అన్వేషించండి

18 సంవత్సరాల తర్వాత జరగాల్సిన మ్యాచ్.. చివరి నిమిషంలో రద్దు.. పాక్‌కు న్యూజిలాండ్ షాక్.. ఎందుకంటే?

న్యూజిలాండ్ క్రికెట్ జట్టు పాకిస్తాన్‌కు భారీ షాక్ ఇచ్చింది. మ్యాచ్ ప్రారంభానికి కొద్ది గంటల ముందు భద్రతా కారణాలను చూపిస్తూ పాకిస్తాన్‌లో జరగాల్సిన తమ సిరీస్‌ను రద్దు చేసుకుంది.

పాకిస్తాన్‌కు న్యూజిలాండ్ క్రికెట్ జట్టు గట్టి షాక్ ఇచ్చింది. భద్రతా కారణాలను చూపిస్తూ పాకిస్తాన్‌లో జరగాల్సిన తమ సిరీస్‌ను రద్దు చేసుకుంది. అయితే మ్యాచ్ ప్రారంభానికి కొద్ది గంటల ముందు న్యూజిలాండ్ ఈ ప్రకటన చేయడం క్రికెట్ వర్గాల్లో సంచలనం సృష్టించింది. పాకిస్తాన్, న్యూజిలాండ్ జట్ల మధ్య మూడు వన్డే మ్యాచ్‌ల సిరీస్, ఐదు టీ20 మ్యాచ్‌ల సిరీస్ పాకిస్తాన్‌లో జరగాల్సి ఉంది. ఈ సిరీస్‌లో మొదటి మ్యాచ్ శుక్రవారం ప్రారంభం కావాల్సి ఉంది. అయితే సరిగ్గా మ్యాచ్‌కు కొన్ని గంటల ముందు న్యూజిలాండ్ ఈ వన్డేను ఆడబోవడం లేదని ప్రకటించింది.

న్యూజిలాండ్ ప్రభుత్వం అందించిన సెక్యూరిటీ అలెర్ట్ కారణంగా బ్లాక్ క్యాప్స్ పాకిస్తాన్ టూర్‌ను ఆడబోవడం లేదని న్యూజిలాండ్ క్రికెట్ జట్టు ప్రకటనలో పేర్కొంది. ఆటగాళ్ల భద్రతే తమకు ముఖ్యమని, అందుకే ఈ నిర్ణయం తీసుకున్నామని న్యూజిలాండ్ క్రికెట్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ డేవిడ్ వైట్ తెలిపారు.

పాకిస్తాన్ క్రికెట్ బోర్డును ఈ నిర్ణయం ఎంత బాధ పెట్టి ఉంటుందో తమకు తెలుసని, వారి ఆతిథ్యం కూడా అద్భుతంగా ఉందని డేవిడ్ పేర్కొన్నారు. తమకు ఇది తప్ప మరో ఆప్షన్ కనిపించలేదన్నారు. దీనిపై పాకిస్తాన్ క్రికెట్ బోర్డు స్పందిస్తూ.. ఇది ఏకపక్ష నిర్ణయం అని తెలిపింది.

భద్రతా కారణాలను చూపిస్తూ సిరీస్‌ను వాయిదా వేస్తున్నట్లు న్యూజిలాండ్ క్రికెట్ తమకు ఈరోజే సమాచారం అందించిందని పీసీబీ తన మీడియా ప్రకటనలో పేర్కొంది. తమ దేశానికి వచ్చే అన్ని జట్లకు పాకిస్తాన్ క్రికెట్ బోర్డు, పాకిస్తాన్ ప్రభుత్వం అత్యుత్తమ భద్రతను అందిస్తుందని తెలిపింది. తాము న్యూజిలాండ్ క్రికెట్‌కు కూడా ఇదే చెప్పామని పేర్కొన్నారు. పాకిస్తాన్ ప్రధానమంత్రి, న్యూజిలాండ్ ప్రధానమంత్రితో స్వయంగా మాట్లాడారని, ప్రపంచంలోనే అత్యుత్తమ ఇంటెలిజెన్స్ వ్యవస్థల్లో తమది కూడా ఒకటని, న్యూజిలాండ్ క్రికెట్ జట్టుకు ఎటువంటి ముప్పూ లేదని చెప్పారన్నారు.

