By: ABP Desam | Updated at : 28 Feb 2023 05:40 PM (IST)
కేఎల్ రాహుల్ (ఫైల్ ఫొటో)
Indian Batsman: భారత జట్టు ఓపెనింగ్ బ్యాట్స్‌మెన్ కేఎల్ రాహుల్ ప్రస్తుతం తన కెరీర్‌లో బ్యాడ్ ఫేజ్‌లో ఉన్నాడు. కేఎల్ రాహుల్ తన పేలవమైన ఫామ్‌తో నిరంతరం పోరాడుతున్నాడు. ప్రస్తుతం బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో కూడా అతని బ్యాట్ నుంచి సరైన ఇన్నింగ్స్ రాలేదు. రెండు మ్యాచ్‌ల్లో రాహుల్ 12.67 సగటుతో 38 పరుగులు చేశాడు. అత్యధిక సెంచరీలు చేసిన భారత బ్యాట్స్‌మెన్‌ల జాబితాలో కేఎల్ రాహుల్ చేరాడు.
నిజానికి గత మూడేళ్లుగా టెస్టు క్రికెట్‌లో అత్యధిక సెంచరీలు సాధించిన భారత బ్యాట్స్‌మెన్‌లో కేఎల్ రాహుల్ ఒకరు. గత మూడేళ్లలో టెస్టు క్రికెట్‌లో మొత్తం రెండు సెంచరీలు సాధించాడు. అదే సమయంలో కెప్టెన్ రోహిత్ శర్మ ఈ విషయంలో నంబర్ వన్‌గా ఉన్నాడు. ఆ తర్వాత రోహిత్ శర్మ మొత్తం మూడు టెస్టు సెంచరీలు చేశాడు. రోహిత్ శర్మ తర్వాతి స్థానంలో రిషబ్ పంత్ మూడు టెస్టు సెంచరీలతో ఉన్నాడు. ఆశ్చర్యకరంగా ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా కూడా రెండు సెంచరీలతో ఈ లిస్ట్‌లో స్థానం సంపాదించాడు.
గత మూడేళ్లలో టెస్టుల్లో భారత బ్యాట్స్‌మెన్ అత్యధిక సెంచరీలు సాధించిన టాప్-4 ప్లేయర్స్
రోహిత్ శర్మ - మూడు సెంచరీలు.
రిషబ్ పంత్ - మూడు సెంచరీలు.
రవీంద్ర జడేజా - రెండు సెంచరీలు.
కేఎల్ రాహుల్ - రెండు సెంచరీలు.
గత మూడేళ్లలో టెస్ట్ ప్రదర్శన (27 ఫిబ్రవరి 2020 నుంచి 27 ఫిబ్రవరి 2023)
ఈ టైమ్‌లో రిషబ్ పంత్ మొత్తం 21 మ్యాచ్‌లు ఆడాడు. అందులో అతను 36 ఇన్నింగ్స్‌లలో 44.63 సగటుతో మొత్తం 1473 పరుగులు చేశాడు. ఇందులో మూడు సెంచరీలు, తొమ్మిది హాఫ్ సెంచరీలు ఉన్నాయి.
గత మూడు సంవత్సరాల్లో రోహిత్ శర్మ మొత్తం 15 టెస్టు మ్యాచ్‌లు ఆడాడు. ఈ మ్యాచ్‌లలోని 27 ఇన్నింగ్స్‌లలో అతను 47.16 సగటుతో మొత్తం 1179 పరుగులు చేశాడు. ఇందులో రోహిత్ మూడు సెంచరీలు, నాలుగు హాఫ్ సెంచరీలు సాధించాడు.
ఈ మూడు సంవత్సరాల్లో రవీంద్ర జడేజా మొత్తం 14 టెస్ట్ మ్యాచ్‌లు ఆడాడు. అందులో అతను బ్యాటింగ్ చేస్తూ 40.78 సగటుతో మొత్తం 775 పరుగులు చేశాడు. ఇందులో రెండు సెంచరీలు, నాలుగు అర్ధ సెంచరీలు ఉన్నాయి.
