అన్వేషించండి

Kohli T20 Record: టీ20 కెప్టెన్‌గా కొహ్లీ సూపర్‌ హిట్‌.. రికార్డుల్లో సరిలేరు విరాట్‌కెవ్వరు

ప్రస్తుత భారత కెప్టెన్ విరాట్ కోహ్లీ అందరికీ షాకిస్తూ టీ20 కెప్టెన్సీకి గుడ్ బై చెప్పాడు. కెప్టెన్‌గా ఉన్నప్పుడు కోహ్లి సాధించిన రికార్డులు ఇవే.

అందరికీ షాకిస్తూ భారత కెప్టెన్ విరాట్ కోహ్లీ టీ20 వరల్డ్ కప్ తర్వాత టీ20 కెప్టెన్సీని వదిలేస్తున్నట్లు ప్రకటించారు. టీ20ల్లో కెప్టెన్ అయిన తర్వాత విరాట్ కోహ్లీ బ్యాటింగ్ మరీ అంత తీసికట్టుగా ఏమీ లేదు. ముఖ్యంగా టీ20ల్లో ప్రధానంగా చూసే స్ట్రైక్ రేట్ అయితే మరింత మెరుగుపడింది. కెప్టెన్ కాకముందు 135.48 స్ట్రైక్ రేట్‌తో పరుగులు చేసిన విరాట్.. కెప్టెన్‌గా ఉన్నప్పుడు 143.18 స్ట్రైక్ రేట్‌తో బ్యాటింగ్ చేయడం విశేషం. SENA(సౌత్ ఆఫ్రికా, ఇంగ్లండ్, న్యూజిలండ్, ఆస్ట్రేలియా) దేశాల్లో ద్వైపాక్షిక టీ20 సిరీస్‌ల గెలుపుతో అక్కడ కూడా దేశం మీసం తిప్పాడు.

ఒక్కసారి టీ20ల్లో కోహ్లీ కెప్టెన్సీ రికార్డును పరిశీలిస్తే.. 

1. మొత్తం 45 మ్యాచ్‌లకు కెప్టెన్సీ వహించగా.. అందులో 27 విజయాలు, 14 ఓటములు ఉన్నాయి. నాలుగు మ్యాచ్‌ల్లో ఫలితం రాలేదు. కోహ్లీ విజయాల శాతం 65.11గా ఉంది.

2.అంతర్జాతీయ టీ20 మ్యాచ్‌ల్లో విరాట్ కోహ్లీ కెప్టెన్‌గా 1502 పరుగులు సాధించాడు. టీ20ల్లో అత్యధిక పరుగులు సాధించిన భారత కెప్టెన్ కోహ్లీనే.

3. టీ20ల్లో భారత జట్టుకు అత్యధిక విజయాలు అందించిన కెప్టెన్ల జాబితాలో కోహ్లి రెండో స్థానంలో ఉన్నాడు. మహేంద్ర సింగ్ ధోని 42 విజయాలతో ఈ జాబితాలో మొదటి స్థానంలో ఉన్నాడు.

4. అంతర్జాతీయ టీ20ల్లో కెప్టెన్‌గా 1000 పరుగులు చేసిన వేగవంతమైన ఆటగాడు కోహ్లీనే. 30 ఇన్నింగ్స్‌తో కోహ్లీ ఈ ఘనత సాధించడం విశేషం.

5. SENA(సౌత్ ఆఫ్రికా, ఇంగ్లండ్, న్యూజిలండ్, ఆస్ట్రేలియా) దేశాల్లో ద్వైపాక్షిక టీ20 సిరీస్‌లు గెలిచిన మొదటి/ఏకైన భారతీయ కెప్టెన్ కోహ్లీనే. 2020లో న్యూజిలాండ్‌ను 5-0తో, ఆస్ట్రేలియాను 2-1తో, 2018లో ఇంగ్లండ్‌ను 2-1తో, దక్షిణాఫ్రికాను 2-1తో ఆయాదేశాల్లోనే ఓడించి రికార్డు సృష్టించాడు.

