News
News
X

Deepak Chahar: అతడు వన్‌డౌన్‌కు ప్రమోట్‌ చేయడంతో అర్ధశతకం బాదేశాను.. ధోనీది సాయం చేసే గుణం

ఆడిన తొలి ట్రయల్‌ మ్యాచులో 48+ పరుగులు చేయడంతో తనను వన్‌డౌన్‌కు పంపించారని దీపక్‌ చాహర్‌ పేర్కొన్నాడు. ఆ తర్వాత అర్ధశతకం చేశానని గుర్తు చేసుకొన్నాడు.

FOLLOW US: 

రైజింగ్‌ పుణె సూపర్ జెయింట్స్‌కు తనను బ్యాటింగ్‌ ఆల్‌రౌండర్‌ కోటాలోనే ఎంపిక చేసుకున్నారని యువ ఆటగాడు దీపక్‌ చాహర్‌ అన్నాడు. ఆడిన తొలి ట్రయల్‌ మ్యాచులో 48+ పరుగులు చేయడంతో తనను వన్‌డౌన్‌కు పంపించారని పేర్కొన్నాడు. ఆ తర్వాత అర్ధశతకం చేశానని గుర్తు చేసుకొన్నాడు. ఆకాశ్‌ చోప్రా యూట్యూబ్‌ ఛానల్లో అతడు మాట్లాడాడు.

Also read: CSK Captain: ఎంఎస్ ధోనీ తరువాత సీఎస్కే కెప్టెన్సీ పగ్గాలు ఎవరికి.. ఎల్లో ఆర్మీలో గుబులు.. నేనే అంటున్న సీనియర్ క్రికెటర్!

'ఐపీఎల్‌లో మొదట నేను పుణెకు ఆడాను.  నిజానికి స్టీఫెన్‌ ఫ్లెమింగ్‌ సర్‌ నన్ను బ్యాటింగ్‌ ఆల్‌రౌండర్‌గానే ఎంపిక చేశారు. బౌలింగ్‌ ఆల్‌రౌండర్‌గా కాదు. మొదటి ట్రయల్‌ మ్యాచులో నేను 48 లేదా 49 పరుగులు చేశాను. ఆ తర్వాతి మ్యాచులో వన్‌డౌన్‌కు ప్రమోట్‌ చేయడంతో అర్ధశతకం బాదేశాను' అని చోప్రాతో దీపక్‌ అన్నాడు.

Also read: IPL 2021 Update: అభిమానులకు శుభవార్త! ఇక ఐపీఎల్‌ను స్టేడియాల్లో చూడొచ్చు.. షరతులు వర్తిస్తాయి!

'పుణె తర్వాత నేను చెన్నైకి వచ్చాను. అన్ని విభాగాల్లోని ఆటగాళ్ల ఎదుగుదలకు ఎంఎస్‌ ధోనీ సాయం చేస్తుంటాడు. 2018లో ఓ మ్యాచులో నన్ను అతడి కన్నా ముందుగా పంపించాడు. 19-20 బంతుల్లోనే నేను 40+ పరుగులు చేశాను. ఐతే ఆ తర్వాత బ్యాటింగ్‌ చేసేందుకు ఎక్కువ అవకాశాలు రాలేదు. బౌలింగ్‌ విభాగంలో పోటీ ఎక్కువగా ఉండటంతో  2014 నుంచే నేను బ్యాటింగ్‌పై దృష్టి సారించాను. బ్యాటుతో కొన్ని పరుగులు చేస్తే ఎంపికయ్యేందుకు ఎక్కువ అవకాశం ఉంటుంది' అని దీపక్‌ తెలిపాడు.

Also read: IPL 2021, Rajasthan Royals: రాజస్థాన్ రాయల్స్‌లో రాజసమెంత? టైటిల్‌ గెలవాలంటే ఏం చేయాలి?