షెడ్యూల్ చేసిన మ్యాచ్‌లను ఆడటానికి ఇప్పటికీ తాము సుముఖులమేనని పీసీబీ తెలిపింది. పాకిస్తాన్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన భద్రతా ఏర్పాట్లతో న్యూజిలాండ్ టీం సెక్యూరిటీ సిబ్బంది సంతృప్తి చెందారని తెలిపారు. న్యూజిలాండ్ చివరి నిమిషంలో తీసుకున్న ఈ నిర్ణయంతో పాకిస్తాన్‌లోని క్రికెట్ లవర్స్, ప్రపంచంలోని క్రికెట్ ప్రేమికులు నిరాశ పడతారని ప్రకటనలో పేర్కొన్నారు.

ఒకవేళ ఈ మ్యాచ్ జరిగినట్లయితే 2003 తర్వాత పాకిస్తాన్‌లో న్యూజిలాండ్ క్రికెట్ ఆడటం ఇదే మొదటిసారి అయ్యేది. ఇప్పుడు న్యూజిలాండ్ జట్టు స్వదేశానికి బయలుదేరడానికి సిద్ధంగా ఉంది. రాబోయే 12 నెలల్లో ఆస్ట్రేలియా, ఇంగ్లండ్, మళ్లీ న్యూజిలాండ్ జట్లే పాకిస్తాన్‌లో పర్యటించాల్సి ఉంది. దీంతో ఆ సిరీస్‌లపై కూడా ఇప్పుడు నీలినీడలు కమ్మకున్నాయి.

Also Read: IPL 2021: ఐపీఎల్ గెలిచేది ఆ జట్టే.. నన్ను పూర్తిగా ఆశ్చర్యపరిచింది.. జోస్యం చెప్పిన మాజీ క్రికెటర్!

Also Read: Kohli T20 Record: టీ20 కెప్టెన్‌గా కొహ్లీ సూపర్‌ హిట్‌.. రికార్డుల్లో సరిలేరు విరాట్‌కెవ్వరు

Also Read: Yuzvendra Chahal: పాత చాహల్ తిరిగొచ్చాడు.. ఈ ఫీలింగ్ చాలా బాగుంది: బెంగళూరు స్పిన్నర్ చాహల్

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Mukesh Ambani: ప్రాణమిత్రుడు మోడీకి రూ.1500 కోట్ల విలువైన భవనం రాసిచ్చిన ముఖేష్ అంబానీ - కుబేర మిత్రులు ఉంటే ఎంత ఉపయోగమో కదా!
ప్రాణమిత్రుడు మోడీకి రూ.1500 కోట్ల విలువైన భవనం రాసిచ్చిన ముఖేష్ అంబానీ - కుబేర మిత్రులు ఉంటే ఎంత ఉపయోగమో కదా!
ONGC Gas Blowout: ఇరుసుమండలో ఇంకా ఆరని మంటలు.. గొడుగు రూపంలో మంటలు ఆర్పుతున్న సిబ్బంది
ఇరుసుమండలో ఇంకా ఆరని మంటలు.. గొడుగు రూపంలో మంటలు ఆర్పుతున్న సిబ్బంది
Nicolas Maduro: ఇంటి నుంచి నన్ను కిడ్నాప్ చేశారు.. నేను యుద్ధ ఖైదీని, నిజాయితీపరుడిని: అమెరికా కోర్టులో నికోలస్ మదురో
నన్ను కిడ్నాప్ చేశారు.. నేను యుద్ధ ఖైదీని, నిజాయితీపరుడిని: అమెరికా కోర్టులో నికోలస్ మదురో
Telangana Ticket Hikes: తెలంగాణలో టికెట్ రేట్స్... అటు 'దిల్' రాజు, ఇటు కోమటిరెడ్డి... మధ్యలో సీఎం రేవంత్ రెడ్డి
తెలంగాణలో టికెట్ రేట్స్... అటు 'దిల్' రాజు, ఇటు కోమటిరెడ్డి... మధ్యలో సీఎం రేవంత్ రెడ్డి

