IPL, 2022 | Match 66 | Dr. DY Patil Sports Academy, Navi Mumbai - 18 May, 07:30 pm IST
(Match Yet To Begin)
KKR
KKR
VS
LSG
LSG
IPL, 2022 | Match 67 | Wankhede Stadium, Mumbai - 19 May, 07:30 pm IST
(Match Yet To Begin)
RCB
RCB
VS
GT
GT

Yuzvendra Chahal: పాత చాహల్ తిరిగొచ్చాడు.. ఈ ఫీలింగ్ చాలా బాగుంది: బెంగళూరు స్పిన్నర్ చాహల్

ఐపీఎల్ రెండో దశ సందర్భంగా అన్ని జట్లూ ముమ్మరంగా ప్రాక్టీస్ చేస్తున్నాయి. ఆర్సీబీ కూడా తమ జట్టు ప్రాక్టీస్ వీడియోను యూట్యూబ్‌లో పోస్ట్ చేసింది. ఈ వీడియోలో యజ్వేంద్ర చాహల్ మాట్లాడారు.

FOLLOW US: 

ఐపీఎల్ రెండో దశ యూఏఈలో ఆదివారం(సెప్టెంబర్ 19వ తేదీ) నుంచి ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు.. తమ జట్టు ప్రాక్టీస్ వీడియోను అధికారిక యూట్యూబ్ చానెల్లో పోస్ట్ చేసింది. ఈ వీడియోలో ఆర్సీబీ ప్రధాన స్పిన్నర్ యజ్వేంద్ర చాహల్ మాట్లాడాడు. పాయింట్ల పట్టికలో మూడో స్థానంలో ఉండటంతో తన ఉత్సాహం రెట్టింపు అయిందని చాహల్ ఆ వీడియోలో పేర్కొన్నాడు. మొత్తం ఏడు మ్యాచ్‌ల్లో ఐదు విజయాలతో ఆర్సీబీ 10 పాయింట్లు సాధించింది.

ఈ ఫీలింగ్ చాలా బాగుందని, ఒత్తిడి కూడా అంతగా లేదని చాహల్ అన్నాడు. ప్రస్తుతం పాయింట్ల పట్టికలో మంచి స్థానంలోనే ఉన్నామని, టేబుల్ టాప్‌కు వెళ్లడానికి కూడా తమకు మంచి అవకాశం ఉందని తెలిపాడు. నెట్స్‌లో బాగా బౌలింగ్ వేసినప్పుడు మంచిగా అనిపిస్తుందని, పాత యజ్వేంద్ర చాహల్ బయటకు వచ్చినట్లు తనకు తెలుస్తుందన్నాడు.

ఐపీఎల్ 14వ సీజన్ భారత్‌లో జరుగుతూ ఉండగానే.. పలువురు ఆటగాళ్లకు కరోనావైరస్ సోకడంతో వాయిదా పడింది. మిగిలిన టోర్నీ సెప్టెంబర్ 19వ తేదీ నుంచి దుబాయ్‌లో ప్రారంభం కానుంది. మొదటిమ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్, ముంబై ఇండియన్స్‌తో పోటీ పడనుంది.

విరాట్ కోహ్లీ, ఏబీ డివిలియర్స్, గ్లెన్ మ్యాక్స్‌వెల్ వంటి విధ్వంసక బ్యాట్స్‌మెన్స్‌కు దేవ్‌దత్ పడిక్కల్ చక్కటి సహకారం అందిస్తున్నాడు. హర్షల్ పటేల్ 17 వికెట్లలో పర్పుల్ క్యాప్‌తో ఉండగా, ఆర్సీబీకే చెందిన మరో బౌలర్ కైల్ జేమీసన్ 9 వికెట్లతో ఈ జాబితాలో ఎనిమిదో స్థానంలో ఉన్నాడు.

ఆర్సీబీ తన మొదటిమ్యాచ్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో పోటీ పడనుంది. సెప్టెంబర్ 20వ తేదీన ఈ మ్యాచ్ జరగనుంది. అనంతరం సెప్టెంబర్ 24వ తేదీన చెన్నై సూపర్ కింగ్స్‌తో కోహ్లీ సేన పోటీ పడనుంది. మొత్తం 31 మ్యాచ్‌ల్లో 13 దుబాయ్‌లో, 10 మ్యాచ్‌లు షార్జాలో, 8 మ్యాచ్‌లు అబుదాబిలో జరగనున్నాయి.

ఐపీఎల్ స్మూత్‌గా జరగడానికి 46 పేజీల హెల్త్ అడ్వైసరీని బీసీసీఐ అందించింది. దీన్ని ఐపీఎల్‌లో భాగమైన అందరూ కచ్చితంగా పాటించాల్సి ఉంటుంది. మొత్తం అన్ని జట్లూ ఐపీఎల్ కోసం ముమ్మరంగా సిద్ధమవుతున్నాయి. 