6. మొత్తం 27 విజయాలతో ప్రపంచంలో అత్యధిక అంతర్జాతీయ టీ20 విజయాలు సాధించిన కెప్టెన్లలో నాలుగో స్థానంలో విరాట్ ఉన్నాడు. ఈ జాబితాలో అస్గర్ ఆఫ్ఘన్(ఆఫ్ఘనిస్తాన్) మొదటిస్థానంలో ఉండగా, రెండో స్థానంలో మహేంద్ర సింగ్ ధోని, మూడో స్థానంలో ఇయాన్ మోర్గాన్(ఇంగ్లండ్) ఉన్నారు.

విరాట్ కోహ్లి వ్యక్తిగత బ్యాటింగ్ రికార్డులు(కెప్టెన్‌గా)
ఆడిన మ్యాచ్‌లు: 45
ఇన్నింగ్స్: 43
నాటౌట్లు: 12
పరుగులు: 1502
అత్యధిక స్కోరు: 94 నాటౌట్
సగటు: 48.45
ఎదుర్కొన్న బంతులు: 1049
స్ట్రైక్ రేట్: 143.18
100లు: 0
50లు: 12
4లు: 109
6లు: 58

విరాట్ కోహ్లి వ్యక్తిగత బ్యాటింగ్ రికార్డులు(కెప్టెన్ కాకముందు)
ఆడిన మ్యాచ్‌లు: 45
ఇన్నింగ్స్: 41
నాటౌట్లు: 12
పరుగులు: 1657
అత్యధిక స్కోరు: 90 నాటౌట్
సగటు: 57.13
ఎదుర్కొన్న బంతులు: 1223
స్ట్రైక్ రేట్: 135.48
100లు: 0
50లు: 16
4లు: 176
6లు: 32

Also Read: Kohli Leaves T20 Captaincy: షాక్‌.. షాక్‌.. షాక్‌! టీ20 కెప్టెన్సీకి గుడ్‌బై చెప్పిన విరాట్‌ కోహ్లీ

టాప్ హెడ్ లైన్స్

India Dominates Galle Test:  విజ‌యంపై క‌న్నేసిన భార‌త్, లంక ముందు 372 రన్స్ భారీ టార్గెట్.. ఛేజింగ్‌లో తేలిపోయిన ప్రత్యర్థి
విజ‌యంపై క‌న్నేసిన భార‌త్, లంక ముందు 372 రన్స్ భారీ టార్గెట్.. ఛేజింగ్‌లో తేలిపోయిన ప్రత్యర్థి
National Sports Awards: గాయ‌త్రీ , శ్రీకాంత్ లకు అర్జున అవార్డు.. మొత్తం 17 మందికి ఈ పురస్కారాలు, ఈసారి ఎవరికీ దక్కని ఖేల్ రత్న అవార్డు..  
గాయ‌త్రీ , శ్రీకాంత్ లకు అర్జున అవార్డు.. మొత్తం 17 మందికి ఈ పురస్కారాలు, ఈసారి ఎవరికీ దక్కని ఖేల్ రత్న అవార్డు..  
Siraj Wierd Throw Towords Umpire: అంపైర్ వైపు దూసుకొచ్చిన సిరాజ్ రాకెట్ త్రో.. జడేజా ఫన్నీ రియాక్షన్ తో గాలే టెస్టులో నవ్వులు.. ఆన్ ఎయిర్ లో తిట్టుకున్న కామేంటేటర్లు..!
అంపైర్ వైపు దూసుకొచ్చిన సిరాజ్ రాకెట్ త్రో.. జడేజా ఫన్నీ రియాక్షన్ తో గాలే టెస్టులో నవ్వులు.. ఆన్ ఎయిర్ లో తిట్టుకున్న కామేంటేటర్లు..!
Pujara Bold Strategy: టీమిండియా గెలవాలంటే సాహసోపేత డిక్లరేషన్ ఇవ్వాల్సిందే.. గాలే టెస్ట్ లో నెగ్గాలంటే ఏం చేయాలో చెప్పిన మాజీ క్రికెట‌ర్!
టీమిండియా గెలవాలంటే సాహసోపేత డిక్లరేషన్ ఇవ్వాల్సిందే.. గాలే టెస్ట్ లో నెగ్గాలంటే ఏం చేయాలో చెప్పిన మాజీ క్రికెట‌ర్!