ఇండియన్‌ ప్రీమియర్‌ లీగులో దీపక్‌ చాహర్‌ నిలకడగా రాణిస్తున్నాడు. ఆ జట్టు విజయాల్లో కీలకంగా ఉంటున్నాడు. అతడి బౌలింగ్‌ను ఎంఎస్‌ ధోనీ చక్కగా ఉపయోగించుకోవడమే ఇందుకు కారణం. పిచ్‌ బౌలింగ్‌కు అనుకూలంగా ఉండి, చల్లని వాతావరణం ఉంటే దీపక్‌ రెచ్చిపోతాడు. బంతిని రెండువైపులా స్వింగ్‌ చేస్తూ వికెట్లు తీస్తుంటాడు. చాలా సందర్భాల్లో ధోనీ అతడిని పవర్‌ప్లేలోనే మూడు ఓవర్లు వేయించిన సందర్భాలు ఉన్నాయి. ప్రస్తుతం దుబాయ్‌లోని సీఎస్‌కే శిబిరంలో చాహర్‌ కసరత్తులు చేస్తూ రెండో దశకు సిద్ధమవుతున్నాడు.

Published at : 15 Sep 2021 07:28 PM (IST) Tags: IPL Deepak chahar MS Dhoni IPL 2021 IPL 2021 News stephen flemming

సంబంధిత కథనాలు

India Tour of Zimbabwe, 2022: జింబాబ్వే సిరీస్‌కు టీమిండియా స్క్వాడ్ రెడీ - కెప్టెన్ ఎవరంటే?

India Tour of Zimbabwe, 2022: జింబాబ్వే సిరీస్‌కు టీమిండియా స్క్వాడ్ రెడీ - కెప్టెన్ ఎవరంటే?

గెలిచిన ప్రైజ్‌మనీ తిరిగి శ్రీలంకకే - ఆస్ట్రేలియా క్రికెట్ టీమ్ పెద్ద మనసు!

గెలిచిన ప్రైజ్‌మనీ తిరిగి శ్రీలంకకే - ఆస్ట్రేలియా క్రికెట్ టీమ్ పెద్ద మనసు!

BCCI over IPL Team Owners: ఐపీఎల్‌ ఓనర్లకు భయపడుతున్న బీసీసీఐ! ఎందుకంటే?

BCCI over IPL Team Owners: ఐపీఎల్‌ ఓనర్లకు భయపడుతున్న బీసీసీఐ! ఎందుకంటే?

Fact Check: బీసీసీఐ ఛైర్మన్‌ పదవికి గంగూలీ రాజీనామా! కొత్త ఛైర్మన్‌గా జే షా!! నిజమేనా?

Fact Check: బీసీసీఐ ఛైర్మన్‌ పదవికి గంగూలీ రాజీనామా! కొత్త ఛైర్మన్‌గా జే షా!! నిజమేనా?

Rishabh Pant on Urvashi Rautela: నన్ను వదిలెయ్‌ చెల్లెమ్మా! ఊర్వశి రౌటెలాపై పంత్‌ పంచ్‌లు!

Rishabh Pant on Urvashi Rautela: నన్ను వదిలెయ్‌ చెల్లెమ్మా! ఊర్వశి రౌటెలాపై పంత్‌ పంచ్‌లు!

టాప్ స్టోరీస్

TS ECET Results 2022: తెలంగాణ ఈసెట్ ఫలితాలు విడుదల, రిజల్ట్స్ ఇక్కడ చూసుకోండి!

TS ECET Results 2022: తెలంగాణ ఈసెట్ ఫలితాలు విడుదల, రిజల్ట్స్ ఇక్కడ చూసుకోండి!

Nizamabad: పెళ్లి చేయట్లేదని తండ్రి, బాబాయ్‌ హత్య - కర్రతో చావ బాదిన కొడుకు!

Nizamabad: పెళ్లి చేయట్లేదని తండ్రి, బాబాయ్‌ హత్య - కర్రతో చావ బాదిన కొడుకు!

Actor Prithvi On Nude Video: వ్రతం ముందురోజే ఆ దరిద్రం చూశా, అక్కాచెల్లెళ్లు ఫోన్లు చూడొద్దు - నటుడు పృథ్వీ

Actor Prithvi On Nude Video: వ్రతం ముందురోజే ఆ దరిద్రం చూశా, అక్కాచెల్లెళ్లు ఫోన్లు చూడొద్దు - నటుడు పృథ్వీ

Malik Review: మాలిక్ రివ్యూ: ఫహాద్ ఫాజిల్ గ్యాంగ్‌‌స్టర్ థ్రిల్లర్ ఆకట్టుకుంటుందా?

Malik Review: మాలిక్ రివ్యూ: ఫహాద్ ఫాజిల్ గ్యాంగ్‌‌స్టర్ థ్రిల్లర్ ఆకట్టుకుంటుందా?