CSK Captain: ఎంఎస్ ధోనీ తరువాత సీఎస్కే కెప్టెన్సీ పగ్గాలు ఎవరికి.. ఎల్లో ఆర్మీలో గుబులు.. నేనే అంటున్న సీనియర్ క్రికెటర్!
MS Dhoni Retirement: నిలకడగా రాణించే జట్లలో చెన్నై సూపర్ కింగ్స్ (CSK) ముందు వరుసలో ఉంటుంది. అందుకు కారణం ఎంఎస్ ధోనీ సారథ్యం. అయితే ధోనీ తరువాత సీఎస్కే కెప్టెన్ ఎవరు అవుతారని చర్చ మొదలైంది.
ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో నిలకడగా రాణించే జట్లలో చెన్నై సూపర్ కింగ్స్ (CSK) ముందు వరుసలో ఉంటుంది. మధ్యలో రెండేళ్లు నిషేధం కారణంగా.. ఆ జట్టు రెండు సీజన్లలో పాల్గొనలేదు. ఆపై ఐపీఎల్ లో కొనసాగుతూనే మునుపటిలా ప్రదర్శన చేస్తోంది సీఎస్కే. ఎంఎస్ ధోనీ సారథ్యంలో చెన్నై జట్టు ఒక్క సీజన్ మినహా ఆడిన ప్రతి సీజన్లోనూ ప్లే ఆఫ్స్ కు చేరుకుంది. యెల్లో ఆర్మీ అనగానే అభిమానులకు గుర్తొచ్చేది సీఎస్కే జట్టు, కెప్టెన్ ఎంఎస్ ధోనీ.
కొన్నేళ్ల కిందట టెస్టులకు రిటైర్మెంట్ ప్రకటించిన ధోనీ.. గత ఏడాది ఐపీఎల్ 2020 ప్రారంభానికి కొన్ని రోజుల ముందు పరిమిత ఓవర్ల క్రికెట్ కు వీడ్కోలు పలికాడు. ఆ సీజన్లో ధోనీ అంతగా రాణించలేదు. దాంతో ఐపీఎల్ 2021లో ధోనీ ఆడటని, అతడి స్థానంలో కొత్త కెప్టెన్ ఎవరు అనే చర్చ సైతం జరిగింది. కానీ మరో రెండేళ్లు ధోనీ కొనసాగుతాడని ఐపీఎల్ ప్రారంభంలోనే సీఎస్కే ఫ్రాంచైజీ క్లారిటీ ఇస్తూ వదంతులకు చెక్ పెట్టింది. ఐపీఎల్ 2021లోనూ ధోనీ ప్రదర్శన అంత గొప్పగా ఏమీ లేదు. కానీ కెప్టెన్సీలో ధోనీని అంత తేలికగా తీసుకోలేరు. ధోనీ సారథ్యంలోని జట్టుపై ఆడి నెగ్గటం అంత సులువు కాదని ప్రత్యర్థి జట్టు కెప్టెన్లు సైతం భావిస్తారంటే అతిశయోక్తి కాదు.
Also Read: అభిమానులకు శుభవార్త! ఇక ఐపీఎల్‌ను స్టేడియాల్లో చూడొచ్చు.. షరతులు వర్తిస్తాయి!
😂⚔️🔥#WhistlePodu | @imjadeja 🦁 pic.twitter.com/Mnx93U9qCa
— CSK Fans Army™ 🦁 (@CSKFansArmy) September 14, 2021
ధోనీ తరువాత కెప్టెన్ ఎవరు...
ఎంఎస్ ధోనీ కెప్టెన్సీలో సీఎస్కే జట్టు మూడు పర్యాయాలు ఛాంపియన్ గా నిలిచింది. ఈ ఏడాది సైతం పాయింట్ల పట్టికలో మెరుగైన స్థానంలోనే ఉంది. సీజన్ సెకండాఫ్‌లో సీఎస్కే జట్టు మరింత ప్రమాదకారి. అయితే ఎంఎస్ ధోనీ ఐపీఎల్‌కు రిటైర్మెంట్ ప్రకటిస్తే పరిస్థితి ఏంటి అని సీఎస్కే ఫ్రాంచైజీ, ఆటగాళ్లతో పాటు ఫ్యాన్స్ మదిలో ప్రశ్న మెదులుతోంది. సీఎస్కే ఫ్యాన్స్ ఆర్మీ ట్విట్టర్‌లో ఇదే ప్రశ్నతలెత్తింది. ధోనీ తరువాత సీఎస్కే సారథిగా మీరు ఎవరిని అనుకుంటున్నారు అని ఆ పేజీలో ట్వీట్ చేశారు.
Also Read: రాజస్థాన్ రాయల్స్‌లో రాజసమెంత? టైటిల్ గెలవాలంటే ఏం చేయాలి?
రంగంలోకి దిగిన ఆల్ రౌండర్..
ధోనీ తరువాత కెప్టెన్ తాను అని ప్రత్యక్షంగా చెప్పకపోయినా పరోక్షంగా ఆ విషయాన్ని తెలిపాడు ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా. ధోనీ తరువాత కెప్టెన్‌గా ఎవర్ని ఎంచుకుంటారన్న ప్రశ్నకు 8 అని బదులిచ్చాడు. వాస్తవానికి అది జడేజా సీఎస్కే జెర్సీ నెంబర్. ధోనీ జెర్సీ నెంబర్ 7 అని అందరికీ తెలిసిందే. ఈ నేపథ్యంలో 7 తరువాత కెప్టెన్ గా 8 అని జడేజా తన మనసులో మాటను చెప్పకనే చెప్పేశాడు అని ఎల్లో ఆర్మీ, నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. జడేజా అలా రిప్లై ఇవ్వలేదని, ఫేక్ అకౌంట్ అని కొందరు సీఎస్కే ఫ్యాన్స్ కామెంట్ చేస్తున్నారు. ధోనీ తరువాత జడేజా లాంటి ఆటగాడికి కెప్టెన్సీ ఇవ్వడంలో ఆశ్చర్యమేమీ లేదన్న అభిప్రాయాలు సైతం వ్యక్తమవుతున్నాయి.
ఐపీఎల్ లో ఓవరాల్ గా 191 మ్యాచ్‌లాడిన జడేజా 120 వికెట్లు పడగొట్టాడు. 2,290 పరుగులతో ఐపీఎల్‌లో బ్యాట్ తోనూ రాణించాడు. ప్రస్తుత సీజన్లో 7 మ్యాచ్‌లాడిన జడేజా 6.70 ఎకానమితో 6 వికెట్లు సాధించడంతో పాటు 131 పరుగులు చేశాడు.