వీడియోలు

History Behind Peppé Buddha Relics | భారత్‌కు తిరిగి వచ్చిన బుద్ధుని అస్థికలు! | ABP Desam
అగార్కర్‌పై మహ్మద్ షమి కోచ్ సంచలన కామెంట్స్
రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్‌గా రవీంద్ర జడేజా!
ఫార్మ్ లో లేడని తెలుసు  కానీ ఇలా చేస్తారని అనుకోలేదు: రికీ పాంటింగ్
ఇంకా అందని ఆసియా కప్ ట్రోఫీ.. నఖ్వీ షాకింగ్ కామెంట్స్..

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Mukesh Ambani: ప్రాణమిత్రుడు మోడీకి రూ.1500 కోట్ల విలువైన భవనం రాసిచ్చిన ముఖేష్ అంబానీ - కుబేర మిత్రులు ఉంటే ఎంత ఉపయోగమో కదా!
ప్రాణమిత్రుడు మోడీకి రూ.1500 కోట్ల విలువైన భవనం రాసిచ్చిన ముఖేష్ అంబానీ - కుబేర మిత్రులు ఉంటే ఎంత ఉపయోగమో కదా!
ONGC Gas Blowout: ఇరుసుమండలో ఇంకా ఆరని మంటలు.. గొడుగు రూపంలో మంటలు ఆర్పుతున్న సిబ్బంది
ఇరుసుమండలో ఇంకా ఆరని మంటలు.. గొడుగు రూపంలో మంటలు ఆర్పుతున్న సిబ్బంది
Nicolas Maduro: ఇంటి నుంచి నన్ను కిడ్నాప్ చేశారు.. నేను యుద్ధ ఖైదీని, నిజాయితీపరుడిని: అమెరికా కోర్టులో నికోలస్ మదురో
నన్ను కిడ్నాప్ చేశారు.. నేను యుద్ధ ఖైదీని, నిజాయితీపరుడిని: అమెరికా కోర్టులో నికోలస్ మదురో
Telangana Ticket Hikes: తెలంగాణలో టికెట్ రేట్స్... అటు 'దిల్' రాజు, ఇటు కోమటిరెడ్డి... మధ్యలో సీఎం రేవంత్ రెడ్డి
తెలంగాణలో టికెట్ రేట్స్... అటు 'దిల్' రాజు, ఇటు కోమటిరెడ్డి... మధ్యలో సీఎం రేవంత్ రెడ్డి
Mahindra XUV 7XO: 7 ఎయిర్‌బ్యాగ్‌లతో మహీంద్రా XUV7XO ఎస్‌యూవీ లాంచ్.. ధర, సేఫ్టీ ఫీచర్లు చూసి కొనేయండి
7 ఎయిర్‌బ్యాగ్‌లతో మహీంద్రా XUV7XO ఎస్‌యూవీ లాంచ్.. ధర, సేఫ్టీ ఫీచర్లు చూసి కొనేయండి
TG Sankranti Holidays: విద్యార్థులకు పండగే.. సంక్రాంతి సెలవులు ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం
విద్యార్థులకు పండగే.. సంక్రాంతి సెలవులు ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం
Gold vs Silver for Investment : బంగారం 2026లో మరింత లాభాలనిస్తుందా? పెట్టుబడితో వెండిని మించి రాబడి పొందొచ్చా?
బంగారం 2026లో మరింత లాభాలనిస్తుందా? పెట్టుబడితో వెండిని మించి రాబడి పొందొచ్చా?
Thiruparankundram: ఆ కొండపై దీపం వెలిగించుకోవచ్చు - మద్రాస్ హైకర్టు సంచలన తీర్పు - స్టాలిన్ సర్కార్ ఇక ఆపలేదు !
ఆ కొండపై దీపం వెలిగించుకోవచ్చు - మద్రాస్ హైకర్టు సంచలన తీర్పు - స్టాలిన్ సర్కార్ ఇక ఆపలేదు !
Embed widget