మరోవైపు కేఎల్ రాహుల్ ఈ టైమ్ పీరియడ్‌లో మొత్తం 11 టెస్ట్ మ్యాచ్‌లు ఆడాడు. అందులో అతను 30.28 సగటుతో మొత్తం 636 పరుగులు చేశాడు. ఇందులో రెండు సెంచరీలు, రెండు అర్ధ సెంచరీలు ఉన్నాయి.
భారత్- ఆస్ట్రేలియా టెస్ట్ సిరీస్ సందర్భంగా టీమిండియా ఓపెనర్ కేఎల్ రాహుల్ గురించి ఎక్కువగా చర్చ నడుస్తోంది. అన్ని ఫార్మాట్లలోనూ అతడు నిలకడగా విఫలమవుతున్నాడంటూ అన్నివైపుల నుంచి విమర్శలు ఎదుర్కొంటున్నాడు. జట్టులో స్థానం ఎందుకంటూ ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఈ క్రమంలో భారత వెటరన్ ప్లేయర్ దినేశ్ కార్తీక్ కేఎల్ రాహుల్ భవితవ్యంపై కీలక వ్యాఖ్యలు చేశాడు.
ఆసీస్ తో మిగిలిన రెండు టెస్టులకు రాహుల్ విశ్రాంతి తీసుకోవాలని సూచించాడు. ఆ తర్వాత జరిగే వన్డే సిరీస్ కు ఉత్సాహంగా సిద్ధమవ్వాలని చెప్పాడు. 'రాహుల్ పరిస్థితి ఏంటో ఇప్పుడు నాకు అర్ధమవుతోంది. ఎందుకంటే నేనూ ఒకప్పుడు అలాంటి పరిస్థితినే ఎదుర్కొన్నాను. అయితే ఆసీస్ తో మిగిలిన రెండు టెస్టులకు కేఎల్ ను పక్కన పెడితే ఎలాంటి ఆశ్చర్యం లేదు. ఈ నిర్ణయం 2 మ్యాచుల ప్రదర్శనను బట్టి తీసుకున్నది కాదని అతడు గ్రహించాలి. గత 5, 6 టెస్టులుగా రాహుల్ ప్రదర్శన ఏమాత్రం బాగాలేదు. మిగిలిన 2 మ్యాచ్ లకు విశ్రాంతి తీసుకుని తర్వాత జరిగే వన్డే సిరీస్ కు ఉత్సాహంగా సిద్ధమవ్వాలి' అని కార్తీక్ అన్నాడు.
Saweety Boora: గోల్డ్ తెచ్చిన సవీటీ బూరా - మహిళల ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్‌షిప్‌లో భారత్‌కు రెండో స్వర్ణం!
Chris Gayle: క్రిస్ గేల్‌కు ఆర్సీబీ అరుదైన గౌరవం - విరాట్ కోహ్లీ ఏమన్నాడు?
శాంతిభద్రతల్లోనే కాదు ఆటల్లోనూ తగ్గేదేలే
MI vs DC Playing XI: మహిళల ప్రీమియర్ లీగ్ ఫైనల్లో తుదిజట్లు ఎలా ఉండనున్నాయి?
DCW Vs MIW WPL 2023: ఫైనల్స్‌లో ప్లేస్ కోసం ముంబై, యూపీల మధ్య పోటీ - లైవ్ ఎక్కడ చూడచ్చంటే?
Breaking News Live Telugu Updates: ఆకాశంలోకి LVM3 -M3 రాకెట్, ఏకంగా 36 ఉపగ్రహాలు మోసుకెళ్లిన వాహకనౌక
BRS Leaders Fight : ఎల్బీనగర్ బీఆర్ఎస్ నేతల మధ్య వర్గపోరు, మంత్రి కేటీఆర్ సమక్షంలోనే ఘర్షణ
Nara Rohit : రాజకీయాల్లోకి జూ.ఎన్టీఆర్ ? ఎంట్రీ ఎప్పుడో చెప్పిన నారా రోహిత్
TTD News: ఏడుకొండల్లో పెరిగిన రద్దీ, వీకెండ్ వల్ల 26 కంపార్ట్మెంట్లల్లో భక్తులు - దర్శన సమయం ఎంతంటే