Virat Kohli refused: దిగిపోయేందుకు ఒప్పుకోని కోహ్లీ..! విధిలేక వేటు వేసిన బీసీసీఐ.. భారత క్రికెట్లో అనూహ్య పరిణామాలు!
తనను నాయకత్వ బాధ్యతలు వదిలేయమని సెలక్షన్ కమిటీ చెప్పినా విరాట్ స్పందించలేదని సమాచారం. అతడి నిర్ణయం కోసం ఎదురు చూసిన కమిటీ సభ్యులు విధిలేక హిట్‌మ్యాన్‌ను కెప్టెన్‌గా ఎంపిక చేశారని తెలిసింది.
భారత క్రికెట్లో ఊహించని పరిణామాలు చోటు చేసుకొనే అవకాశం కనిపిస్తోంది! విరాట్ కోహ్లీని కాదని రోహిత్ శర్మను వన్డే కెప్టెన్‌గా ఎంపిక చేయడమే ఇందుకు కారణంగా తెలుస్తోంది. తనను నాయకత్వ బాధ్యతలు వదిలేయమని సెలక్షన్ కమిటీ చెప్పినా విరాట్ స్పందించలేదని సమాచారం. అతడి నిర్ణయం కోసం ఎదురు చూసిన కమిటీ సభ్యులు విధిలేక హిట్‌మ్యాన్‌ను కెప్టెన్‌గా ఎంపిక చేశారని తెలిసింది.
దక్షిణాఫ్రికా పర్యటన కోసం త్వరలో టీమ్‌ఇండియా బయల్దేరనుంది. మూడు టెస్టుల సిరీసు కోసం బుధవారం రాత్రి జట్టును ప్రకటించారు. వన్డే జట్టును ఎంపిక చేయనప్పటికీ రోహిత్‌కు నాయకత్వ బాధ్యతలు అప్పగిస్తున్నట్టు వెల్లడించింది. ఇందుకు విరాట్ కోహ్లీ అంగీకరించలేదని తెలిసింది. నిజానికి రెండు రోజుల ముందు అతడిని వన్డే కెప్టెన్సీ వదిలేయమని సెలక్టర్లు కోరారట. తననే స్వయంగా ప్రకటించాలని కోరినట్టు తెలిసింది.
రెండు రోజులు ఎదురు చూసినప్పటికీ కోహ్లీ తన నిర్ణయం బీసీసీఐ సెలక్షన్ కమిటీకి చెప్పలేదట. దాంతో బుధవారం సమావేశమైన కమిటీ అతడిపై వేటు వేసింది. పరిమిత ఓవర్ల క్రికెట్‌కు ఒకే కెప్టెన్ ఉంటే బాగుంటుందని చర్చించారు. ఇప్పటి వరకు కోహ్లీ ఒక్క ఐసీసీ ట్రోఫీ సాధించని విషయాన్ని వారు ఎత్తిచూపారు! జట్టును ప్రకటించిన తర్వాత రోహిత్‌ను అందుకే కోహ్లీ అభినందించలేదని అంటున్నారు.
'టీ20, వన్డేలకు వేర్వేరు కెప్టెన్లను కొనసాగించే ఉద్దేశం లేదు. ఆలోచనా విధానం, నాయకత్వంలో నిలకడ అవసరమని బీసీసీఐ భావిస్తోంది. ఎప్పుడు చర్చ జరిగినా ఐసీసీ ట్రోఫీలు, పెద్ద మ్యాచులు గెలవకపోవడం పైనే మాట్లాడటం మనం చూశాం. తెలుపు బంతి క్రికెట్ కెప్టెన్‌గా రోహిత్ శర్మపై సెలక్టర్లు నమ్మకం ఉంచారు. అతడి నాయకత్వంలో టీమ్‌ఇండియా ఐసీసీ ట్రోఫీలు ముద్దాడుతుందని మేం నమ్మకంగా ఉన్నాం. కెప్టెన్సీ నుంచి దిగిపోయేముందు కోహ్లీ అంగీకరించాడా లేదా అన్నదానిపై నేను మాట్లాడను. ఏదేమైనా భారత క్రికెట్ ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొనే నిర్ణయాలు ఉంటాయి' అని ఓ బీసీసీఐ అధికారి ఇన్‌సైడ్ స్పోర్ట్‌కు తెలిపారు.
Also Read: ICC Test Rankings: మయాంక్ దూకుడు..! 10 వికెట్ల అజాజ్ ర్యాంకు ఎంత మెరుగైందంటే..!
Also Read: Watch: మళ్లీ కలిసిన యువీ, ధోనీ..! ఎక్కడ.. ఎందుకు?
Also Read: Australian Open 2022: ఆస్ట్రేలియన్ ఓపెన్‌కు ఆ స్టార్ ఆటగాడు దూరం.. వీరిద్దరికీ లక్కీ చాన్స్!
Also Read: Rahul Dravid: ద్రవిడ్ శాసనం..! కుంబ్లే నాటి రూల్ కఠినతరం చేసిన వాల్.. ఇక ఎంత పెద్ద ఆటగాడైనా..!!
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి