Neeraj Chopra : దట్ బ్లడీ ఇంచ్ ! సెంటీమీటర్ తేడాతో రెండో స్థానంలో నీరజ్
Neeraj Chopra: గోల్డెన్ బాయ్ నీరజ్ చోప్రా డైమండ్ లీగ్ ఫైనల్స్‌లో మరోసారి రెండో స్థానంతో సరిపెట్టుకున్నాడు పోటీలో అత్యుత్తమంగా 87.86 మీటర్ల దూరం ఈటెను విసిరినా ఫలితం లేక పోయింది.

Neeraj Chopra misses Diamond League crown by 1 cm, finishes second in final: భారత స్టార్ జావెలిన్ త్రోయర్ నీరజ్ చోప్రా(Neeraj Chopra)ను దురదృష్టం వెంటాడింది. కేవలం ఒక్కటంటే ఒక్క సెంటీమీటర్ వ్యత్యాసంతో నీరజ్ చోప్రా ప్రతిష్టాత్మక డైమండ్ లీగ్(Diamond League)లో రెండో స్థానంలో నిలిచాడు. గతంలోనూ ఈ డైమండ్ లీగ్ ఫైనల్‌లో రెండో స్థానంలోనే నిలిచిన నీరజ్... మళ్లీ అదే స్థానంలోనే నిలిచాడు. ఈసారి అగ్రస్థానంపై కన్నేసిన నీరజ్.. తీవ్రంగా పోరాడినా రెండో స్థానానికే పరిమితమయ్యాడు. ఈ పోటీలో ఆరు ప్రయత్నాల్లో నీరజ్ అత్యుత్తమంగా 87.86 మీటర్ల దూరం జావెలిన్‌ను విసిరాడు. గ్రెనడాకు చెందిన పీటర్స్ అండర్సన్ 87.87 మీటర్లతో అగ్రస్థానంలో నిలిచాడు. ఈ ఫైనల్లో నీరజ్‌కు-పీటర్స్ అండర్సన్‌కు మధ్య దూరం కేవలం ఒకే ఒక్క సెంటీమీటర్ కావడం విశేషం.
Neeraj Chopra Brilliant Throw of 87.86m 💥
— The Khel India (@TheKhelIndia) September 14, 2024
He finishes as Runner up of Diamond League 2024 , Just short of 1 cm from Champion Peters 💔
Despite Groin Injury, Neeraj gave his best 🇮🇳👏pic.twitter.com/rbmzBNOXRj
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

