By: ABP Desam | Updated at : 24 Jul 2022 05:47 PM (IST)
Edited By: Ramakrishna Paladi
కృనాల్ పాండ్య ( Image Source : Twitter )
Krunal Pandya, wife Pankhuri Sharma blessed with baby boy, see first pics here : టీమ్‌ఇండియా సీనియర్ ఆల్‌రౌండర్ కృనాల్ పాండ్య (Krunal Pandya) తండ్రయ్యాడు. అతడి సతీమణి పంఖూరీ పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. తమకు సంతానం కలిగిన విషయాన్ని ఆదివారం సోషల్ మీడియా వేదికగా ఈ దంపతులు ప్రకటించారు. అభిమానుల కోసం తమ చిన్నారి చిత్రాలను ఇన్‌స్టా, ట్విటర్లో పంచుకున్నారు. తమ కుమారుడికి 'కవిర్ కృనాల్ పాండ్య' అని పేరు పెట్టామని చెబుతూ మురిసిపోయారు.
కృనాల్, పంఖూరీ 2017, డిసెంబర్ 27న పెళ్లి చేసుకున్నారు. అంతకు ముందు, ఏడాది కాలం వీరు ప్రేమించుకున్న సంగతి తెలిసిందే. పెళ్లైన ఐదేళ్ల తర్వాత వీరు తల్లిదండ్రులుగా మారడం గమనార్హం. తనకు క్రికెట్‌ను వీక్షించడం ఇష్టముండదని పంఖూరీ గతంలో పేర్కొంది. అయితే తన భర్త ఆడే ప్రతి మ్యాచునూ ఆస్వాదిస్తానని వెల్లడించింది. 2018లో కృనాల్ టీమ్‌ఇండియా తరఫున టీ20ల్లో అరంగేట్రం చేశాడు. ఇప్పటి వరకు 19 టీ20లు, ఐదు వన్డేలు ఆడాడు.
ప్రస్తుతం కృనాల్ పాండ్య ఫామ్‌లో లేడు. ఐపీఎల్ 2022లోనూ అంతగా రాణించలేదు. అయినప్పటికీ లక్నో సూపర్ జెయింట్స్ అతడికి వరుసగా అవకాశాలు ఇచ్చింది. తిరిగి ఫామ్‌లోకి వచ్చేందుకు అతడు ఇంగ్లాండ్‌లో రాయల్ లండన్ వన్డే ఇంటర్నేషనల్ ఛాంపియన్‌షిప్ ఆడేందుకు నిర్ణయించుకున్నాడు. వార్విక్‌షైర్‌కు ప్రాతినిధ్యం వహించనున్నాడు. ఆగస్టు 2 నుంచి 23 వరకు ఈ టోర్నీ జరుగుతుంది.
కృనాల్ తమ్ముడైన హార్దిక్ పాండ్య గతేడాది తండ్రిగా మారిన సంగతి తెలిసిందే. కుమారుడికి అతడు అగస్త్య అని పేరు పెట్టాడు. ఐపీఎల్ సమయంలో అతడితో కలిసి ఎంజాయ్ చేశాడు. వీలు కుదిరినప్పుడల్లా హార్దిక్ కుటుంబ సభ్యులను తనతో తీసుకెళ్తుంటాడు.
Ross Taylor Slapgate: షాకింగ్ రిపోర్ట్స్! రాస్ టేలర్‌ను కొట్టింది శిల్పాశెట్టి భర్త రాజ్‌కుంద్రా!?
BCCI vs IPL Franchises: బీసీసీఐ, ఐపీఎల్ ఫ్రాంచైజీల మధ్య ముసలం! పరిస్థితి విషమించనుందా?
CWG Champions PM Meeting: ఆటోగ్రాఫ్ చేసిన గ్లోవ్స్‌ను మోదీకిచ్చిన నిఖత్! గమ్చా అలంకరించిన హిమ దాస్!
Bradman Famous Duck Out: క్రికెట్ లెజెండ్ డాన్ బ్రాడ్‌మన్ ఖాతాలో ఫేమస్ డకౌట్ - విచిత్రంగా ముగిసిన కెరీర్
Ross Taylor on IPL Owner: దేవుడా!! డకౌట్ అయ్యాడని క్రికెటర్ చెంపలు వాయించిన ఐపీఎల్ ఓనర్!!
Bandi Sanjay: బండి సంజయ్ పాదయాత్రలో ఉద్రిక్తత, పరస్ఫరం రాళ్లదాడులు - పోలీసులపై బండి ఆగ్రహం
Independence Day 2022: ఎమోషనల్ వీడియో షేర్ చేసిన ఆనంద్ మహీంద్రా, వసుధైక కుటుంబకం అంటూ ట్వీట్
Karthikeya 2 Collections : రెండవ రోజు పెరిగిన 'కార్తికేయ 2' కలెక్షన్లు - మూడో రోజు లాభాల్లోకి?
TTD: 50 మందితో మంత్రిగారి శ్రీవారి దర్శనం, అంతకుముందు ఏకంగా 140 మంది - భక్తుల ఆగ్రహం