Also Read: Team India New Coach Application: కోచ్‌గా దిగిపోయేందుకు సిద్ధమైన రవిశాస్త్రి? రాహుల్‌ ద్రవిడ్‌ రాక తప్పదా!
Also Read: IPL 2021: 'అతనో బ్యాటింగ్‌ రాక్షసుడు!'.. బుమ్రా బౌలింగ్‌ను చితకబాదేస్తాడన్న గంభీర్‌
Also Read: Deepak Chahar: అతడు వన్‌డౌన్‌కు ప్రమోట్‌ చేయడంతో అర్ధశతకం బాదేశాను.. ధోనీది సాయం చేసే గుణం
Also Read: CSK Captain: ఎంఎస్ ధోనీ తరువాత సీఎస్కే కెప్టెన్సీ పగ్గాలు ఎవరికి.. ఎల్లో ఆర్మీలో గుబులు.. నేనే అంటున్న సీనియర్ క్రికెటర్!

Published at : 16 Sep 2021 05:25 PM (IST) Tags: RCB Yuzvendra Chahal IPL 2021 Indian Premier League royal challengers bangalore IPL 2021 Second Phase

సంబంధిత కథనాలు

MI vs SRH, Match Highlights: రమణను నమ్మని డేవిడ్‌ - సన్‌రైజర్స్‌ను గెలిపించిన ఆ రనౌట్‌!

MI vs SRH, Match Highlights: రమణను నమ్మని డేవిడ్‌ - సన్‌రైజర్స్‌ను గెలిపించిన ఆ రనౌట్‌!

MI vs SRH, 1 Innings Highlights: ఫైనల్‌ ఆడినట్టుగా చితక్కొట్టిన సన్‌రైజర్స్‌ - ముంబయికి భారీ టార్గెట్‌!

MI vs SRH, 1 Innings Highlights: ఫైనల్‌ ఆడినట్టుగా చితక్కొట్టిన సన్‌రైజర్స్‌ - ముంబయికి భారీ టార్గెట్‌!

MI vs SRH: లక్కు హిట్‌మ్యాన్‌ వైపే! టాస్‌ ఓడిన కేన్‌ మామ!

MI vs SRH: లక్కు హిట్‌మ్యాన్‌ వైపే! టాస్‌ ఓడిన కేన్‌ మామ!

Tilak Varma: ట్విటర్లో తిలక్‌ వర్మ ట్రెండింగ్‌- సన్నీ గావస్కర్‌ సెన్సేషనల్‌ కామెంట్స్‌

Tilak Varma: ట్విటర్లో తిలక్‌ వర్మ ట్రెండింగ్‌- సన్నీ గావస్కర్‌ సెన్సేషనల్‌ కామెంట్స్‌

IPL Playoffs Scenarios: ఆర్సీబీకి హార్ట్ అటాక్‌ తెప్పించిన పంత్‌ సేన! 'జస్ట్‌' ఓడిపోతే ప్లేఆఫ్స్‌కు LSG, RR!

IPL Playoffs Scenarios: ఆర్సీబీకి హార్ట్ అటాక్‌ తెప్పించిన పంత్‌ సేన! 'జస్ట్‌' ఓడిపోతే ప్లేఆఫ్స్‌కు LSG, RR!
SHOPPING
Top Mobiles
LAPTOP AND ACCESORIES
Best Deals

టాప్ స్టోరీస్

Tractor overturned: వరంగల్ జిల్లాలో విషాదం, పెళ్లి బట్టల షాపింగ్‌కు వెళ్తూ మృత్యుఒడికి - ట్రాక్టర్ బోల్తాపడి ఐదుగురి మృతి

Tractor overturned: వరంగల్ జిల్లాలో విషాదం, పెళ్లి బట్టల షాపింగ్‌కు వెళ్తూ మృత్యుఒడికి - ట్రాక్టర్ బోల్తాపడి ఐదుగురి మృతి

Aadhi Pinisetty: ఆది పినిశెట్టి, నిక్కీ గల్రాని హల్దీ ఫంక్షన్ - సందడి చేసిన హీరోలు

Aadhi Pinisetty: ఆది పినిశెట్టి, నిక్కీ గల్రాని హల్దీ ఫంక్షన్ - సందడి చేసిన హీరోలు

KCR On Central Government: పల్లె నిధులపై పంచాయితీ- కేంద్రంపై కేసీఆర్ సీరియస్

KCR On Central Government: పల్లె నిధులపై పంచాయితీ-  కేంద్రంపై కేసీఆర్ సీరియస్

Pollution: ఏటా 90 లక్షల మందిని చంపేస్తున్న కాలుష్యం, టాప్‌లో ఉన్న దేశం అదే

Pollution: ఏటా 90 లక్షల మందిని చంపేస్తున్న కాలుష్యం, టాప్‌లో ఉన్న దేశం అదే