Virat Kohli 10th Mark Sheet: వైరలవుతున్న కోహ్లీ మార్క్ షీట్.. ఏ సబ్జెక్టులో తను టాపో తెలుసా.. సోషల్ మీడియాలో చర్చ
టాప్ చదువుతోనే జీవితంలో ఉన్నతస్థాయికి ఎదుగుతామనే నానుడికి కోహ్లీ తాజా మార్క్ షీట్ చెక్ పెట్టింది. పదో తరగతి లో సగటు మార్కులను కోహ్లీ సాధించాడు. క్రికెట్లో మాత్రం ఎవరెస్ట్ కీర్తీ సాధించాడు.

Virat Kohli News: విరాట్ కోహ్లీ.. క్రికెట్ ప్రపంచంలో ఒక బ్రాండ్.. సచిన్ టెండూల్కర్ నెలకొల్పిన రికార్డులను బద్దలు కొట్టే మొనగాడు కనుచూపు మేరలో లేడని భావిస్తున కాలంలో.. తారాజువ్వలా దూసుకొచ్చి, అదే కన్సిస్టెన్సీతో కొన్ని రికార్డులను బద్దలు కొట్టాడు. అత్యధిక వన్డే శతకాలు, ఒక ఫార్మాట్ లో అత్యధిక శతకాల రికార్డు, వన్డే ప్రపంచకప్ లో అత్యధిక పరుగులు లాంటి ఎన్నో సచిన్ రికార్డులను తను బద్దలు కొట్టాడు. గతేడాది టీ20లకు రిటైర్మెంట్ ప్రకటించిన కోహ్లీ.. ఇటీవల టెస్టులకు అల్విదా అనౌన్స్ చేశాడు. తను కేవలం వన్డే ఫార్మాట్ కే పరిమితం అవుతున్నాడు. అది కూడా మాగ్జిమం రెండు సంవత్సరాలని తెలుస్తోంది. 2027 వన్డే ప్రపంచకప్ తర్వాత తను ఈ ఫార్మాట్ నుంచి కూడా వైదొలగవచ్చు. ఇక తాజాగా అతనికి సంబంధించిన పదో తరగతి మార్కుల లిస్టు సోషల్ మీడియాను షేక్ చేసింది. దీనిపై నెటిజన్లు తమకు తోచిన కామెంట్లు పెడుతూ, విపరీతంగా లైకులు, షేర్లు చేస్తున్నారు.
🚨Virat Kohli mark sheet📜 pic.twitter.com/w9UXb217Xl
— Manobala Vijayabalan (@ManobalaV) May 17, 2025
అ సబ్టెక్టుల్లో తోపు..
కోహ్లీ మార్కుల షీట్ ని పరిశీలిస్తే, ఓవరాల్ గా యావరేజీ మార్కులే వచ్చాయి. మ్యాథ్స్, సైన్స్, ఇంట్రడక్టరీ ఐటీలలో తక్కువ మార్కులు తెచ్చుకోగా, ఇంగ్లీష్, సోషల్ సైన్స్‌లో వరుసగా A1, A2, హిందీలో B1, సైన్స్‌లో C1, మ్యాథ్స్, ఇంట్రడక్టరీ ఐటీలో C2 వచ్చాయి. అతని అత్యధిక మార్కులు ఇంగ్లీష్‌లో 83, సోషల్ సైన్స్‌లో 81 మార్కులు తెచ్చుకున్నాడు. ఈ మార్కుల షీట్‌ను IAS జితిన్ యాదవ్, మనోబాల విజయబాలన్ ఎక్స్‌లో పోస్ట్ చేశారు. ఈ మార్కుల షీట్ అంతగా ఆకట్టుకోకపోయినా విరాట్ కోహ్లీ తాను అనకున్న రంగంలో టాప్ లెవల్ కు చేరుకున్నాడు. 10వ తరగతి బోర్డు పరీక్షలు సెకండరీ స్కూల్‌లో అత్యంత కఠినమైన పరీక్షలు కాబట్టి, చాలా మంది విద్యార్థులు వాటిని తమ భవిష్యత్తుకు నిర్ణయాత్మక అంశంగా భావిస్తారు.
Had marks been the sole factor, the entire nation wouldn't be rallying behind him now.
— Jitin Yadav (@Jitin_IAS) August 9, 2023
Passion and Dedication are the key. @imVkohli pic.twitter.com/aAmFxaghGf
టాక్ ఆఫ్ ద టౌన్..
ఇక ఇటీవల టెస్టు ఫార్మాట్ కు వీడ్కోలు పలికిన కోహ్లీపై క్రికెట్ ప్రపంచలో విపరీతమైన చర్చ నడుస్తోంది. ఇంగ్లాండ్ తో టూర్ కు తనకు కెప్టెన్సీ కావాలని కోహ్లీ కోరగా, అందుకు బీసీసీఐ నిరాకరించిందని, అందుకే కోహ్లీ రిటైర్మెంట్ ప్రకటించాడని ఆరోపణలు వెల్లువెత్తాయి. గతంలో టెస్టుల్లో పది వేల పరుగులు సాధించాలని ఉందని ఎన్నోసార్లు చెప్పిన విరాట్ కోహ్లీ.. ఆ మార్కుకు కేవలం 700+ పరుగుల దూరంగా ఉండగా ఇలా వైదొలగడం అతని అభిమానులను కూడా నిరాశ పరుస్తోంది. ఇక తాజా ఆరోపణల గురించి అటు విరాట్ కోహ్లీ గానీ, ఇటు బోర్డుగానీ ఎలాంటి ప్రకటన విడుదల చేయలేదు.




















