Virat Kohli IPL Record: ఐపీఎల్ చరిత్రలో ఒకేఒక్కడు, ఏకంగా 8 వేల పరుగులు
Virat Kohli IPL Record: రన్ మెషీన్ గా పేరున్న కింగ్ కోహ్లి మరో రికార్డ్ సృష్టించాడు. ఐపిఎల్ 2024 చరిత్రలో భాగంగా రాజస్థాన్ తో జరిగిన మ్యాచ్ లో 8 వేల పరుగులు పూర్తి చేసి అరుదైన ఘనత సాధించాడు.
Kohli first player to hit 8000 runs in IPL history: పరుగుల యంత్రం, రికార్డుల రారాజు కోహ్లి (Virat Kohli) అరుదైన ఘనత సాధించాడు. ఐపిఎల్(IPL) చరిత్రలో 8 వేల పరుగుల మైలురాయిని చేరాడు. అహ్మదాబాద్ వేదికగా బుధవారం నాడు రాజస్థాన్ రాయల్స్(RR)తో జరిగిన మ్యాచ్‌లో కోహ్లి 29 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద ఈ మైలురాయిని అందుకున్నాడు. ఈ మ్యాచ్ లో కోహ్లీ 24 బంతులకి 3 ఫోర్ లు ఒక సిక్స్ తో 33 పరుగులు చేశాడు. ఐపిఎల్ చరిత్రలో 252 మ్యాచ్‌లలో 8శతకాలు, 55 అర్ధ సెంచరీలతో 8004 పరుగులతో అత్యధిక పరుగుల స్కోరర్‌గా ఉన్నాడు. రికార్డ్ కు చేరువలో కోహ్లీ తరువాతి స్థానాల్లో శిఖర్ ధావన్ (6769 పరుగులతో), రోహిత్ శర్మ ( 6628 పరుగులతో )ఉన్నారు. పోటీలో మరే ఇతర బ్యాటర్ కూడా 7,000 పరుగులు చేయకపోవడం గమనార్హం.
అత్యధిక పరుగులు చేసిన ..
ఐపీఎల్ చరిత్రలో 252 మ్యాచుల్లో 8004 పరుగులు చేసి విరాట్ కోహ్లి మొదటి స్థానంలో ఉండగా, 222 మ్యాచుల్లో 6769 పరుగులు చేసిన శిఖర్ ధావన్ 2 వ స్థానంలో ఉన్నాడు. ఇక 257 మ్యాచుల్లో 6628 పరుగులు చేసి మూడవ స్థానంలో ఉన్నాడు టీం ఇండియా కెప్టెన్ , హిట్ మ్యాన్ రోహిత్ శర్మ. వీరి తరువాత స్థానంలో 184 మ్యాచుల్లో 6565 పరుగులు చేసిన డేవిడ్ వార్నర్ , 205 మ్యాచుల్లో 5528 పరుగులు చేసిన సురేశ్ రైనా ఉన్నారు . పోటీలో మరే ఇతర బ్యాటర్ కూడా 7,000 పరుగులు కూడా చేయకపోవడం గమనించాలి.
2024లో ఒక సెంచరీ, ఐదు అర్ధసెంచరీలు
2016 సీజన్‌లో 973 పరుగులు చేసిన ఆర్సీబీ స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ, 2024 సీజన్‌లో ఒక సెంచరీ, ఐదు అర్ధసెంచరీలు చేశాడు. అసలు ఎక్కడో అగాధంలో ఉన్న ఆర్సీబీ ప్లే ఆఫ్ వ కోలుకుని ప్లే-ఆఫ్స్‌కు అర్హత సాధించడానికి కోహ్లీ బ్యాటింగ్ ఫామ్ కూడా ఒక ప్రధాన కారణం అని చెప్పుకోవచ్చు. అంటే కాదు ప్రస్తుతం ఆరెంజ్ క్యాప్ హోల్డర్ కూడా విరాటే. ఈ RCB మాజీ కెప్టెన్, CSKతో జరిగిన చివరి మ్యాచ్‌లో మరో రికార్డును కూడా బద్దలు కొట్టాడు, 17 ఎడిషన్లలో ఒక వేదికపై 3000 పరుగులు చేసిన మొదటి IPL బ్యాటర్‌గా నిలిచాడు.
2008 ఏప్రిల్ 18న చిన్నస్వామి స్టేడియంలో కోల్‌కతా నైట్ రైడర్స్‌పై RCB తరపున కోహ్లి IPL అరంగేట్రం చేశాడు. ఆ మ్యాచ్లో అతను ఒక్క పరుగుకే అవుట్ అయ్యాడు. కానీ ఇప్పుడు 86 ఇన్నింగ్స్‌లలో, RCB మాజీ కెప్టెన్ స్టేడియంలో 22 అర్ధ సెంచరీలు మరియు నాలుగు సెంచరీలు కొట్టాడు, అత్యధికంగా 113 పరుగులు చేశాడు. అంతే కాదు కోహ్లి ఒక్క చిన్నస్వామి స్టేడియంలో 3400 కంటే ఎక్కువ పరుగులు చేశాడు. ఇందులో 2012 నుండి భారతదేశం తరపున ఎనిమిది T20Iలలో 116 పరుగులు చేశాడు. అంతకుముందు 700 పరుగుల మార్కును అధిగమించి క్రిస్ గేల్ రికార్డును కోహ్లీ సమం చేశాడు. RCB కోసం గేల్ 2012 మరియు 2013లో రెండుసార్లు 700కి పైగా పరుగులు సాధించాడు, అయితే కోహ్లీ మొదటిసారిగా 2016లో మైలురాయిని అధిగమించాడు. ఇప్పుడు IPL 2024లో మరోసారి తన ఫ్రీ-స్కోరింగ్ రన్‌ను రిపీట్ చేశాడు.