లు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
పాలిటిక్స్
సినిమా
ఆంధ్రప్రదేశ్
ట్రెండింగ్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
Advertisement