Ind vs SL, T20I: లంక సిరీసుకు విరాట్ దూరం? జడ్డూ, షమి, బుమ్రా బ్యాక్
Ind vs SL, T20I: త్వరలో జరిగే శ్రీలంక సిరీసుకు రవీంద్ర జడేజా అందుబాటులో ఉంటాడని తెలిసింది. కాగా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీకి విశ్రాంతి ఇస్తారని సమాచారం.
టీమ్‌ఇండియా సీనియర్ ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా పూర్తిగా కోలుకున్నాడు. త్వరలో జరిగే శ్రీలంక సిరీసుకు అతడు అందుబాటులో ఉంటాడని తెలిసింది. కాగా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీకి టీ20 సిరీసుకు విశ్రాంతి ఇస్తారని సమాచారం.
ప్రస్తుతం టీమ్‌ఇండియా వెస్టిండీస్‌తో తలపడుతోంది. అదవ్వగానే శ్రీలంక జట్టు భారత్ పర్యటనకు వస్తోంది. మూడు టీ20లు, రెండు టెస్టులు ఆడనుంది. న్యూజిలాండ్ సిరీస్ సమయంలో రవీంద్ర జడేజా గాయపడ్డాడు. అప్పటి నుంచి బెంగళూరులోని జాతీయ క్రికెట్ అకాడమీలో రిహాబిలిటేషన్ పొందుతున్నాడు. ప్రస్తుతం అతడు గాయం నుంచి పూర్తిగా కోలుకున్నాడని తెలిసింది. ఫిట్‌నెస్ టెస్టులో పాస్ అయ్యాడని సమాచారం.
ఈ నెల 24 నుంచి లంకతో టీ20లు మొదలవుతాయి. తొలి మ్యాచ్ ఇక్కడే జరుగుతోంది. కోలుకున్న రవీంద్ర జడేజా ఇప్పటికే అక్కడికి చేరుకున్నాడని తెలిసింది. అతడు టెస్టు సిరీసు ఆడటమైతే గ్యారంటీ. వీలుంటే పొట్టి క్రికెట్ సిరీసుకూ ఎంపిక చేసే అవకాశం ఉంది. ప్రస్తుతం జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ షమీ విశ్రాంతి తీసుకుంటున్నారు. లంక సిరీసుకు వారిద్దరూ అందుబాటులోకి వస్తారు. పనిభారం వల్ల వారికి విరామం ఇచ్చిన సంగతి తెలిసిందే.
లంక సిరీసుకు ముందే రోహిత్ శర్మను టీమ్‌ఇండియా టెస్టు కెప్టెన్‌గా ప్రకటించనున్నారు. కాగా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీకి టీ20 సిరీసుకు విశ్రాంతి ఇస్తారని సమాచారం. చాన్నాళ్లుగా అతడు విరామం తీసుకోలేదు. ఇప్పటికే విషయాన్ని సెలక్టర్లు అతడికి వివరించారని అంటున్నారు. పూర్తి వివరాలు ఇంకా తెలియదు. ఆ తర్వాత విరాట్ తన వందో టెస్టును ఆడనున్నాడు.
Also Read: కోహ్లీ నీ తుది శ్వాస విడిచే వరకు ఈ గిఫ్ట్ నీవద్దే ఉంచుకో - సచిన్ భావోద్వేగం
Also Read: సన్‌రైజర్స్‌కు గంభీర్ దెబ్బ - మనీశ్ పాండే ఊచకోత మొదలైంది!
Let's Play!
— BCCI (@BCCI) February 18, 2022
Live - https://t.co/vJtANowUFr #INDvWI @Paytm pic.twitter.com/KE7p8lQShD
West Indies have won the toss and they will bowl first in the 2nd T20I.
— BCCI (@BCCI) February 18, 2022
A look at #TeamIndia Playing XI for the game.
Live - https://t.co/vJtANowUFr #INDvWI @Paytm pic.twitter.com/uY4p96ILmx