Vinod Kambli Complaint: టీమిండియా మాజీ క్రికెటర్ వినోద్ కాంబ్లీకి చేదు అనుభవం.. పోలీసుల్ని ఆశ్రయించిన సచిన్ బాల్య మిత్రుడు
సచిన్ టెండూల్కర్ బాల్య మిత్రుడు, టీమిండియా మాజీ క్రికెటర్ వినోద్ కాంబ్లీకి చేదు అనుభవం ఎదురైంది. ముంబైలోని బాంద్రా పోలీసులను ఆశ్రయించిన కాంబ్లీ ఫిర్యాదు మేరకు కేసు నమోదైంది.
ఇంటర్నెట్, సోషల్ మీడియా వాడకం రోజురోజుకూ పెరిగిపోతోంది. అయితే టెక్నాలజీని ఎన్నో మంచి పనులకు ఉపయోగించుకుంటూ సమయాన్ని అందుకు అనుగుణంగా వినియోగించుకునే వాళ్లు ఉన్నారు. అదే టెక్నాలజీతో బురిడీ కొట్టించి సైబర్ నేరాలకు పాల్పడే వారి సంఖ్య పెరిగిపోతోంది. సామాన్యులతో పాటు సెలబ్రిటీలను సైతం సైబర్ నేరగాళ్లు వదిలిపెట్టడం లేదు. తాజాగా టీమిండియా మాజీ క్రికెటర్‌కు సైతం వింత అనుభవం ఎదురైంది.
సచిన్ టెండూల్కర్ బాల్య మిత్రుడు, టీమిండియా మాజీ క్రికెటర్ వినోద్ కాంబ్లీ ఆన్‌లైన్ మోసానికి గురయ్యారు. నో యువర్ కస్టమర్ (KYC) పేరుతో కాల్ చేసిన ఓ వ్యక్తి కాంబ్లీకి కుచ్చుటోపీ పెట్టాడు. డిసెంబర్ 3న కేవైసీ అప్ డేట్ చేసుకోవాలంటూ వచ్చిన కాల్‌కు మాజీ క్రికెటర్ కాంబ్లీ స్పందించాడు. వాళ్లు అడిగిన లింకులు క్లిక్ చేసి వివరాలు అప్ డేట్ చేయగా బ్యాంకు ఖాతా నుంచి రూ.1.13 లక్షలు లాగేశారు. వరుసగా కాల్స్ రావడంతో వివరాలు సబ్మిట్ చేయగా కాంబ్లీ బ్యాంక్ ఖాతా నుంచి షాపింగ్ చేసినట్లుగా కొన్ని ట్రాన్సాక్షన్స్ జరిగాయి. కాంబ్లీ గుర్తించేలోగా జరగాల్సిన నష్టం జరిగిపోయింది.
Mumbai: An FIR registered at Bandra Police Station, against unidentified person, based on a complaint by former cricketer Vinod Kambli of being duped of Rs 1,13,998 on the pretext of KYC update.
— ANI (@ANI) December 10, 2021
(File photo) pic.twitter.com/CsNoQY1cWd
తాను మోసపోయానని తెలుసుకున్న వినోద్ కాంబ్లీ ముంబైలోని బాంద్రా పోలీసులను ఆశ్రయించారు. కాంబ్లీ ఫిర్యాదు మేరకు బాంద్రా సైబర్ పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టారు. కాంబ్లీ బ్యాంక్ ఖాతా నుంచి నగదు బదిలీ అయినట్లు గుర్తించారు. బ్యాంక్ ఎగ్జిక్యూటివ్ అని చెప్పి ఫోన్‌కాల్ మాట్లాడిన నిందితుడు కాంబ్లీతో ఓ యాప్ డౌన్ లోడ్ చేయించాడు. తద్వారా ఫోన్ వివరాలు సేకరించిన నిందితుడు ఓటీపీ చెప్పాలని కోరగా.. కాంబ్లీ ఆ వ్యక్తికి తెలిపాడు. ఆ తరువాత కాంబ్లీ మొబైల్ కు వరుసగా మెస్సేజ్‌లు వచ్చాయి.
Also Read: Rahul Dravid: ద్రవిడ్ శాసనం..! కుంబ్లే నాటి రూల్ కఠినతరం చేసిన వాల్.. ఇక ఎంత పెద్ద ఆటగాడైనా..!!
Also Read: Virat Kohli refused: దిగిపోయేందుకు ఒప్పుకోని కోహ్లీ..! విధిలేక వేటు వేసిన బీసీసీఐ.. భారత క్రికెట్లో అనూహ్య పరిణామాలు!