వీడియోలు

India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్
Sunil Gavaskar Questions Players Fitness | టీమిండియా ఫిట్‌నెస్‌పై గవాస్కర్ షాకింగ్ కామెంట్స్
Bigg Boss Agnipariksha Uppal Balu | అగ్నిపరీక్షపై ఉప్పల్ బాలు సంచలన వ్యాఖ్యలు
Jadeja Comments On His Batting Position | బ్యాటింగ్ స్థానాలపై జడేజా తీవ్ర అసంతృప్తి
Anupama Parameswaran about Her Best Friend | అనుపమ పరమేశ్వరన్ షాకింగ్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Tamil Nadu CM Vijay: చంద్రబాబును మించిపోయిన విజయ్‌! మూడో బిడ్డ పుడితే ఏడాది సెలవులు! తమిళనాడు సీఎం కీలక నిర్ణయం!
చంద్రబాబును మించిపోయిన విజయ్‌! మూడో బిడ్డ పుడితే ఏడాది సెలవులు! తమిళనాడు సీఎం కీలక నిర్ణయం!
LPG to PNG Shift: LPG నుంచి PNGకి మారడానికి ప్రభుత్వం సహాయం! డబ్బు ఆదా చేసే ఈ కొత్త సబ్సిడీ స్కీమ్ గురించి తెలుసా?
LPG నుంచి PNGకి మారడానికి ప్రభుత్వం సహాయం! డబ్బు ఆదా చేసే ఈ కొత్త సబ్సిడీ స్కీమ్ గురించి తెలుసా?
Nimmala Ramanaidu: 2027 జూలై వరకు తాగునీటికే మొదటి ప్రాధాన్యత: మంత్రి నిమ్మల రామానాయుడు
2027 జూలై వరకు తాగునీటికే మొదటి ప్రాధాన్యత: మంత్రి నిమ్మల రామానాయుడు
Rajkumari Dayana: సోషల్ మీడియా నెగెటివిటీని ఎదిరించి బిగ్ బాస్ వరకు.. రాజకుమారి దయానా రియల్ లైఫ్ ఆసక్తికర విషయాలు
సోషల్ మీడియా నెగెటివిటీని ఎదిరించి బిగ్ బాస్ వరకు.. రాజకుమారి దయానా రియల్ లైఫ్ ఆసక్తికర విషయాలు
Satyendar Jain Arrest: ఢిల్లీ జల్ బోర్డ్ టెండర్ల కుంభకోణం.. మాజీ మంత్రి సత్యేంద్ర జైన్ అరెస్ట్- బీజేపీపై కేజ్రీవాల్ ఆగ్రహం
ఢిల్లీ జల్ బోర్డ్ టెండర్ల కుంభకోణం.. మాజీ మంత్రి సత్యేంద్ర జైన్ అరెస్ట్- బీజేపీపై కేజ్రీవాల్ ఆగ్రహం
AP Cabinet Decisions: స్థానిక ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు సహా ఏపీ క్యాబినెట్‌ కీలక నిర్ణయాలివే
స్థానిక ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు సహా ఏపీ క్యాబినెట్‌ కీలక నిర్ణయాలివే
CM Revanth Reddy: మహారాష్ట్రలో ఛత్రపతి శివాజీ ఎలాగో.. తెలంగాణలో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్: సీఎం రేవంత్ రెడ్డి
మహారాష్ట్రలో ఛత్రపతి శివాజీ ఎలాగో.. తెలంగాణలో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్: సీఎం రేవంత్ రెడ్డి
National Sports Awards: గాయ‌త్రీ , శ్రీకాంత్ లకు అర్జున అవార్డు.. మొత్తం 17 మందికి ఈ పురస్కారాలు, ఈసారి ఎవరికీ దక్కని ఖేల్ రత్న అవార్డు..  
గాయ‌త్రీ , శ్రీకాంత్ లకు అర్జున అవార్డు.. మొత్తం 17 మందికి ఈ పురస్కారాలు, ఈసారి ఎవరికీ దక్కని ఖేల్ రత్న అవార్డు..  
Embed widget